సబ్ ఫీచర్

జలస్మరణీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమి మనకు చాలా నీరిచ్చింది. మనం కూడా దానికి ఎంతో కొంత ఇవ్వాలి. లేకపోతే లాసైపోతాం. భవిష్యత్ తరలాను హెచ్చరించేందుకు ఈ మాటొక్కటి చాలు. ధరిత్రినుంచి నీళ్ళు తీసుకోవడమే కానీ, తిరిగి ఇవ్వడం తెలియని మనిషికి అంత తేలిగ్గా ఈ లాజిక్ అర్థం కాదు. విడమరిచి చెప్పాలి. వివరంగా తెలియజేయాలి. ప్రాక్టికల్‌గా చూపించాలి. అలాంటి బృహత్తర కార్యాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నాడు హైదరాబాద్‌కు చెందిన సుభాష్.
ఇంకుడు గుంత ఒక్కటి చాలు ఇంకేం అక్కర్లేదన్న నిప్పులాంటి మాటను పిడికిట పట్టుకుని తిరుగుతున్న సుభాష్‌ని చూస్తే.. నీళ్లంటే అతనికి ఎంత అభిమానమో అర్థమవుతుంది. హైదరాబాద్‌లో చిన్నపాటి వాన కురిసి, అదంతా క్షణాల్లో మురుగు కాల్వలో పడి ప్రవహిస్తుంటే అతని మనసు చివుక్కుమంటుంది. రెండు మూడు సెంటీర్ల వానకే నీళ్లన్నీ డ్రైనేజీలో పడిపోతుంటే గుండెలు బాదుకుంటాడు. ఇంక 10-15 సెంటీమీర్ల వాన పడి నీళ్లన్నీ రోడ్డుమీద చెరువుల్లా మారి, ఆపై మురికి కాల్లలో పడిపోతే అతను ఎంత తల్లడిల్లిపోతాడో ఊహించుకోవచ్చు.
హైదరాబాద్‌లో వరదలొస్తే ఎంత దారుణంగా ఉంటుందో, నీటి కరువొచ్చినా అంతే ఘోరంగా ఉంటుంది. నానాటికీ నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారుతుంటే భూగర్భ జలాలు అంతకంతకూ మొహం చాటేస్తున్నాయి. వెయ్యి రెండు వేల ఫీట్ల లోతున బోరు వేసినా నీళ్లు రాని పరిస్థితి. లక్షలు, కోట్లు, గుమ్మరించి ఇటాలియన్ మార్బుల్‌తో ఇల్లు కట్టుకుంటారు గానీ కాసింత జాగాలో ఇంకుడు గుంత మాత్రం తీయరు. జనంలో ఇలాంటి మైండ్ సెట్ మారాలనే లక్ష్యంతో 1979లో స్మరణ్ అనే ఎన్జీవోని స్థాపించి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌వల్ల కలిగే లాభాలను తెలియజేస్తున్నాడు.
ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేసి బిఎస్‌ఎన్‌ఎల్ చేసిన సుభాష్ గొప్ప మానతావాది. ప్రకృతి ప్రేమికుడు. సామాజిక కార్యకర్త. నిత్యం నీళ్లకోసం తపించే జలస్మరణీయుడుగా మారి 2003 నుంచి హైదరాబాద్‌లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద అవగాహన తెస్తూ గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. అంతకుముందు ఇబ్రహీంపట్నం మండలంలో రైతులకు వాటర్ షెడ్స్ అంటే ఏంటో తెలియజేశాడు. చదివిన చదువుకు చేస్తున్న పనికి సంబంధం లేదు. అయినా నీళ్ల మీద ఇంట్రెస్ట్ అన్నీ తెలిసేలా చేసింది. ఎందరో నిపుణులను కలిశాడు వాళ్లకు తన లక్ష్యమేంటో వివరించాడు. వాళ్ల ద్వారా కొంత నాలెడ్జ్ సంపాదించి నలుగురికీ పంచుతున్నాడు.
గత ఇరవై ఏళ్లుగా చూసుకుంటే హైదరాబాద్ నగరం ఎంతో మారిపోయింది. రోడ్లు, ఫ్లైఓవర్లు, ఆకాశ హర్మాలు, భవంతులు వెలిశాయి. ఖాళీ ప్రదేశం అన్నదే లేకుండా పోయింది. చెట్లు సమతూకం తగ్గింది. వర్షపాతంలో కూడా గణనీయమైన మార్పొచ్చింది. వేల ఫీట్ల లోతు తవ్వినా నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. దీనికంతటికీ ఒకటే పరిష్కారం. రెయిన్ వాటర్ హర్వెస్టింగ్. వాన నీటిని వీలైనంత ఒడిసి పట్టుకుంటే నీళ్ల బాధేవుండదు.
స్మరణ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నగరంలోని అనేక అపార్టుమెంట్లు, కార్పొరేట్ సంస్థల్లో వాన నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. స్ట్రక్చర్లు వేసిన ప్రతిచోటా భూగర్భ జలాల స్థాయి పెరిగింది. మాదాపూర్ నిఫ్ట్ అందుకు ఉదాహరణ. నేచర్ క్యూర్ హాస్పిటల్, సెయింట్ థెరిసా స్కూల్, గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్‌లో కొన్ని వర్క్స్ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న రాక్ సాయిల్ వల్ల రీఛార్జి పిట్స్ పనిచేయవు. అందుకే ఎక్కువగా ఇన్నర్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్ పద్ధతిని అనుసరించారు. అలా చేసిన ప్రతిచోటా వందశాతం మంచి ఫలితాలు వచ్చాయి.
వర్షం నీరు డ్రైనేజీగా వృధాగా పోతుంటే చూస్తాం తప్ప ఆ నీటి విలువేంటో తెలుసుకోం. ఆ గొప్పతనం సుభాష్ లాంటి మట్టి మనుషులకే తెలుసు. ఆయన దృష్టిలో భూమి ఒక పెద్ద వాటర్ ట్యాంకర్. ఇన్నాళ్లూ దాన్నుంచి కావాల్సినన్ని నీళ్లు వాడుకున్నాం. ఇప్పుడా ట్యాంకర్ ఎండిపోతోంది. దాన్ని మళ్లీ నీటితో నింపాలి. అదే సంకల్పంతో సుభాష్ వందలాది మందితో శెభాష్ అనిపించుకుంటున్నాడు.