రాజమండ్రి

కథ కాని కథ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కథ ఈనాటి కథ కాదు. కథగా చెప్పుకోదగ్గ కథ. జరిగిన కథ.
స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇంగ్లండు నుండి కొందరు సైనికులను దిగుమతి చేసింది. అలా వచ్చిన వారిలో జార్జి ఒకడు. అప్పటికే భార్య గతించడం చేత పదేళ్ల చిన్నారి డైసీని తనతో తీసుకు వచ్చాడు. బొంబాయి (ముంబై)లో నియుక్తం చేశారు. సముద్రతీరంలోనే నివాసం ఉండడం తీరిక దొరికినప్పుడల్లా కూతుర్ని తోడు చేసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్లేవారు. చిన్నారి డైసీ అస్తమిస్తున్న సూర్యుడిని, ఆ అందాలను చూస్తూ మురిసిపోయేది. తీరం వెంబడి ఉన్న దేవాలయాల్లో గుడి గంటలు మోగేవి. గుడిలో నుండి శ్రావ్యంగా పాడుతున్న పాటలు విని పరవశించేది.
‘‘నాన్నా ఆ గంటలేమిటి? ఆ పాటలేమిటి? మన చర్చిల్లో గంటల్లా లేవే. అక్కడ చదదివే బైబిలు మాటల్లా లేవే ఆ పాటలు’’ అమాయకంగా ముద్దుముద్దుగా అడిగేది డైసీ.
జార్జి డైసీని పొదువుకుంటూ తను విన్నవీ, తెలుసుకున్నవీ డైసీకి చెప్పేవాడు. ‘‘అవి ఈ దేశంలో హిందువుల ఆలయాలు. ప్రజలు దేవుడిని పూజిస్తూ పాటలు పాడుతారు. గంటలు వాయిస్తారు. రోజూ ఉదయం, సాయంత్రం ఇలా జరుగుతునే ఉంటాయి’’ అంటూ వివరించాడు.
చిన్నారి డైసీకి ఆలయంలో జరిగే ఆచారం చూడాలని అనిపించేది.
డైసీని బొంబాయిలోనే చదువుకోవడానికి ఏర్పాటు చేశాడు జార్జి. డైసీ అక్కడ చదువుకుంటూనే పెరిగి పెద్దదయింది. స్నేహితురాళ్లతో, వాళ్ల కుటుంబాలతో కలసిమెలసి తిరగడం చేత సందేహాలన్నీ తీరిపోయాయి. ఈ దేశం గురించి, ప్రజల జీవన విధానాలు, దేవుళ్లు, నమ్మకాలు ఎంతగానో అవగాహనకు వచ్చాయి. వాళ్ల భాషలు, ఆచార వ్యవహారాలు, దేవుడి పట్ల వాళ్ల భక్తి విశ్వాసాలు అన్నీ అర్ధం అయ్యాయి. భారతీయులకు గల విశాల దృక్పథానికి మనసులోనే జేజేలు పలికింది. సంకుచితత్వం లేని వారి మనస్తత్వం వల్లనే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని తలెత్తుకుని నిలబడిందనుకుంది. ఈ దేశంలో పుట్టిన వాళ్లు అదృష్టవంతులు. ఈ దేశంలోనే ఉండిపోతేనో అనిపించింది.
జార్జిని తిరిగి తమ దేశానికి పంపించాలని అనుకుంది ప్రభుత్వం.
భారతీయతపై ప్రభావితమైన డైసీకి జార్జి ప్రభుత్వం చేసిన ఆదేశం గురించి చెప్పాడు. తండ్రి మాట విని డైసీ ఖిన్నురాలైంది. తను భారతదేశం విడిచి వెళ్లడానికి ఇష్టపడలేదు. తన జీవితం ఇక్కడే గడపాలనుకున్న నిశ్చయాన్ని తండ్రికి చెప్పింది. కావాలంటే తండ్రిని వెళ్లమని అంది.
డైసీ ఆనాటి డైసీ కాదు. యుక్త వయసులో ఉంది. సమాజాన్ని అర్ధం చేసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం ఆవేశంతో తీసుకున్నది కాదు అనుకున్నాడు జార్జి.
అప్పటికే డైసీ ఈ దేశ చరిత్ర, సంస్కృతి, ఇతిహాసాలు, పవిత్రాత్మల జీవితాల గురించి చదవడం, తెలుసుకోవడం జరిగింది. ఆయా విషయాలను హృదయంలో పదిలపరుచుకుంది. భారతీ జీవన విధానాలకు అంకితమైన అనీబిసెంట్, సోదరి నివేదిత వంటి వారిని ఈ జాతి జీవితంలో కలిసిపోయేటట్లు చేసింది. రామకృష్ణా మిషన్, దివ్యజీవన సంఘం, శ్రీకృష్ణ చైతన్య సంఘం విదేశాల్లో ప్రభావవంతంగా ఉంటున్నాయి. ఆయా సంస్థల్లో విదేశీ మహిళలు పాలు పంచుకుంటూ ధన్యులయ్యారు. తనూ వాళ్ల దారిలోనే పయనించాలి అనుకుంది.
జార్జి డైసీని వదిలి ఎక్కడికి పోతాడు? తన సర్వస్వమూ డైసీనే. అందుకే తను డైసీతో భారతదేశంలో ఉండిపోవడానికి నిర్ణయించుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. డైసీకి తండ్రి నిర్ణయం సానుకూలంగా మారింది. గ్రంథాలయాలకు వెళ్లి సంస్కృతం, మరాఠీ వాజ్మయాలను సునిశితంగా చదివి అణువణువునా భారతీయతను నింపుకుంది.
తమ కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా ‘్భరతీయ తత్వవిచారం’ అనే అంశంపై వక్తృత్వ పోటీ ఏర్పాటు చేశారు. డైసీ కూడా పాల్గొంది. భారతీయ తత్వాన్ని గురించి వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఉటంకిస్తు అద్భుతంగా ప్రసంగించి సభను పరవశింపజేసింది. ఒక విదేశీ యువతి అక్షరదోషంలేకుండా, అలసట కనబడకుండా సంస్కృతం, మరాఠీ కావ్యాలను గురించి ఉపమానాలను ఇస్తు ప్రసంగించి ప్రశంసలు అందుకుంది.
ఆ సభకు విక్రమ్ తల్లిదండ్రులు వచ్చారు. విక్రమ్ యువకుడు. ఇంకా వివాహం కాలేదు. రక్షణ శాఖలో పని చేస్తున్నాడు. అతనితో పాటు సహచరి నిరంజన్‌శర్మ, భార్య, మూడేళ్ల కొడుకు కూడా వచ్చారు. విక్రమ్‌ను డైసీ వక్తృత్వమే కాదు అందచందాలు ఆకర్షించాయి. ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ మాటే తల్లిదండ్రులకు చెప్పాడు.
ఒక్కగానొక్క కొడుకు విక్రమ్ మాటలను కాదనలేకపోయారు తల్లిదండ్రలు. తామే స్వయంగా వెళ్లి జార్జి, డైసీల అభిప్రాయం తెలుసుకున్నారు. సానుకూల స్పందన రావడంతో విక్రమ్, డైసీల వివాహం వైభవంగా జరిపించారు. డైసీ కోరిక ప్రకారం డైసీకి సావిత్రి అని పేరు మార్చారు. వివాహానంతరం సావిత్రి పూర్తిగా కట్టుబొట్టుతో భారతీయ మహిళగా మారిపోయింది. ఆచార వ్యవహారాల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేవి. తెలిసిన వారు తప్పితే సావిత్రి విదేశీ మహిళ అని గుర్తించనంతగా మారిపోయింది.
ఉద్యోగరీత్యా విక్రమ్ మేజర్ జనరల్ పదోన్నతిపై లక్నోలో నియమించారు.సావిత్రి, విక్రమ్ లక్నోలో స్థిరపడ్డారు. సంవత్సరం తిరిగేసరికల్లా సావిత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ దినదిన ప్రవర్ధమానమవుతూ చదువు, సంస్కారాల్లో తల్లిని మించింది.
భారత దేశం స్వాతంత్య్రం పొందాక కాశ్మీర్‌లో అలజడి సృష్టించబడంతో నిరంజన్ శర్మ, విక్రమ్‌శర్మ ఉత్తరప్రాంత రక్షణకు అధికారులుగా నియమితులయ్యారు. ఇద్దరు సమాన హోదాలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా వారి మధ్య స్నేహం వారిద్దరినీ మరింత సన్నిహితులను చేసింది. నిరంజన్‌శర్మ కొడుకు సోమనాథశర్మ కూడా రక్షణ శాఖలోనే చేరాడు.
సంవత్సరాలు గడుస్తున్నా ఆసూయా ద్వేషాలతో రగులుతున్న పాకిస్తాన్ భారతదేశాన్ని ముఖ్యంగా కాశ్మీర్‌ను కబళించే విరమించలేదు. మిత్రులిద్దరు ఎప్పటికప్పుడు కొత్తకొత్త వ్యూహాలతో శత్రుసేనలను కట్టడి చేసేవారు.
నిరంజన్, విక్రమ్‌లు స్నేహబంధాన్ని బంధుత్వంతో మరింత గట్టిగా ముడి వేసువేసుకోవాలని తలచి నిరంజన్ కొడుకు సోమనాథశర్మకు తన కూతురు భారతినిచ్చి విక్రమ్ వివాహం జరిపించాడు.
ఆ రెండు కుటుంబాలు ఒక్కటై హాయిగా జీవిస్తున్న సమయంలో పాకిస్తాన్ ఒక్కసారిగా విజృంభించి భారత్‌తో యుద్ధానికి తలపడింది. ఊహించని ఈ పరిణామాన్ని ధాటిగా ఎదుర్కొని భారత్ మరోసారి శత్రుదేశాన్ని మట్టి కరిపించింది. విజయలక్ష్మిని చేకూర్చడంలో అప్రతిహతమైన, అసాధారణమైన నైపుణ్యం ప్రదర్శించిన వారికి పరమవీర చక్ర పురస్కారాన్ని అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
పౌరులకు ఇచ్చే భారత రత్న స్థాయి గలది పరమ వీర చక్ర. ఈ పురస్కారాన్ని రూపొందించే బాధ్యత ప్రభుత్వం నిరంజన్‌శర్మకు అప్పగించింది. నిరంజన్ శర్మకు ఏం చేయాలో తోచలేదు. విక్రమ్‌ను సంప్రదించాడు. ఆప్తమిత్రులు, ఆత్మబంధువులు అయిన వీరిద్దరు అహోరాత్రాలు భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఉండాలని భావించారే కాని ఎలా ఉండాలో నిర్ణయానికి రాలేకపోయారు.
సావిత్రికి భారతీయ సంస్కృతి గురించి అపారజ్ఞానం తమ సమస్ను పరిష్కరిస్తుందనే నమ్మకంతో ఇద్దరూ కలసి సావిత్రికి సమస్యను చెప్పి పరిష్కరించమని అడిగారు. సావిత్రి తానింత వరకు వారి చర్యలను పరోక్షంగా వింటున్నా కలగజేసుకోలేదు. ఇప్పుడువారి కోరిక మేరకు చరిత్ర, సంస్కృతి, ఇతిహాసాలలోని ఘట్టాలను స్మృతిలోకి తెచ్చుకుని సమస్యకు పరిష్కారం చెబుతానని ‘‘అయితే మీరిద్దరికీ ఏకాభిప్రాయం ఉంటేనే ప్రభుత్వానికి చెప్పండి’’ అంది.
‘‘పురాణ యుగంలో వృతాసుర సంహారం కోసం దధీచి తన వెనె్నముకను త్యాగం చేశాడు. అది వజ్రాయుధం అయింది. ఇది అత్యద్భుత త్యాగానికి ప్రతీక. త్రివిష్ణక (నెమలి) సాహిత్యంలో వజ్రాయుధానికి విస్తారమైన ప్రశంస ఉంది. ఆధునిక రాజకీయ చరిత్రలో హిందూ సామ్రాజ్య స్థాపన కోసం వీర శివాజీకి భవానీ ఖడ్గం అనుగ్రహించినట్లు ఉంది. ఈ రెండు ఘటనలు నాటి నేటి చరిత్రలకు మహత్వపూర్వమైనది. మీరు రూపొందించే పతకంలో చోటు ఉంటుందేమో చూడండి’’ అని చెప్పింది సావిత్రి.
మిత్రులిద్దరు విస్మయులయ్యారు. సమస్య కొలిక్కి వచ్చిందని ఆనందించారు. పతకం నాలుగు దిశలా వజ్రాయుధ చిహ్నం, పశ్చిమ దిశలో వజ్రాయుధానికి పక్కగా భవానీ ఖడ్గాలు, మధ్య భాగంలో ఆశోక చక్రం ఉండేలా పరమవీర చక్రను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు.
విక్రమ్, నిరంజన్‌శర్మలు రూపొందించిన నమూనాను యథాతథంగా ప్రభుత్వం ఆమోదించింది. 1962లో కాశ్మీర్‌ను కబళించడానికి ప్రయత్నించిన శత్రుసేనలను తన అసమాన ధైర్య సాహసాలతో ప్రతిఘటించిన వ్యక్తి మేజర్ సోమనాథశర్మయని రక్షణ శాఖ నిర్ణయించి ప్రభుత్వానికి తెలియజేసింది. సోమనాథశర్మను ప్రప్రథమంగా పరమవీరచక్ర వరించింది.

- ఎ. సీతారామారావు, సెల్ : 8978799860.