భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంధ్యాల ఫణిభూషణ్‌రావు, చెన్నై (తమిళనాడు)
ప్ర: మీ భవిష్యకాలాన్ని రెగ్యులర్‌గా చదువుతూ గమనిస్తూ ఉంటాను. లోగడ సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఒకరి ప్రశ్నకు సమాధానంగా ఈ దేశానికి ఒక మంచి పరిపాలకుడు వస్తాడన్నారు. అది నిజమైంది. ఇటీవల రాష్టప్రతి ఎన్నిక విషయంలో ఆర్ - కె అక్షరాలు అని చెప్పారు. అది కూడా నిజమైంది. ప్రస్తుతం చైనా-్భరత్‌ల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి!
సమా: చాలా క్లిష్టమైన అంశం- అయినా నా విచారణలో వచ్చింది చెపుతాను. అక్టోబర్-నవంబర్‌లో చైనా-్భరత్‌లమధ్య ప్రమాదకరమైన ఆయుధ సంఘర్షణ చోటుచేసుకుంటుంది. అయితే చైనా ఒక ఊహించని శత్రువును ఎదుర్కోవలసి రావచ్చు. ఆ కారణంగా వెనుకంజ వేయక తప్పదు. పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుంది. కాశ్మీర్ సమస్య క్లైమాక్స్‌కు చేరి భారత్‌కు అనుకూలంగా పరిష్కారం కావచ్చు. ఏమైనా భారతదేశ ప్రతిష్ఠ పెరుగుతుందే కానీ తరగదు. విజయం భారత్‌కే.

వి.ఈశ్వరయ్య, శ్రీకాళహస్తి (చిత్తూరు)
ప్ర: అమ్మాయి వివాహం ఎప్పుడు? జాతకం ఎలా ఉంది?
సమా: నవంబర్‌లో అవకాశం- వాయవ్య దిశ- మ - క - డ - ప అక్షరాలు

వై.పుష్పాంజలి, గాంధీనగర్ (అనంతపురం)
ప్ర: గురువుగారూ! మీరు గతంలో హెచ్చరించి చెప్పినట్లుగా, విద్యాభ్యాసంలో ఆటంకాలు చాలా వస్తున్నాయి. పరిష్కారం చెప్పండి. ఏ రంగంలో స్థిరపడగలను.
సమా: ప్రతి సోమవారం విఘ్నేశ్వరునికి తేనెలో కాని మాదీఫల రసాయనంలో కాని ముంచిన ఉండ్రాళ్ళు నివేదన చేయండి. గరికలతో (పవిత్ర స్థానంలో మొలచినవి) పూజించండి. నాలుగు సంఖ్యతో దక్షిణ సమర్పించండి. మాదీఫల రసాయనం ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.

పావాడ గణపతిరావు, విజయనగరం (ఆంధ్ర)
ప్ర: దీర్ఘకాలిక వ్యాధి బాధిస్తోంది. నివారణ ఏమిటి?
సమా: ఒకటి- సరియైన ఔషధ సేవ, పథ్యం. రెండు- దైవసేవగా బడబానల నీలకంఠాస్త్ర మహామంత్రం ఈశ్వరుని భస్మాభిషేకము.
కె.్భస్కర్, తిరుమలపాలెం
ప్ర: భూమి అమ్మకం ఎప్పుడు చేయవచ్చు? నగదు పూర్తిగా ఎప్పుడు చేతికి వస్తుంది?
సమా: మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. పూర్తిగా అన్నారంటే ఒప్పందం కుదిరినట్టు కదా! దాంట్లో ఉన్న ప్రకారం కావాలి.

యాసం శైలజ, శరీన్‌నగర్, కర్నూలు
ప్ర: మాకు ఏదీ కలసిరావడంలేదు. స్వంత ఇల్లు యోగం కలుగుతుందా?
సమా: ప్రతిరోజూ ఉదయం సూర్యోదయ సమయంలో ఇంటిముందు ఆవు పేడతో అలికి- పసుపు రంగులు గల ముగ్గులు వేయండి. ఇంట్లో ఇరవై నాలుగు గంటలూ వెలిగే విధంగా దేవుడి ముందు ఆవునేయితో దీపం వెలిగించండి. అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి.

పోతుకూచి సూర్యనారాయణ, గుంటూరు (ఆంధ్ర)
ప్ర: నాకు ఏ వ్యాపారం బాగుంటుంది? ఏ దిశ - ఏ రంగు అనుకూలం?
సమా: వైద్య సంబంధమైన వ్యాపారం- మందుల కంపెనీల ఏజెన్సీలు మంచివి. తెలుపు రంగు- ఉత్తర - తూర్పు - ఈశాన్య దిశలు అనుకూలం.

ఎమ్.సత్యనారాయణ, తెనాలి (గుంటూరు)
ప్ర: కోర్టులో ఉన్న స్థల వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుంది?
సమా: 2017 చివరిలో కాని- 2018 ప్రారంభంలో కాని తీర్పు మీకు అనుకూలంగా రావచ్చును.

ఏ.పూర్ణచంద్రరావు, నాయుడుతోట
ప్ర: ఆరోగ్యం - ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయి?
సమా: ఆరోగ్యం- ఉదరం (స్టమక్) గ్యాస్ట్రిక్ కారణంగా బరువుగా అనిపించటం- అపథ్యమైన ఆహారం కారణం- జలోదరంగా మారవచ్చు! ఆర్థిక స్థితి- లోగడ చేసిన పనులవలన వ్యతిరేక ప్రభావం- నవంబర్‌లో కొంత మార్పు (మంచి) జరిగే అవకాశం ఉంది.
ఎమ్.సూర్యప్రకాశ్, పిప్పర (ఆంధ్ర)
ప్ర: ఉద్యోగంలో అభివృద్ధి లేదు. భార్య అనారోగ్యం-
సమా: 2018లో మార్పు రాగలదు. బహుశా స్థానచలనం కూడా కలగవచ్చు.

యండూరి లోకేశ్, నిడుమోలు (కృష్ణా)
ప్ర: నేను ఎం.బి.బి.ఎస్ చదువుతున్నాను- ఆ తరువాత ఏం చేయాలి?
సమా: ఆ విషయం ఆ తరువాత ఆలోచించండి. రాయండి- సమాధానం చెప్పగలను.

జి.విజయకుమారి, పాలకొల్లు (ప.గో.)
ప్ర: భర్త పేరు జగన్నాథరావు- హైదరాబాద్ బాగుంటుందా?- మా కోడలు విషయంలో పురుహూతికా దేవి దర్శనం శ్రీపాద గయలో చేయమన్నారు. దాని అర్థమేమిటి?
సమా: మీ భర్తగారికి హైదరాబాద్ కంటే పాలకొల్లే లాభిస్తుంది. మీ కోడలు విషయంలో శ్రీపాద గయలో శ్రాద్ధ పిండాదులు చేయిస్తే పితృశాపం దూరమవుతుంది. పురుహూతికా దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి- ప్రేత పీడ నివారణమవుతుంది. సహస్ర నామాలతో ఎఱ్ఱగనే్నరు పూలతో అర్చన చేయించండి.

సిహెచ్.చంద్రశేఖర్, వంగర (వరంగల్)
ప్ర: హైదరాబాద్‌లో ప్లాటు ఎక్స్ఛేంజ్ మంచిదేనా?
సమా: ప్లాటు మీరు చెప్పిన ప్రకారమే ఉంటే ఎక్స్ఛ్‌ంజ్ చేసుకోవచ్చు.

కె.రవితేజ, గుడ్లవల్లూరు (కృష్ణా)
ప్ర: వివాహ యోగం ఎప్పుడు?
సమా: ఈ సంవత్సరం చివరలో కాగలదు.

సేట్ రాధేశ్యాం గోపాల్, చందూలాల్ బారాదారీ, హైదరాబాద్
ప్ర: పండిట్‌జీ! నమస్కార్! మీరు చెప్పిన ప్రకారం మా రాజస్థాన్‌లో మా జాయిదాద్‌కు మంచి ధర వచ్చింది. ధన్యవాద్- మీ చేత మా పిల్లల జాతకాలు (జన్మపతి) వ్రాయించుకోవాలని ఉంది. రాసివ్వగలరా, మీకు అడిగిన ఫీజు ఇస్తాము.
సమా: ఒక జాతకం వ్రాయటానికి చాలా ఓపిక- సమయం కావాలి. నాకు అంతటి ఓపిక లేదు. జన్మపత్రిక ఏ మామూలు పురోహితుడైనా వ్రాసి ఇవ్వగలడు- లాల్ దర్వాజా ప్రాంతంలో మంచి పండితులున్నారు.

మువ్వల వీర వెంకట సాయి- కావలి (నెల్లూరు)
ప్ర: నాకు ఉద్యోగమా? వ్యాపారమా? ఏది యోగిస్తుంది- ఏ వ్యాపారం?
సమా: వ్యాపారమే- చిట్‌ఫండ్స్- వంట నూనెలు- స్టాక్ ఎక్స్ఛేంజ్- రెస్టారెంట్లు- బాగుంటాయి.

ఎమ్.మల్లికార్జునరావు, కావలి (నెల్లూరు)
ప్ర: అంగడి భాడా కొనుక్కోమంటారా? ఇల్లు కొనమంటారా?
సమా: అంగడి షాపే కొనండి!

జె.మల్లిక, ఆదోని (కర్నూలు)
ప్ర: నా సంసారిక జీవితం ఎప్పుడు బాగుపడగలదు?
సమా: కొన్ని మంగళవారాలు సర్వమంగళా కాత్యాయనీ వ్రతం చేయి. మార్పు వస్తుంది. ఊరికే విచారిస్తూ కూర్చుంటే ఏమీ కాదు. దైవసేవ చాలా ముఖ్యం. అది కూడా వ్రత నియమాలుగా చేస్తేనే ఫలితం.
లోకా శేషఫణీశ్, సిద్ధిపేట (తెలంగాణ)
ప్ర: రాజకీయాలలో రాణించాలంటే ఏం చేయాలి?
సమా: దేంట్లోనైనా అంకితభావంతో పనిచేస్తేనే జయం.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
ఖ్ఘౄఔ్ఘఆ్దజఒ్ద్ఘ్ఘౄబక్ఘౄజ.ష్యౄ

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ