అక్షర

వివిధ వాదనల వి‘్భన్న’ రచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ఉద్యమం, దళిత వాదం, వ్యాపార సంస్కృతి, అవకాశవాద రాజకీయాలు, రైతు సమస్యలు, వ్యక్తిత్వ వికాసం, సాహిత్య ప్రయోజనం లాంటి భిన్న అంశాల మీద దామెర రాములు రాసిన కవిత్వం ‘్భన్నకాలం’ సంపుటిగా వెలువడింది.
ముందుగా తెలంగాణ పోరాట వీరుల్ని స్మరిస్తూ ‘మీరు కోరిన పునర్నిర్మాణ/ సామాజిక సమసమాజ తెలంగాణే లక్ష్యంగా/ మేం ప్రతిన చేస్తున్నాం’ అని తెలియజేస్తారు. ‘పరస్పరం పొసగక విడిపోయినా/ కలిసున్ననాటి చెలిమి చెరిసగం పంచుకుందామంటే/ కలతలెందుకు? కఠిన వైఖరులెందుకు’ అంటూ విభజనానంతర వేళ ఈ విద్వేషమేల అని నిలదీస్తారు. ‘ఉత్సాహంగా అవధులు లేని ఆనందంతో/ జరుపుకునే ఈ బతుకమ్మ/ సామూహిక పుష్పోత్సవం’ అని పొంగిపోతారు. ‘ప్రజల ఆకాంక్షల అవసరాలు/ పాలనా సౌలభ్యాలు పంపిణీల్లో సమతూకం/ పాత జిల్లాలు తీర్చలేవు’ అంటూ విజయదశమి రోజున ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను సమర్థిస్తారు. కొత్త రాష్ట్రం వచ్చింది. మిషన్ కాకతీయ ఫలితాలు బాగానే వచ్చాయి. అయినప్పటికీ రైతులు, కార్మికులు, నిరుద్యోగుల కష్టాలు తీరేట్టుగా లేవు. కుల సంఘాలకు, బలహీన వర్గాలకు తాయిలాలతో కాలం గడిపేస్తున్నారు. ధర్నాచౌక్ తరలింపు, ఉద్యమ నేతల ఇళ్లపైబడి అరెస్టులు చేసినా అసమ్మతిని అణచివేయ లేకపోతున్నారు. ‘పొంతనలు లేని వాగ్దానాల్తో/ అమలుకు నోచుకోని ప్రణాళికల్తో/ దబాయింపుల సతాయింపుల/ తెలంగాణ కాదు ఈ ప్రజలు కోరుకుంది’ అని హేవళింబి సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తెలియజేస్తారు. విమర్శలు, ఉద్యమాల్ని అణచివేసేందుకు ధర్నాచౌక్‌ను నగర శివార్లకు తరలించడంలోని అనౌచిత్యాన్ని ప్రశ్నిస్తూ ‘మన సమాజంలో సైతం/ అలాగే అర్థవంతమైన చర్చకు/ తలుపులు తెరుద్దాం/ అందర్నీ మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం/ భావ ప్రకటనా స్వేచ్ఛ/ హద్దుమీరనంత కాలం అనుమతించాల్సిందే’ అని ప్రకటించడం బాగుంది.
‘అది అమెరికా ఇది ఇండియా/ అక్కడ తెల్లవాడు ఇక్కడ మనువాది/ ఇక్కడ దళిత జీవి దేశంలో ఏదో మూల/ రోజూ హింసింపబడుతున్నాడు/ అక్కడ నల్లవాడు రోజూ గురవుతున్నాడు/ అణచివేతకో కిడ్నాపింగ్‌కో హత్యకో’ ఎక్కడకుబోయినా ఇంతేనా అని కవి బాధగా ప్రశ్నిస్తున్నాడు. ‘ఈ నిచ్చెన మెట్ల సమాజంలో/ కింద మెట్టు మోసే బరువెంత?’ అని నిలదీస్తూ ‘నిచ్చెన మెట్ల సమాజం కాదు కావాల్సింది నేడు/ నెచ్చెలితనం సమానత్వం పంచి ఇచ్చే’ సమాజం కావాలని కోరుకుంటున్నాడు. ‘అగ్రవర్ణాలు వొడిగట్టిన/ దుష్కృత్యానికిదో మచ్చుతునక’ అంటూ ఉత్తరప్రదేశ్ బధౌన్ జిల్లాలో జరిగిన దళిత బాలికలపై అత్యాచారం, హత్య సందర్భంగా చలించిపోయిన కవి, దానికి ప్రతీకారం తప్పకుండా జరుగుతుందని హెచ్చరిస్తారు. అలాగే సామాజిక విప్లవకారుడు మహాత్మాఫూలే స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని మరో కవితలో చెబుతారు.
కళ ప్రజల కోసమే అని విశ్వసించిన కవి ‘శ్రోతల హృదయ సీమల్ని/ జీవమున్న పాట/ అలుముకుని అలరించి గెలుచుకోవాల’ని నిర్ధారిస్తారు. గద్దర్ సంగీత విభావరిని చూసి పరవశించిన కవి ‘మంచి మాట జనం మెచ్చిన పాటై/ నేలలో ఇంకి పురుడు పోసుకుని మొలకెత్తి/ జనావళికి నిండైన భరోసా ఇచ్చి నిలిచింది’ అంటారు. ‘నా ఈ ఆరుపదుల జీవన గమనంలో/ అల్లని కావ్యాలెన్నో.. పాడని గీతాలెన్నో../ ఏరుకోని అంది రాని జ్ఞాపకాల దొంతరలెన్నో..’ అని గుర్తించిన కవి ‘నేను నా సొంత గొంతుకతో/ కావ్యరాజాల్ని వెలయించి/ సమర్పిస్తా రసజ్ఞులకు’ అని హామీనిస్తారు. అలాగే ‘కవి నెవరైనా విమర్శించవచ్చు/ సమాజానికి ఏ కొద్దిగానైనా/ పనికొచ్చె సాహిత్యం రాయకపోతే/ రాసిన దానికి కట్టుబడి ఉండకబోతే’ అని హెచ్చరించడంతోపాటు ‘నాన్చివేత దాటవేత కట్టిపెట్టి/ ముక్కుసూటిగా ముక్కుతిమ్మనలా అందంగా/ చెప్పడం రివాజు చేసుకో/ నిలబడతావు నిటారుగా/ సాహితీ లోకంలో’ అని తెలియజేస్తారు. ‘వెలుగు వెల్లువలోకి చీకటి కోణాల్ని/ అక్షరాకృతితో చిత్రించాలన్నా/ విశదంగా వినూత్నంగా లోకానికి అందించాలన్నా/ ముందు నువ్వు దృఢంగా నిశ్చయంగా/ రీఛార్జ్ కావాల్సిందే’ అని నిర్ధారిస్తారు.
‘ఎంతకీ అంతుపట్టదు ఎవరికీ/ ఎందుకు జీవన యానం సాగిస్తున్నామో/ సమాజానికెంతవరకు/ ఉపకరిస్తున్నామో తెలీని/ జనాలే ఎక్కువ మనలో’ జీవితంలో ఓడిపోయి ఆత్మహత్యలకు ప్రయత్నించేవారిని ‘విజేతలు కూడా ఒకప్పుడు/ పరాజితులే! పడిలేచిన వాళ్లే’ అని ఓదారుస్తారు. ‘చావు చివరంచుల దాకా వెళ్లే/ మానసిక దుర్బలులకు/ ఏ దిక్కూ కానరాని బధిరాంధులకు/ నువ్వు కాంతి రేఖవై కనిపించాలి/ బతుకుతోవ చూపించాల’ని బోధిస్తారు. ‘నీకూ ప్రపంచానికి మధ్య గనుక జరిగే/ యుద్ధమైతే నిస్సంకోచంగా నీవు/ ప్రపంచంవైపే నిలబడు/ చరిత్ర అధ్యాయాల్లో నిలచి నిలబడిపోతావ్’ అని కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు.
కుళ్లు రాజకీయాల మీద, అధికారం కోసం నానా గడ్డి కరిచే నాయకుల మీద నిరసన తెలియజేసే కవితలున్నాయి. ప్రభుత్వాలు ఎడాపెడా విధించే పన్నుల భారాన్ని సామాన్యుడు మోయలేక పోతున్నాడని వివరించే కవిత ఒకటి ఉంది. జి.ఎస్.టి. వచ్చింది కదా! ఏమైనా తగ్గుతాయేమో చూద్దాం. వినిమయ సంస్కృతికి అలవాటుపడే ఆకర్షణల నుండి తప్పించుకుని ‘మోసాల అంగడికి చెక్’ పెట్టాలని చెబుతాడు. జూదంలా పరిణమించిన వ్యవసాయం. పంట చేతికి వచ్చిందాకా భరోసా ఉండదు. వర్షాధార వ్యవసాయమే అయినప్పటికీ, పంట చేతికి వచ్చే ముందు కురిసే అకాల వర్షాలు రైతును మరింతగా కుంగదీస్తాయి. ‘రైతాంగం దృఢచిత్తంతో నిలబడిన్నాడే/ భిన్నకాలాన్ని అకాల వర్షాల్ని/ ధైర్యంగా ఎదుర్కొని/ మనగలుగుతుంద’ని కవి భరోసా ఇస్తున్నాడు.
‘ఇవాళ రైతుకి/ కుడి ఎడమల నిలిచినవాడే/ కవి...’ అని ప్రకటిస్తున్నాడు కూడా. బాల్యం మరపురాని సన్నివేశాల వేదిక. దాన్ని మరిచి బాల కార్మికులుగా మార్చేసి వాళ్ల జీవితాలను నాశనం చేయవద్దని వేడుకుంటాడు. ధ్వంసమవుతున్న గ్రామీణ సంస్కృతి, కొనసాగుతున్న వివక్ష, కాంక్రీటు జనారణ్యాలు, శబ్ద కాలుష్యానికి దూరంగా ‘ఇంత చేతినిండా పని కోసం/ గౌరవంగా బతకడం కోసం’ వలసబోయిన మిత్రుడ్ని వెతుక్కుంటూ వెళ్లిపోవడంలోని విషాదాన్ని గమనించాల్సిందే.
ఏదో ఒక వాదానికో, సిద్ధాంతానికో కట్టుబడి ఉండి దాని కనుగుణంగా కవిత్వం రాసుకుంటూ పోయేవారికి ఏదో ఒక ముద్ర వేయడానికి అవకాశముంటుంది. అలా కాకుండా అన్ని వాదాలను తనదిగా చేసుకుని కవిత్వం రాసేవారు కూడా ఉంటారు. వారు ఎలాంటి ముద్రలకు లొంగరు. అలాంటి వారిలో ఒకరు దామెర రాములు. అన్ని వాదాలను సమ్మిశ్రీతం చేసుకున్న ధోరణి రాములు కవిత్వంలో కనిపిస్తుంది. నిరంతరం తన్నుతాను శోధించుకుంటూ సారాంశాన్ని గ్రహించి, దాన్ని క్రోడీకరించుకుని పాఠకుడికి చేరువయ్యే రీతిలో తన కవిత్వం ద్వారా వ్యక్తపరుస్తుంటారు. భావాల పట్ల స్పష్టత, వ్యక్తీకరణ పట్ల స్పష్టం ఉండటం వల్ల కవిత్వం సరళంగా వుండి ‘్భన్న కాలాల్లో’ కూడా పాఠకుడ్ని ఆకట్టుకో గలుగుతుందని చెప్పవచ్చు.
భిన్నకాలం (కవిత్వం)
-దామెర రాములు
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
హైదరాబాద్.
వెల: రూ.100
పేజీలు: 159

-కె.పి.అశోక్‌కుమార్