విశాఖపట్నం

అమ్మే ఆధారం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుడిబుడి అడుగుల వయసులో
అడుగులెయ్యడం నేర్పించడానికి కావాలి అమ్మ
తడబడే అడుగుల ప్రాయంలో
మంచి నడక నేర్పించడానికి కావాలి అమ్మ
మనసు బాధపడితే ఓదార్పు కోసం
ఒళ్లో తల దాచుకుని కడుపు నిండా
కన్నీళ్లు కార్చడానికి కావాలి అమ్మ
గుండె గాయమయితే అనురాగాల అమృతాంజనం
పూసి అనునయించడానికి కావాలి అమ్మ
పోటీ ప్రపంచంలో ఆడలేక ఓడినప్పుడు
బాధ్యతల బరువుకి జడిసి అడుగు వెనక్కి వేసినప్పుడు
నేనున్నానంటూ వెన్ను తట్టి ధైర్యంగా చేయూత
ఇవ్వడానికి కావాలి అమ్మ
అమ్మ అండతోనే ఎదగాలి
అమ్మ తోడుతోనే పెరగాలి
- శివానీ, విశాఖ.

సమ సమాజం

పాత నోట్ల రద్దు
అవినీతికి హద్దు
నల్ల కుబేరుల దిగులు
పేదవారికి మిగులు
ధరలు తగ్గుతాయి
అందరికీ అన్నీ అందుతాయి
ఫలాలు అందే ముందు
కష్టపడి పోషణ చేయాలి
ఆదిలో ఎదురైన ఇబ్బందులు
కాలం గడిచే కొద్దీ సద్దుమణుగు
- పల్లంటి వెంకట రామ కుమారరావు,
చినవాల్తేరు, విశాఖపట్నం.
సెల్ : 9441344503.

బాల భారతం

బంగరు బాలలు వీళ్లు
దేశపు భవితలు వీళ్లు
రేపటి ఆశలు వీళ్లు
మన కలలకు రూపం వీళ్లు
అమ్మా నాన్నల్లారా
చల్లని నీడల్లారా
వారిని గమనించండి
ప్రతిభను గుర్తించండి
మంచిగ పెంచండి
వారి ఉన్నతే మన రేపటి సంతోషం
వారి కళ్లెదుటే మనము చేయు తప్పులు
వారి భవితకు కలిగింపు ముప్పు
గురువుల్లారా బాలల భవితకు శిల్పుల్లారా
బాధ్యత కలిగిన పెద్దల్లారా
నీతి కథలు చెప్పండి
క్రమశిక్షణ నేర్పండి
మంచిబాట చూపండి
రేపటి తరముకు, భారత భవితకు
చక్కటి పునాదులెయ్యండి
- చావలి శేషాద్రి సోమయాజులు

చలం ఓ సంచలనం

చీకట్లో దుప్పట్లో కౌగిట్లో
కోర్కెలు రెక్క విప్పుకున్నప్పుడు
మదం చుక్కై జారుతున్నప్పుడు
క్షణికావేశం ముళ్లు విరుచుకున్నప్పుడు
కామానికి, రోమాంచిత శృంగారానికి
ప్రేమారాధననే మేలి ముసుగు వేయవద్దని
తనువుల తపన శృంగారమని
మనసుల మమత ప్రేమని
రసరమ్య భాష్యం చెప్పావు
మైదానంలో స్వేచ్ఛా విహంగాలకు
అంగాంగం శృంగార భంగిమలు నేర్పావు
మనువొకరితో మనసొకరితో
అనువుగాని ఆలి తాళి తెంచమన్నప్పుడు
నిలువెల్లా వణికిపోయారు ఛాందసులు
అణువణువు కంపించిపోయింది సంఘం
నీ ఊహలు ఊపేస్తున్నాయి
నీ మాటలు విచ్చుకుంటున్నాయి
నీ వాడి వేడి అక్షరాలు
లక్ష్యాన్ని ఛేదించే తూణీరాలు
నీ భావాలు సజీవాలు
నీ ధ్యేయాలు సంచనాలు
- బండారు చిన్న రామారావు (లోగిశ),
సెల్ : 9553330545.

మహిళా ఓ మహిళా

అన్నీ తానై అన్నింటా
ఉనికిని చాటుకునేదెవరు? ఇంకెవరు మహిళ
అడ్డంకులను అవరోధాలను దాటుకుని
నేర్పుగా సంసార రథాన్ని నెట్టుకొచ్చేది మహిళ
ఇల్లు చక్కదిద్దుకుని అందరికీ తలలో నాలుకై
మసలుకునే నేర్పరి మహిళ
- కృష్ణకుమారి, బాబామెట్ట,
విజయనగరం జిల్లా. సెల్ : 9441567395.