Others

చైనా వస్తువుల బహిష్కరణే పరిష్కారం కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం మంచి ఫలితాలు ఇవ్వాలంటే- కేవలం నినాదాలు చేస్తే చాలదు.. మన వస్తు ఉత్పత్తి సంస్థలు, విక్రేతలు కొంత లాభాపేక్ష తగ్గించుకుని సాధ్యమైనంత తక్కువ ధరలకు వాటిని విక్రయించాలి. సామాన్య ప్రజానీకం అవసరం తీరితే చాలు అనుకుని సహజంగా వస్తువుల నాణ్యత కంటే చౌక ధరలకే మొగ్గు చూపుతారు. ప్రపంచ మార్కెట్‌లో చైనా దూసుకుపోవడానికి ఇదే ముఖ్య కారణం. మన దేశంలో కూడా ఎన్నో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు భూమి, నీరు వంటి రాయితీలు ఇస్తున్నారు. మానవ వనరులు చౌకగా లభిస్తున్నాయి గనుక మన సంస్థలు సాధ్యమైనంత పోటీ ధరలకు విక్రయిస్తే స్వదేశీ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది.
కొన్ని కార్పొరేట్ సంస్థలు తమకు పెరిగిపోతున్న భారీ లాభాలను ఏం చేయాలో తెలియక ముఖ్యాధికారుల జీతభత్యాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటున్నాయి. సగటు ఉద్యోగి కంటే 1200 రెట్లు ఆదాయం అంటే కోట్ల రూపాయలు వేతనాలు చెల్లిస్తున్నాయట. అదే అర్హతలుండి, అంకిత భావంతో పనిచేసే చిన్న సంస్థల్లోని ఉద్యోగులకు జీతాలు వేల రూపాయల్లోనే ఉంటున్నాయి. పెద్ద ఉద్యోగికైనా, చిన్న ఉద్యోగికైనా నిత్యావసర ఖర్చుల్లో అంతగా తేడా వుండదు. ఫలితంగా పెద్దల్లో విలాసాలు, దుబారా సంస్కృతి పెరిగి అందరి జీవన వ్యయం పెరుగుతోంది. సమాజంలో ఆర్థిక అసమానతలు, అశాంతి కూడా పెరుగుతున్నాయి.
అసలు కార్పొరేట్ సంస్థల భారీ లాభాల్లో ప్రభుత్వాల, ప్రజల పాత్ర కూడా ఉంది. ప్రభుత్వాలు భూములు, విద్యుత్, నీరు వంటి రాయితీలు నామమాత్ర ధరలకు అందించడం (తాజా ఉదాహరణ హిందుస్తాన్ జింక్ లిమిటెడ్‌ను వేదాంత సంస్థకు అప్పగించడం, వారు భూములు, ప్లాట్స్‌గా అమ్మడం వంటివి) చూస్తున్నాం. సామాన్య మదుపరులు బ్యాంకుల్లోదాచుకున్న డబ్బును చౌక రుణాలుగా పొంది మరికొందరు సక్రమంగా బ్యాంకు బాకీలు చెల్లించకుండా భారీ లాభాలార్జిస్తున్నారు. సొమ్ము ఒకడిది, సోకొకడిది అన్నట్టు ప్రజలకు మాత్రం మేలు జరగడం లేదు. ఇకనైనా అటువంటి సంస్థలు ప్రజలకు అందుబాటు ధరలతోపాటు స్వదేశీ వస్తు వినియోగం పెంచే చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు పతంజలి వంటి స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఆ లాభాలు నిధులు మనదేశంలోనే వుంటాయి కనుక.

-తిరుమలశెట్టి సాంబశివరావు