విశాఖపట్నం

నడ్డి విరిగింది (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా నడ్డి విరిగింది. అయితే విశేషం ఏమిటి? అని మీరంటారని నాకు తెలుసు. కాని అది ఎలా విరిగిందో చెబితే మీరలా అనరని చెప్పగలను. ఇంతకీ నా నడ్డి ఎలా విరిగింది?
నా కాలేజీ లైఫ్‌లో రకరకాల ఆటలు ఆడేవారు. లాంగ్ జంప్, హైజంప్, ఆ జంపూ ఈ జంపూ అన్నీ దూకేవాడిని. జామకాయల కోసం, పక్కింటి అమ్మాయిల కోసం గోడలు కూడా దూకాను. అయితే అప్పుడు విరిగిందా ఈ నడ్డి. కాదు... కాలేజీలో బహుమతులు పొందినపుడు చీఫ్ గెస్ట్ తన భారీ హ్యాండ్‌తో షేక్‌హ్యాండ్ ఇస్తూ చెయ్యి తెగ ఊపేసినపుడు కింద పడి విరిగిందా నడ్డి కాదు.
ఒకసారి అలవాటుగా ఊరవతల తోటలకి షికారు వెళితే ‘‘హెల్ప్‌హెల్ప్’’ అనే అరుపులు వినిపించాయి. గండుపిల్లి మొహంలాంటి ఒక వ్యక్తి ఎదురుగా ఉన్న అమ్మాయిపై తెలుగు సినిమా విలన్లా రేప్ చేయబోతుంటే నేనొక హీరోలా ఫోజుచ్చి ‘‘దుర్మార్గుడా మర్యాదగా ఆమెను విడిచిపెట్టు’’ అన్నాను.
‘‘హహ్వహ్వ’’ అని నేను కాదు వాడు నవ్వాడు.
ఇక ఉపేక్షించి లాభం లేదని తెలుగు సిన్మాలో హీరోలా గాలిలో ఎగిరి వాడి ఛాతీపై తన్నాలని కొద్దిగా వెనక్కు వెళ్లి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి వాడి పైకి కాళ్లు విసిరాను. కాని వాడు నాకన్నా సినిమాలు ఎక్కువ చూసాడులా ఉంది. వెంటనే పక్కకు తప్పుకున్నాడు. నేను విసురుగా కింద పడ్డాను. అప్పుడు విరిగిందా ఈ నడ్డి? లేనే కాలు కణేల్ మంది. ఆవేశం, కోపం కమ్ముకు రాగా కుంటి కాలితో వాడి దగ్గరకు వెళ్లి ఒంటి కాలిపై నిలబడి డిష్యూం డిష్యూం అని నోటితో శబ్దం చేస్తూ రెండు చేతులతో వాడి శరీరంపై గుద్దాను. దానికి వాడు చలించకపోగా రివర్స్‌గేర్‌లో నా దవడ మీద ఒక్కటిచ్చాడు. అంతే ఒంటికాలిపై నిలుచుని ఉన్నానేమో బ్యాలెన్స్ కాయలేక కింద పడిపోయాను. అలా దబ్బున పడిపోయినప్పుడు కూడా విరగలేదు నా నడ్డి. సినిమాలలో డైరెక్టర్, స్టంట్‌మాస్టర్ చెప్పినట్లు ఫైట్లు జరుగుతాయి కనుక బక్కలా ఉన్న హీరో బొండాంలాంటి విలన్‌ను చితక్కొట్టేస్తాడు. ఇక్కడ పరిస్థితి బట్టి ప్రవర్తించాలి అని నిర్ణయించుకుని కింద దొరికిన రాయిని అందుకుని కాలేజీ గేమ్స్‌లో విసిరిన డిస్కస్ త్రో వలె వాడి మీదకు విసిరాను. ఎక్కడ తగిలిందో, ఏమయిందో గాని వాడు ‘‘అమ్మో’’ అంటూ పారిపోయాడు.
వెంటనే ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి ‘‘్థ్యంక్స్. మీ సహాయం మరువలేను’’ అంది.
నేను కూడా మనసులో ఈ దెబ్బలు మరిచిపోలేను అనుకుంటూ పైకి మాత్రం ‘హిహిహి’ అని నవ్వుతూ ‘‘దానికేముందిలెండి’’ అని చెప్పి వెళ్లబోయాను.
ఆమె నన్ను ఆపి ‘‘మీరు సినిమాలు చూడరా?’’ అంది.
‘‘ఎందుకు చూడను. ఎవడైనా బేవార్సుగా తీసుకెళితే’ అని మనసులో అనుకుని బయటికి మాత్రం ‘‘మొదటి రోజే చూస్తానండి’’ అన్నాను.
‘‘అయితే మీకు సినిమా ఫండమెంటల్స్ తెలియవా? ఆపదలో ఉన్న హీరోయిన్‌ను రౌడీల బారి నుండి తప్పించగానే హీరో ఏం చేస్తాడు’’ అని అడిగింది.
సినిమాలు చూడడంలో పిహెచ్‌డి చేసినట్లుంది. ఇలా అడుగుతుంది. ‘‘హీరో ఏం చేస్తాడు కట్లు కట్టించుకుంటాడు’’ అన్నాను దెబ్బ తగిలిన చెయ్యి, కాలు రాసుకుంటూ.
‘‘అదెలాగో తప్పదు లెండి. తర్వాత ఏం జరుగుతుంది’’ కొంటెగా అడిగింది.
‘‘ఓ మైగాడ్ ప్రేమలో పడతారు’’ అంటూ ఆమె ప్రేమలో పడ్డాను. ఆ సందర్భంలో విరిగిందా నా నా నడ్డి కాదే.
ప్రేమా అయింది, పరుసూ ఖాళీ అయింది. తిరిగినందుకు శిక్షగా పెళ్లి కూడా జరిగింది. ఇవన్నీ అయ్యాక పిల్లలు పుట్టడం ఎలా ఆగుతుంది? పిల్లలు పుట్టడమే కాదు ధరల్లా పెరిగారు కూడా. పెరగడమే కాదు ఇంగ్లీషు, హిందీ సినిమాలు, బాహుబలిలాంటి జానపద సినిమాలు చూసి కత్తియుద్ధాలు, కర్రయుద్ధాలు, రకరకాలుగా యుద్ధాలు ప్రాక్టీసు చేస్తున్నప్పుడు వారి మధ్యలోకి వెళ్లి సినిమా డైరెక్టర్‌లా ‘‘కట్‌కట్’’ అనప్పుడు నడ్డి విరిగిందా లేదే.
నా శ్రీమతికి నాకూ అప్పుడప్పుడు అభిప్రాయభేదాలు, చిన్న తగాదాలు వస్తుండేవి. అప్పుడే నా శ్రీమతి అలిగి పుట్టింటికి వెళ్లబోతుంటే భవిష్యత్తులో వంటింట్లో వంట చేయడానికి పడే పాట్లు గుర్తుకు వచ్చి ‘‘శ్రీమతి శ్రీమతి నీకిది భావ్యం కాదు. నీవు లేని జీవితం ఐటెం సాంగ్ లేని సినిమాలాంటిది అని నచ్చజెప్పబోగా నన్ను ఐటెంగర్ల్‌తో పోలుస్తావా అని మరింత కోపం తెచ్చుకున్నప్పుడు ఆమె వల్ల విరిగిందా ఈ నడ్డి లేదే.
అసలు విషయం చెప్పకుండా టివి సీరియల్‌లా మిమ్మల్ని అనేక ఎపిసోడ్లు చుట్టించాను అనుకుంటున్నారా? నోనో అసలు విషయం ఏమిటంటే ఒకరోజు అలా రోడ్డు మీద షికారుగా తిరుగుతున్నాను. మెయిన్‌రోడ్డుపై మహిళలందరు ఊరేగింపుగా వెళుతూ ‘మగవాళ్ల పెత్తనం నశించాలి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిందాబాద్. బానిస బతుకులు ఇక వద్దు’’ అంటూ మగవారి ఆధిపత్యాన్ని నిరసిస్తూ అనేక స్లోగన్లు ఇస్తున్నారు.
ఎంతయినా మగవాడిని కదా నాలో పౌరుషం ఉప్పెనలా పొంగి ఏటికి ఎదురెళ్లినట్లు వాళ్ల దగ్గరకి వెళ్లి నడ్డి మీద చేతులు పెట్టుకుని ‘‘ఏం మగవాళ్ల ఆధిపత్యం ఎందుకొద్దు’’ అని అడిగాను.
అంతే నా నడ్డి విరిగింది.

- సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ, సెల్ : 9989397651.