అదిలాబాద్

జీవకోటి మనుగడ కోసమే హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: అంతరించి పోతున్న అటవీ సంపదతో పాటు మానవ జీవకోటికి ప్రాణదారాన్ని అందించేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రపంచంలోనే మూడవ ప్రయత్నంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇది ఓర్వలేక రాజకీయ మనుగడ కోసం ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర అటవీ పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణ శివారులోని గాయత్రి గార్డెన్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె రాజన్నలతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం జిల్లా జైలు వెనకాల గల గ్యాస్ ఏజెన్సీ ఆవరణలో జిసిసి చైర్మెన్ మోహన్ గాంధీ నాయక్, జెసి కృష్ణారెడ్డిలతో కలిసి మొక్కలు నాటారు. అక్కడి నుండి గిరిజన సహకార సంస్థ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఈద్గా మైదానం వెనకాల మదర్సా పిల్లలతో పాటు బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సోసైటి సభ్యులు, టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో 24 శాతం ఉన్న అటవీ సంపదను 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా రాష్టవ్య్రాప్తంగా 40కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామన్నారు. పర్యావరణ సమతుల్యత లోపించడం వల్ల సమాజంలో అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని, సకాలంలో వర్షాలు కురియక దుర్భిక్షం నెలకొంటుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా చేపడుతున్న మహా ఉధ్యమంలో ప్రజలందరూ భాగస్వాములవుతుంటే కాంగ్రెస్ నేతలు కుటిల బుద్దితో ఆరోపనలు చేస్తున్నారన్నారు. గాంధీభవన్‌లో కూడా కాంగ్రెస్ నేతలు మొక్కలు నాటితే ప్రజలు హర్షిస్తారని అన్నారు. ఇదిలా ఉంటే రాజకీయాలకు అతీతంగా సమాజంలోని ప్రతిఒక్కరు స్వచ్చందంగా మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అనంతరం అంకోలి గ్రామంలో 44 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. దీనిలో భాగంగానే గొల్ల కుర్మ కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడు కుల వృత్తుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. అదేవిధంగా బిసిల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే నారుూ బ్రహ్మణ, రజక కులస్తులకు బ్యాంకు లింకేజీలు లేకుండా స్వయం ఉపాధికి రుణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. మొదటిదశ కింద గొర్రెల యూనిట్లురాని లబ్దిదారులు అందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామన్నారు. గొర్రెలను రెట్టింపు చేసే బాధ్యత లబ్ధిదారులు తీసుకుంటే వాటి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అంబులెన్స్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.

చాకపల్లి చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్
బెల్లంపల్లి: మండలంలోని చాకపల్లి గ్రామంలో ఒక కోటి 60 లక్షలవ్యయంతో చేపట్టిన చాకె చెరువును గురువారం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. చెరువు మరమ్మత్తు కాలువ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. డిసెంబర్ మాసంలోగా చెరువు పనులను పూర్తి చేసి వ్యవసాయ పంటలకు నీరు అందిం చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. 500 ఎకరాల ఆయకట్టు నీరందించే సంబంధిత గ్రామాల రైతులతో ముచ్చటించారు. అంతర్ పంటల మార్కెట్‌తో అధిక దిగుబడులు సాధించేలా వ్యవసాయ అధికారుల సూచనల సలహాలు పాటించాలని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్‌లోని మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్‌ను తనిఖీ చేశారు. హాస్టల్‌లోని మధ్యాహ్న భోజనం, విద్యార్థుల వసతి గృహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వసతి గృహంను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. 120 మంది విద్యార్థులకు 90 మంది విద్యార్థులు హాజరయ్యారని 30 మంది విద్యార్థులు గైర్హాజరు కావడంతో ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. సంబంధిత మత పెద్దలతో సంప్రదించి పాఠశాలకు పూర్తి స్థాయిలో పిల్లలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ను హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇరిగేషన్ అధికారి ఈ ఈ వేణుగోపాల్ రావు, డి ఈ సత్యనారాయణ, తహసీల్దార్ సురేష్, ఇతర అధికారులు ఉన్నారు.

అభివృద్ధిని చూసే టిఆర్‌ఎస్‌లో చేరికలు
ఆదిలాబాద్ టౌన్: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోనే తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేడు ప్రతిపక్ష నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం పట్టణంలోని కిసాన్ చౌక్‌లో గల మినీ ట్రాలీ ఆటో యూనియన్‌కు చెందిన సుమారు వంద మంది నాయకులు, డ్రైవర్లు మంత్రి జోగు రామన్న సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి రామన్న పార్టీ కండువాలు కప్పుతూ టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. ఆంధ్ర పాలకుల హయంలో అణచివేతకు గురైన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ళ కాలంలోనే ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. అదే విధంగా షాదిముబారక్, కళ్యాణలక్ష్మి, ఆసరా వంటి పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రతి పక్ష పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రభుత్వంపై బురదజల్లే వ్యాఖ్యాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె రాజన్న, టీఆర్‌ఎస్ నాయకులు యూనిస్ అక్బాని, పట్టణ అధ్యక్షుడు సాజిదోద్దిన్, బండారి సతీష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పోరాట యోధుడు కుమ్రంభీంకు గుర్తింపు
కెరమెరి: ప్రత్యేక రాష్ట్రంలో ఆదివాసుల ఆరాధ్య దైవం గోండు వీరుడు కుమ్రంభీంకు తగిన గౌరవం గుర్తింపు లభించిందని తెలంగాణ రాష్ట్ర గిరిజన సహాకార సంస్థ చైర్మన్ దారవత్తు మోహన్‌గాంధీ నాయక్ అన్నారు. గురువారం మండలంలోని కుమ్రం భీంపోరు గడ్డ జోడేఘాట్‌ను సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్‌కు గ్రామస్థులు బ్యాండ్ మేళాలు గుస్సాడి నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జోడేఘాట్‌లోని కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుమ్రం భీం సమాధి వద్ద మొక్కారు. అనంతరం చైర్మన్ మోహన్‌గాంధీ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీ పోరాట యోధుని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందన్నారు. సమాఖ్య పాలనలో కనుమరుగైన పోరాట వీరుడుని ఖ్యాతిని పోరుగడ్డలో నిధులు వెచ్చించి పర్యాటక కేంద్రం చేయడం ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పెంచిందన్నారు. పోరాట యోధుని పవిత్రమైన స్థలాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జల్, జంగిల్, జమిన్ కోసం నిజాం నవాబులతో పోరాడిన పోరు గడ్డలో సందర్శించే అవకాశం మనకు ముఖ్యమంత్రి కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో ఆదివాసీలు సేకరిస్తున్న అటవీ ఫలాలు, సేకరించే గిరిజనుల సాదాక బాదాలు, దయ విక్రయాలు, గిట్టు బాటు ధరలు, జిసిసి సంస్థలో ఉద్యోగులు , గోదాంలు, జిసిసి కి సరఫరా అయ్యే వనాల స్థితిగతులు క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యాయనం చేయడం జరుగుతుందన్నారు. జిసిసిని అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామన్నారు. 1956లో ఆవిర్భావించిన జిసిసి చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుందని సమాఖ్య పాలకులు ఈ సంస్థను నిర్వీర్యం చేశారన్నారు. ఈసంస్థలో వెలుగు నింపేందుకు కృషి చేస్తామన్నారు. పాల్వంచ, ఆసిఫాబాద్, జిసిసి డివిజన్‌లను రద్దు చేసి ఆంధ్రా ప్రాంతానికి తరలించి తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారన్నారు. జిసిసి అస్తిని గిరిజనులు సేకరించి వచ్చిన ఆదాయాన్ని ఆంధ్ర పాలకులు దోచుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 90శాతం తెనె దొరికే ప్రాంతాలు ఉంటే పది శాతం లేని ఆంధ్ర ప్రాంతంలో తెనే శుద్ధ కర్మాగారం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ చైర్మన్ లచ్చేరావు, డిఎం ప్రతాప్ రెడ్డి, డిటిడివో కృష్ణ నాయక్, ఎపివో నాగోరావు, కుమ్రంభీం మనుమడు కొమురం సోనేరావు, జిసిసి మేనేజర్ ఉపేందర్, జడ్పీటిసి అబ్దుల్ కలాం, మండల ఉపాధ్యక్షులు రాథోడ్ గోవింద్ నాయక్, గ్రామ పటేల్, పెందోర్ సోము, కుమ్రంభీం ఉత్సవ కమిటి చైర్మన్ మడావి రఘునాథ్, నాయకులు దేవ్ రావు, రాథోడ్ శంకర్, ఎస్‌కే యూనస్, తదితరులు పాల్గొన్నారు.

హాస్టళ్ళల్లో అధికారులు బస చేయాలి
ఆదిలాబాద్: జిల్లాలోని వివిధ సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలు తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు విధిగా ఒకరోజు బస చేయాలని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో వెనకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, స్ర్తి శిశు సంక్షేమ శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాల పరిస్థితిపై అధ్యయనం చేసి విద్యార్థుల వౌలిక సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. విద్యా ప్రమాణాలు కూడా మరింత మెరుగుపర్చేందుకు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. సంక్షేమ శాఖల విద్యాలయాలు, వసతిగృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, వౌలిక సదుపాయాలు, వసతిగృహాల్లో సౌకర్యాలను అధికారులు పరిశీలించాలన్నారు. ఆయా స్థలాల్లో సంక్షేమ అధికారులు ఒకరోజు బసచేసి విద్యార్థులు రాత్రి వేలల్లో పాఠ్యాంశాల రివిజన్ వంటి వాటిని పరిశీలించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సుమారు 58,332 మంది విద్యార్థులు ప్రభుత్వ, లోకల్ బాడీ స్కూళ్ళల్లో చదువుతున్నారని, ఇందులో 11,897 మంది ఎస్సీ విద్యార్థులు కాగా, 14223 మంది ఎస్టీ, 24731 మంది బిసి, 7481 మంది ఇతరులు విద్యనభ్యసిస్తున్నారని అన్నారు. ఆయా సంక్షేమ శాఖల ద్వారా అర్హత గల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. బెస్ట్ అవలెబుల్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆయా పాఠశాలల యాజమాన్యంతో చర్చించాలని అన్నారు. జిల్లాలో 35శాతం గిరిజన జనాభా ఉందని, గిరిజన విద్యాభివృద్ధికి అధికారులు చిత్తశుద్దితో నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన వసతి గృహాల్లో రాత్రి వేళల్లో అధికారులు బస చేసే సమయంలో గ్రామ పెద్దలు, పటేల్ వంటి వారిని కూడా సంప్రదించి, వెంట తీసుకువెళ్ళాలన్నారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి చేరినప్పుడే ప్రభుత్వం ఆశించిన ప్రగతి సాధ్యపడుతుందన్నారు. ఈ దిశగా సంక్షేమ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా పనిచేయాలన్నారు. స్టడీ సర్కిళ్ళ ద్వారా నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇవ్వాలని, ఉపాధి అవకాశాలకు నైపుణ్య శిక్షణ అందించాలన్నారు. సమావేశంలో ఆయా సంక్షేమ శాఖల అధికారులు పి.మేఘనాథ్, కిషన్, ఉమాదేవి, గిరిజన సంక్షేమ శాఖ డిడి, ఇంజనీరింగ్ అధికారులు, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

రాంపూర్ కుడికాలువకు గండి
* పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
భీమిని: భీమిని మండలం రాంపూర్ ఎర్ర వాగుపై 2007 సంవత్సరంలో నిర్మించిన ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువలకు మరమ్మత్తులు లేకపోవడంతో ప్రాజెక్ట్ మొత్తం కూరుకుపోయి నీటి నిల్వ సామార్థ్యం తగ్గిపోవడమే కాకుండా రెండు పంటలు పండాల్సి ఉన్నప్పటికీ ఒక పంటకు కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కుడి, ఎడమ కాలువలకు గండి పడటంతో రెండు సంవత్సరాలుగా 15వందల ఎకరాల ఆయాకట్టుకు నీరు అందకుండా పోయింది. దీనితో రైతులు తమ స్వంత ఖర్చులతో గండికి తాత్కాలిక మరమ్మత్తులు చేసుకోని పంటలు పండించుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా ఇరిగేషన్ అదికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆయా కట్టు రైతులు అధికారుల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి కుడి, ఎడమ కాలువలకు మరమ్మత్తులు చేయాలని రైతులు కోరుతున్నారు.

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
* ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
ముధోల్: రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ముధోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. గురువారం ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలోని గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఐడిసి ఆధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎత్తిపోతల పథకం ద్వారా పంటపోలాలకు సాగు నీళ్లు అందించడానికి ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌లు, కాలువలను పరిశీలించి సంబంధిత శాఖ ఆధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం అక్కడే రైతులతో మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడానికి తనవంతుగా పాటుపడతానని అన్నారు. రైతులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావడంతో రాష్ట్ర ఆధికారులకు విన్నవించినట్లు వెల్లడించారు. గ్రామంలోని సమీపంలోనే గోదావరిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం పునరుద్దరణ పనుల కోసం ప్రభుత్వం 3.3కోట్ల రూపాలయ నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఎత్తిపోతల కాలువల ద్వారా గ్రామంలోని రైతులకు అవసరమైన సాగు నీళ్లు అందకపోవడంతో ఇబ్బందులకు గురైయ్యారని వివరించారు. ఎత్తిపోతల పథకం ద్వారా 1500 ఎకరాలకు సాగు నీళ్లు అందుతుందని పేర్కొన్నారు. రైతులకు సకాలంలో సాగునీళ్లు అందించడానికి శాయశక్తుల తనవంతుగా ప్రయత్నిస్తానని హమీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహితం రైతులకు సాగు నీళ్లు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తుందని అన్నారు. రైతుల సలహలు సూచనలు మేరకు పనులను చేపట్టడం జరుగుతుందని వివరించారు. రాష్ట్ర ఫ్రభుత్వ దేశానికి వెన్నుముక్క అయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలుగా అదుకుంటుందన్నారు. ముఖ్యంగా రైతులకు పెట్టుబడులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైతుల బ్యాంక్ అకౌంట్‌లో రూ.4000 చొప్పున వెయడం జరుగుతుందన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగా కుండా ప్రభుత్వ అన్ని రకాల సహకారం అందిస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపిపి అనూష సాయిబాబా, పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ అఫ్రోజ్‌ఖాన్, స్థానిక సర్పంచ్ రావుల సునీత పోశట్టి, పిఎసిఎస్ డైరెక్టర్ పోశట్టి, ఐడిసి ఆధికారులు, నాయకులు జైభీం, రైతులు తదితరులు పాల్గొన్నారు.