నల్గొండ

రేషన్.. పరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట : పేదలకు పట్టెడన్నం పెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణి వ్యవస్థ ద్వారా అందజేసే రేషన్ బియ్యం ఆగస్టు నెలలో పంపిణీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీలర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోవడం ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఉంది. రేషన్ దుకాణాల ద్వారా ఆగస్టు నెల కోటా సరుకుల పంపిణికి మరో ఐదురోజుల సమయమే మిగిలి ఉంది. అయిన డీలర్లు సమ్మెపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ లభించలేదు. మిగిలిన నాలుగు రోజుల్లో స్పందిస్తే సరే.. లేనిపక్షంలో కోటా సరుకులు ప్రజలకు ఆలస్యంగా అందే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. డీలర్లు సమ్మె చేసిన మహిళా సంఘాల ద్వారానైన పంపిణిచేస్తామని సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆగస్టులో రేషన్ దుకాణాలు మూసి కోటా సరుకులు పంపిణీ చేయబోమంటూ పక్షం రోజుల క్రితమే రేషన్ డీలర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసును అందజేశారు. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో డీలర్లు సమ్మె తప్పదని తెల్చిచెబుతున్నారు. మరోవైపు జిల్లా పరిధిలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌లల్లో పనిచేసే హామాలీలు తమకు కూలీ పెంచాలంటూ సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో తమకు బియ్యం పంపిణి జరుగుతుందో లేదోనన్న ఆందోళన రేషన్ కార్డుదారుల్లో వ్యక్తమవుతోంది.
5,790 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ
జిల్లాలోని 23 మండలాల పరిధిలో మొత్తం 609 రేషన్ దుకాణాలు ఉన్నాయి. దుకాణాల ద్వారా ప్రతి నెల కార్డుదారులకు సరుకుల పంపిణీ జరుగుతుంది. జిల్లాలో మొత్తం 3లక్షల 7వేల 456రేషన్ కార్డుదారులు ఉండగా వారిలో 18,797 మంది అంత్యోదయ కార్డుదారులు, 2,88,609 మంది ఆహార భద్రత కార్డులతో పాటు 50మంది అన్నపూర్ణ కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 5,790 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతుంది. కార్డుదారుల్లో కుటుంబ సభ్యునికి 6కిలోల చొప్పున బియ్యం ప్రభుత్వం అందజేస్తుంది. గతంలో బియ్యంతో పాటు పలు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే వారు క్రమంగా మిగితా సరుకుల పంపిణికి మంగళం పాడడంతో ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా బియ్యం మాత్రమే పంపిణీ అవుతున్నాయి. డీలర్లు తమ సమస్యల పేరుతో సమ్మె చేపడితే బియ్యం పంపిణీ కూడా నిలిచిపోనుంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు రేషన్ సరుకుల బియ్యంపైనే ఆధారపడి కొందరు జీవిస్తున్నారు.
డీడీలు కట్టింది 160 మందే..
జిల్లాలో రేషన్ డీలర్లకు ప్రతి నెల 18వ తేదీ లోగా కోటా సరుకులను ఆన్‌లైన్ ద్వారా కేటాయిస్తారు. కేటాయించిన అలాట్‌మెంట్ కాపిని ఆయా మండలాల తహశీల్దార్లు సంబంధిత రేషన్ డీలర్లుకు 20వ తేదీలోపు అందిస్తారు. డీడీలు చెల్లించని వారి కోసం 25వ తేదీ వరకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత 30వ తేదీ వరకు ఆయా నియోజకవర్గ పరిధిలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి బియ్యాన్ని నేరుగా డీలర్లకు చేరవేస్తారు. డీలర్లు ప్రతి 1నుండి 15వ తేదీ వరకు రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తుంటారు. కాగా ఓవైపు డీలర్ల సమ్మె పిలుపు మరో వైపు హమాలీలు సమ్మె చేస్తుండడంతో ఆగస్టు నెల ప్రక్రియలో ఆలస్యమవుతోంది. ప్రతి నెల 20వ తేదీ లోగా డీడీలు చెల్లించే రేషన్ డీలర్లు సమ్మె పిలుపుతో కొందరు డీడీలు నేటి వరకు చెల్లించని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 609 రేషన్ డీలర్లకు గాను ఇప్పటి వకు 160 మంది మాత్రమే డీడీలు చెల్లించారు. మిగిలిన వారు డీడీలు కట్టకపోవడంతో ఆయా దుకాణాల పరిధిలో బియ్యం పంపిణీ ఎలా జరపాలనే విషయంపై అధికారులు తర్జన బర్జన పడుతున్నారు.
ఆలస్యమైన పంపిణీ చేస్తాం
* డిఎస్‌వో డి. అనురాధ
ఆగస్టు నెల కోటా సరుకుల పంపిణిలో ఆలస్యమైన కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు తక్కువ మంది డీడీలు చెల్లించారు. డీలర్ల సమస్యల పరిష్కార అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. ఈనెలాఖరు వరకు జిల్లాలోని డీలర్లు అందరు డీడీలు చెల్లించి బియ్యం పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయినా డీలర్లు ముందుకు రాని పరిస్థితులు ఉంటే ప్రత్యామ్నాయంగా మహిళా సంఘాల ద్వారా బియ్యం పంపిణీ చేసేందుకు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. హమాలీలు కూడా సమ్మె చేస్తున్నందున సమస్యను పరిష్కరించుకోవాలని రవాణా కాంట్రాక్టర్లకు సూచించాం.