Others

నందుని భాగ్యం.. వసుదేవునికి ఆనందం (శ్రీకృష్ణామృతం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందుడుతాను కట్టవలసిన పన్నును కట్టివేయకపోతే కంసుడు అరిష్టాలను సృష్టిస్తాడనుకొన్నాడు అందుకే వెంటనే రేపల్లెను రక్షించడానికి యోధులైన గోపకులను నియమించాడు. తన ఇంటా బయటా కూడా రక్షణకవచాన్ని ఏర్పాటుచేశాడు. అన్ని రక్షణలు చేసి యశోదకు పిల్లవాణ్ణి జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి మరీ పన్నులు కట్టడానికని మధురానగరికి బయలుదేరి వెళ్లాడు నందుడు. కంసునికి కప్పం కట్టివేసాడు. తన బంధువు, పుట్టిన శిశువులను కోల్పోయి కష్టంలో ఉన్న దేవకీ వసుదేవులను చూడడానికి నందుడు వెళ్లాడు. నందుని చూడగానే వసుదేవుడు ‘నందా! నీవు వచ్చి నా ఈ దేహమనే కట్టెలో ప్రాణాలనుపోశావు. నీ నందకులమంతా బాగుంది కదా. యశోదమ్మ, ఆమె చెంత నున్న బాలుడు క్షేమంగా ఉన్నారు కదా. రోహిణి బలరాములు క్షేమమే కదా. యశోదమ్మ బిడ్డడు ఏమి చేస్తున్నాడో ఎలా ఉన్నాడో మాకు కాస్త వివరం చెప్పు. పుణ్యాలు అన్నీ మూట గట్టి యశోదమ్మ కొడుకుకు తండ్రివైన నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోంది’’ అంటూ ఎన్నోమార్లు యశోదమ్మ బిడ్డడి గురించి వసుదేవుడు మాటిమాటికి అడిగాడు.
అట్లా అడిగే వసుదేవుని చూచి నందుడు ఎంతో వ్యధ చెందాడు. అయ్యో ఈ వసుదేవుడు ఎంతటి పుణ్యహీనుడో కదా. పుట్టిన బిడ్డలందరినీ కోల్పోయాడు. అందుకే ఇంత పరితాపానికి గురి అయినాడు. ఏమి చేద్దాం విధి ఎందుకింత క్రూరంగా ఉంటుందో మనుషులను ఎందుకింత బలహీనులను చేస్తుందో కదాఅనుకొన్నాడు. వెంటనే వసుదేవుని ఓదార్చాలనుకొన్నాడు.
‘బావా ఎందుకింత బాధపడుతున్నావు. నీకు పుట్టిన ఆరుగురు శిశువులను ఆ కంసుడు పొట్టన పెట్టుకున్నాడు. ఆడశిశువును కూడా ఆకాశంలో ఎగిరివేస్తే ఆ పాప మరలా కనిపించకుండా పోయిందట కదా. అయ్యో ఏమని చెప్పను నీ కష్టాన్ని.. అయినా దిగులు చెందకు నా కుమారుడే నీ నందనుడనుకో.. నా కుమారుడిని చూచినీవు ఆనందించు. పరమాత్మ కరుణ నీకు తప్పక కలుగుతుంది. ఈ కంసుని చావు ఎంతో దూరంలో లేదు. ఇక మనకు సుఖాలను ఇవ్వడానికి పరమాత్ముడు తప్పక వస్తాడు’ అంటూ వసుదేవుని నందుడు లాలించాడు. ఓదార్చాడు. తనకు కలిగిన కుమారుని అందాన్ని గూర్చి అతడు చేసేచేష్టల గురించి, ఆ శిశువు చూసే చూపుల గురించి పదే పదే నందుడు చెబుతూనే ఉన్నాడు. వసుదేవుడు కూడా కృష్ణుని సంగతులను మరీ మరీ చెప్పించుకుని విన్నారు. నందుని భాగ్యాన్ని తలుచుకుని దేవకీ వసుదేవులు ఆనందించారు.
నిజం తెలియక మాట్లాడుతూ అప్యాయతను పంచే నందుని హృదయ గొప్పతనాన్ని కొనియాడుతూ మరింతగా కనుల నీరు నింపుకున్నాడు వసుదేవుడు. ‘విధి విచిత్రమైంది కదా. ఆ విధి ఎట్లా ఆడిస్తే ఆడే కీలుబొమ్మలమే కదా! మరేం ఫర్లేదు. ఆ దేవదేవునికి నాపై కరుణ ఉంటే చాలు నీ కుమారుడే నా కుమారుడుగా అనుకొంటాను. ఈ చిన్నివాడు కష్టాలు కడతేర్చే దేవాదిదేవునిగా ఎదగాలి’ అంటూ నందనందునిగా ఎదుగుతున్న పరమాత్మను వసుదేవుడు దీవించాడు. అట్లా సుఖసంతోషాలతో ఉన్న రేపల్లె ఆనందాల గురించి ఆ నోట ఈ నోట పాకి చివరకు కంసునికి చేరాయి. మహావిష్ణువు ఎక్కడో ఒకచోట పుట్టి పరమాత్మునిగా హారతులందుకుంటున్నాడని చెప్పిన ఆ యోగమాయ మాట పలుమార్లు గుర్తుకు వచ్చి కంసుడు క్షణక్షణమూ భయంతో అల్లాడిపోతున్నాడు.
ఏమి చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నాడు. ఏ వైపునుంచి ఎప్పుడు ఆ మహావిష్ణువు వచ్చి తన్ను దునుమాడుతాడో అని భయంతో కంపించిపోతున్నాడు. చారులను పంపి లోకం నలుమూలల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుని వింటున్నాడు. అన్నం తినాలన్న కనీసం మంచినీరు తాగాలన్నా మనస్కరించడం లేదు. మహావిష్ణువు స్మరణ తప్ప మరేం చేయలేకపోతున్నాడు కంసుడు. శిష్టులే కాదు భగవంతుని స్మరణ చేసేది దుష్టులు కూడా అంటే ఇదే కదా. సాధారణ మానవులు కష్టం వస్తే ఏవిధంగా పరమాత్మను మాటిమాటికి తలుచు కుంటారో అదేవిధంగా భగవంతుడైన కృష్ణుణ్ణి తలుచు కుంటూ నిలువునా నీరుగారి పోతున్నాడు కంస మహారాజు.

చరణ ‚శ్రీ