నల్గొండ

స్ర్తి నిధి రుణాల పంపిణీ వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ : స్ర్తి నిధి రుణాల మంజూరు, పంపిణీ వేగవంతం చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులకు సూచించారు. గురువారం టిటిడిసిలో నిర్వహించిన స్ర్తి నిధి రుణ సమీక్ష కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్ర్తి నిధి రుణాల మంజూరు, రికవరీలో పది మండలాలు వెనుకబడి ఉన్నాయని, వారం రోజుల్లోగా ఆ మండలాల్లో పురోగతి చూపించాలన్నారు. స్ర్తి నిధి నుండి మహిళా సంఘాలకు విరివిగా రుణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. వడ్డీ వ్యాపారుల బారి నుండి మహిళా సంఘాల సభ్యులను తప్పించేందుకు స్ర్తి నిధి రుణాలు సకాలంలో మంజూరు చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అందజేసే సహాయంతో పాటు స్ర్తి నిధి నుండి కూడా రుణాలు అందించాలని సూచించారు. అన్ని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. హరితహారంలో సంఘాల సభ్యులు విరివిగా మొక్కలు నాటాలని, ఇందుకు గ్రామ, మండల సంఘాల సమావేశాల్లో తీర్మానాలు చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో స్ర్తి నిధి డిజిఎం విద్యాసాగర్ రెడ్డి, డిఆర్‌డివో అంజయ్య, జేడిఏ నర్సింహరావు, మత్య్స శాఖ అధికారిణి సరిత, మున్సిపల్ కమిషనర్ రాజేంద్రప్రసాద్, డిపియంలు, కో ఆర్డినేటర్లు, ఏపియంలు పాల్గొన్నారు.