ఉత్తర తెలంగాణ

గుప్పెడు మెతుకుల కోసం! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకలి శత్రువై
మగారణ్యంలో ‘లేడి’ పిల్లని చేసి
వేటాడుతుంటే
గుప్పెడు మెతుకుల కోసం
జీవశ్చవమైన మనసుతో
దేహాన్ని కామ మృగాలకు
భోజ్యంగా పరుస్తుంది
పొగులుతున్న కన్నీటి ప్రవాహాలను
పౌడరు ఆత్మరుల కింద దాచిపెడుతుంది..
దాడి చేసిన పంటి గాట్లు
పెదవులపై ఎర్రటి మందారాలు పూయిస్తుంటే
బాధను నొక్కిపట్టి
బరువైన నవ్వు పర్వతాన్ని అధరాలపై
మోస్తుంది..
అవసరం ఊరుమ్మడి ఆస్తిగా మార్చి
వెలుగు చూడని చీకటికి అంకితం
చేసినప్పుడు
మదాంధుల చేతుల గాజుపాత్రై చిట్లుతూ
ఛిద్రమవుతున్న దేహశకలాలను
చితిమంటల వేదనలలో కూడగట్టుకుంటూ
చిరిగిన బతుకుకు మాసిక తీసుకొని
కుట్టుకున్నా
చీలికలు పేలికలైన దేహం రోగాలకు
నిలయమై
జీవన పోరాటంలో నిర్భయగా ఓడిపోతుంది
సభ్యత ముసుగేసుకుని సకల సుఖాలను
చెరుకురసంలా పిండుకున్న మృగాళ్ల
సమాజంలో
అపవిత్రమైన పదమై
దూరంగా విసిరేయబడుతుంది
- పురిమళ్ల సునంద, బుర్హాన్‌పురం,
ఖమ్మం జిల్లా, సెల్.నం.9441815722

మరబొమ్మలు

ఇవన్ని మరబొమ్మలు.. అవును
ఆయుష్షు ఇంధనంతో నడిచె
తోలుబొమ్మలు
లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాగిపోయె
యాంత్రిక బొమ్మలు.. మానవ బొమ్మలు
అవి ఆడే ఆట సామాన్యమైనది కాదు
సామాన్యమైన ఆటలవి ఆడవు
గుండెలతో బంతులాట
మనసులతో దాగుడుమూతలు
అసామాన్య క్రీడా విన్యాసాల బొమ్మలవి
హృదయాలు లేక కాదు
ఆ హృదయాల్లో ప్రేమ లేక కాదు
మనసున్న లేనట్లు
లేకున్నా అభిమానమున్నట్లు
నటిస్తూ జీవించే జీవన విగ్రహాలు
పెదవులపై దరహాసాలు మోస్తూ
లోలోపల వేదనలు భరిస్తూ
పైకి ఉన్నట్లు.. లోపల లేనట్లు
నిజమేదో అబద్ధమేదో
అర్థం కాని వ్యర్థజీవనం సాగిస్తూ
విధి నిర్దేశకత్వంలో
తూచా తప్పకుండా ఆడుతూ పాడుతూ
ఆడుతున్నాయవి మాంసపు బొక్కలాట
ఎముకల పంజరంలో గుండెలాట
వేదనా సంతోశాల భయంకర క్రీడలో
రాటుదేలీ అలుపెరుగక ఆడుతున్న
ఆ బొమ్మలాట
దయానీయం.. క్రూరత్వం.. ఆదర్శనీయం
ఆ బొమ్మల రాత రాసిన బ్రహ్మ కంటే
ఆ రాతను అనుసరించి సాగిపోతున్న
ఈ బొమ్మలు గొప్పవే కదా..!
- కొత్త అనీల్ కుమార్
కరీంనగర్, సెల్.నం.9395553393

అమ్మంటే..!

అమ్మంటే.. ఆ నింగి తల వంచదా..
తను పంచే అనురాగానికి
అమ్మంటే.. సంద్రం కూడా చిన్నబోదా..
తనలో దాచుకున్న కన్నీళ్లకి
అమ్మంటే.. వెనె్నల వెల వెలబోదా..
తను పంచే వెలుగులకీ
అమ్మంటే అమృతం కూడా
బలాదూర్ కదా..
తన చేతి వంట రుచులకీ
అమ్మంటే
ప్రతి జన్మకీ రుణపడి ఉండనా..
తన పాద పద్మాలపై మోకరిల్లుతూ..!
- గుండు రమణయ్య
పెద్దాపూర్-జూలపల్లి
సెల్.నం.9440642809

జీవనయానం

జీవితం
ఒక అలుపెరుగని యాత్ర!
దానికి ఆరంభం జననం
ముగింపు మరణం
యాత్ర ఎన్నాళ్లు సాగినా
ఎప్పుడో ఒకప్పుడు
ఏదో ఒక చోట
ఆగిపోవలసిందే!
జననం తొలి మైలురాయి
జీవనం నడి మైలురాయి
మరణం తుది మైలురాయి!
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
కామారెడ్డి, 9440468557

క(ల)ల్ల

నిదుర మత్తులో కళ్లు మూతబడి
గుండె తలుపు తెరుచుకుంది
అందులో నుండి పరికించా..
అదిగో..!
వచ్చింది మా అమ్మ
గోరు ముద్దలు తినిపిస్తూ..
రాడని తెలిసినా
చందమామను పిలుస్తూ..
ఎన్ని రోజులు పిలిచినా
రాని చంద్రుని చూసి
ఈసడించుకుంటూనే
ముద్దలన్నీ ఆరగించా..
ఉదయానే్న..
ఎండాకాలంలో సైతం చలేస్తుందేమోనని
వేడినీటి స్నానం చేయించి
తలను నున్నగా దువ్వి
బట్ట సంచీ భుజానికి తగిలించి
బుగ్గన ముద్దు పెట్టి
పది పైసలు చేతులో పెట్టి
బడికి పంపింది
సాయంకాలం స్కూలు నుండి రాగానే
వేడి వేడి పల్లికాయ జేబులో నింపి
ఆటకు పంపింది
రాత్రివేళలో సీసపు గోటీల్లా
మెరుస్తున్న నా కళ్లకు
నిదుర కమ్మేలా జోలపాట పాడింది
అమ్మ ఒడిలో తలపెట్టి
పాట వింటూ నిదుర పోయా..
తెల్లవారగానే
కన్నీటితో తడిసిన నా దిండు
నన్ను వెక్కిరించింది
ఇదంతా నీవు కన్న కలయని..
- మాధవ్ గుర్రాల
కరీంనగర్
సెల్.నం.9492648887

సంకల్పమే సద్రక్ష

ఊహలు స్వప్నాలూ కొన్ని
కలగాపులగంగా అయోమయంగా
ఎంతకూ విప్పలేని చిక్కుముడిలా
చికాకుగా కనపడి పరేషాన్ చేస్తాయి
అయితే వాటిని మధించి
సానబెట్టిన సారాంశాన్ని నిగ్గుదేల్చి!
అమలయ్యేలా చేసే బృహత్ కార్యమే
దీక్షాదక్షత! కార్యోన్ముఖం!
ఒక్కొక్క గడ్డిపోచని ఏరి
ముక్కుతో బంధించి తెచ్చి
గూడుని అల్లుకొన్న ఊరపిచ్చుక
ఒక్కొక్క మట్టి గింజని
పట్టి నెడుతూ నెడుతూ చీమ
పెట్టిన పుట్ట..
ఇవ్వన్నిటి నుంచి
మనిషి నేర్చుకోవాల్సినవి
చెప్పుకుంటూ పోతే సవాలక్ష!
ప్రస్తుతం గట్టిగా చెప్పుకోవాల్సినవి
సంకల్ప శుద్ధీ సిద్ధీ!! జయోస్తు!!విజయోస్తు!!
- డాక్టర్ దామెర రాములు
నిర్మల్, సెల్.నం. 9866422494

కారు చీకటి

దుప్పటి తొలగించుకుని
బద్దకాల వదిలించుకొని
తెలిమంచు తెరల నడుమ
ఆకాశపు అంచుల నుంచి
పయనమారంభించిన ప్రభాత కిరణం
పుడమిని తాకి పులకింపచేసి
అణువణువూ మైమరపించి
మరో ఉదయానికి చేస్తుంది సమాయత్తం
అంతకంతకు పెరిగి
ప్రతి ప్రాణినీ తట్టి లేపి
దినచర్యల కవాతు ఆరంభించి
అరుణారుణ కిరణాలై
జగతిని భగభగ మండించి
నడినెత్తిన నిటారుగా ప్రసరించే
ఆ కిరణాలు మనిషి జీవితాన్ని
నడిపించే జగన్నాథ రథచక్రాలు
విధులు ముగించి
పడమటింటికి పయనించే వేళ
సంజె కెంజాయల్లో
గోధూళితో నిండి
సప్తవర్ణాల శోభతో మెరిసి
ఆ సంధ్యాకిరణాలు
జీవిత చరమాంకానికి మార్గదర్శకాలు
మలి సంధ్యలో మనిషికి నేస్తాలు
బాల్య కౌమారాలు ఉదయ కిరణాలు
చల్లదనానికి ప్రశాంతతకి ప్రతీకలు
నడివయసున నలిగే మధ్యాహ్న కిరణం
సంసార రథపు నడకకి తార్కాణం
సాయం సంధ్యలో వాటారిన కిరణాలు
వృద్ధాప్యపు వేదాంత ధోరణికి సూచికలు!
- అనంతలక్ష్మి, హైదరాబాద్,
సెల్.నం.9866954194

అందాల హరివిల్లు

అవనిపై విలసిల్లు
అందాల హరివిల్లు అమర సోయగమా!
ఓ సంస్కృతమా!
నీవు మృత భాషవుకావే
నీవసలు అమృత భాషవే
నిజానికి నీవు నాడు దేవభాషవే
అర్చకుల దేవతా ఆరాధనలలో
పురోహితుల పూజలలో
యాజ్ఞీకుల యజ్ఞాలలో
ఇలనేటికి వలచి నిలుచుంటివే
వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు
కథలు, కవితలు, కావ్యాలతో
ఈనాటికీ విరాజిల్లుతున్నయి
దేవనాగరికలివి నీను ఆకారమే
అది ఇప్పటికి, ఎప్పటికి తెగిపోని బంధమే
సంస్కృతిలో విడదీయరాని అనుబంధమే
పుడమిలో పరిమళిస్తున్న నిత్య మహా
సుగంధమే
సంస్కృతమా వర్ధిల్లవే సదా
‘శుభం భూయాత్’
- కూర్మాచలం వెంకటేశ్వర్లు
ఎం.ఎం.తోట, కరీంనగర్-505002