ఉత్తర తెలంగాణ

మరుభూమి (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది నుండి మూగదైన ప్రకృతిని
అనాదిగా కొల్లగొడుతూనే ఉన్నాడీ మనిషి
నది ఒడ్డున వెలసి
నాగరికతలు నేర్చిన
మనిషి ఆ నదులనే మింగేసి
కాలుష్యాన్ని కడవలతో గుమ్మరించి
చేసిన నిర్లక్ష్యానికి ఫలితం
ప్రక్షాళనకి కోట్లు గుమ్మరించినా
తడారిపోయిన నది గొంతు
బీటలు వారిన నదీగర్భం
చివరికంటా ఎండిపోయిన చెమ్మ
ధనం మాయలో కొట్టుకుపోతూ
సంపాదన మోజు తలకెక్కి
బాంధవ్యాలను తోసిపుచ్చి
బంధాలను నిర్లక్ష్యాల నిశీధిలో
వదలిన ఫలితం
పలకరింపు కోసం అలమటిస్తూ
ఒంటరి దీవుల్లో విహారాలు
చరవాణీ నేస్తాలకై వెంపర్లాటలు
బంజరు భూమిగ మార్చి
విచక్షణారహిత విపరీతాలకి
నిర్లక్ష్యపు ప్రయోగాలకి ఫలితం
గడ్డి పోచైనా మొలవక
వట్టిపోయిన పంట భూమి
మరుభూమిగా మిగిలిన నేల
అత్యాశతో ఆకసానికెగిరి
ముంత ఒలకబోసుకుంటే
దురాశలకు పాల్పడి
నిర్లక్ష్యపు ధోరణి అలవడితే
ఆఖరికి అధోగతి తథ్యం
- డా. జి.వి.ఎస్. అనంతలక్ష్మి
హైదరాబాద్
సెల్.నం.9866954194

ఎందుకు?
లవ్ మాఫియా
సిమ్ కార్డ్‌లా మారిపోయే ప్రేమికులు
మ్యారేజ్ మాఫియా
కలిసుండి విడిపోయిన మనసులు
ఫ్రెండ్స్‌షిప్ మాఫియా
అవసరానికో రకం పలకరింపు
అన్నింటిపై అగ్గి

రగులుతున్నాం..పోరాడుతున్నాం
మరి తల్లిదండ్రులను అనాథలను చేసి
అనుబంధాల మాఫియాపై మనమెందుకు
పోరాడలేకపోతున్నాం..
మానవత్వాన్ని మరిచిపోతున్న
అమానుష రాక్షసులను మనమెందుకు
నిర్దయగా వదిలేస్తున్నాం
లోపల లేని ప్రేమలను ముఖానికి

పూసుకునే
పగటి వేషగాళ్లను మనమెందుకు

క్షమిస్తున్నాం
- కొత్త అనిల్ కుమార్
కరీంనగర్, సెల్.నం.9395553393

దేశం కాని దేశం
ఉపాధి వేటలో.. వలస పక్షుల్లా
దేశం కాని దేశానికి ఎగిరిపోయి..
కన్నపిల్లలకు, ఆలికి
అయినవారికి దూరమై..
జీవనమే భారమై..
ఒక్కో పైస కూడబెట్టుకొని
నువ్వు వస్తావని ఎదురుచూశాం!
కానీ..
మా ఆశలు ఆడియాశలు చేసి..
డబ్బుతో వస్తావన్న నీవు..
డబ్బాలో శవమై వచ్చావు
మమ్మల్ని అనాధల్ని చేశావు!
- కళ్లెం కల్యాణ్
తొంబర్రావుపేట, జిల్లా జగిత్యాల
సెల్.నం.9949936529

పలకరింతల పలవరింతలు
తీయని గాయాలను
చేదు జ్ఞాపకాలను
విషపు పూతలను
రహస్యపు హంగులను
ఉబుకుతున్న స్నేహతడిని
ఉరుకుతున్న కాలపు వడిలో
ప్రకృతిలో స్వచ్ఛతను విడిచి
ప్లాస్టిక్ దరహాసాలను పులుముకొని
పెదవులపై జార్చుకునీ పలకరింపులు
ముసుగేసిన మనసునో
ముత్యమంటి మంచినో
దుర్భిణీ వేసి చూపుతుంటాయి...
కొన్ని పలకరింపులు
నోట్లోంచి హితాలను పుక్కిరిస్తూ
నొసటిలోంచి వెక్కిరింతల
శరాలను సంధించి
మనసును గాయపరుస్తుంటాయి..
మరికొన్ని పలకరింపులు
రసప్రవాహాలై నీరసాన్ని
ఆమడదూరం తరిమేది
ఎదవాకిట్లో పచ్చనాకు తోరణాలై
ప్రాణవాయువును నింపుతుంటాయి
తనువులను ఆత్మీయ సమీరాలై
చుట్టుకొని
హృదయాన్ని రాగరంజితం
చేస్తుంటాయి..
పసిపాపలాంటి
పవిత్రమైన పలకరింపులు
మనో గవాక్షినిలోంచి
బతుకుల్లో పండు వెనె్నల్ని రాల్చి
పులకింతల పూలు పూయిస్తాయి
- వురిమళ్ల సునంద
బురహాన్‌పురం, ఖమ్మం
సెల్.నం.9441815722

మనసు పరుగు

మనసు పరుగు ఎన్ని మజిలీలు
దాటినా
కోరికలు పుట్టగొడుగులై
పురిగొల్పుతుంటే
ఆశల వలల్ని అందంగా అల్లుకొని
ఊహకందని ఊహల్లో పరుగెడుతూ
ఉన్న జీవితాన్ని దుర్భరం చేసుకొని
లేని జీవితాన్ని మనసు పరుగుకు
జతకట్టి
ఆధునికత మోజులో యువత
ఎప్పటికప్పుడు ఊసర వెల్లులా
రంగులు మారుస్తూ
మోసాలకు పాల్పడుతూ
కన్నవారి కలలను కల్లలు చేస్తూ
కోరుకున్న కోరికలకు
పరుగు పందాలు పెట్టుకొని
అరచేతిలో స్వర్గమనుకొని
సెల్ఫోన్‌ను హస్త భూషణంగా చేసుకొని
సభ్య సమాజాన్ని
పెడదారి పట్టిస్తూ
విధి వంచితులౌతూ
బ్రతుకును నరకప్రాయం
చేసుకుంటూ
సప్త సముద్రాల నీరంతా
కళ్లలో ఒలకబోస్తూ తీరా
కాలాన్ని నిందిస్తూ
‘మనసు పరుగు’లో
జ్ఞాపకాల్ని పదే పదే
వల్లె వేసుకొని
అద్భుత భవిష్యత్‌ను
అథః పాతాళానికి
జార విడుచుకొని
నీటిలో కప్పలై నీలుగుతున్న
యువత మేలుకో!
మనసు పరుగుకు
దారిలేకుండా చూడూ..
- చిందం సునిత, కోరుట్ల, జగిత్యాల జిల్లా,

సెల్.నం.9701075502

స్థలం లేని దుఃఖం

ఏ దుఃఖాన్ని ఆ దుఃఖాన్ని
విభజించాలని వుంది కానీ
స్థలం చాలటం లేదు
భూమి, ఆకాశం, సముద్రం
అంతటా పర్చాను కానీ
ఇంకా దుఃఖం మిగిలేవుంది!
ఇంత దుఃఖం ఎలా వస్తుంది
వరదలా..
మొదలు లేదు తుది లేదు
జీవితమంతా దుఃఖమే అయినపుడు
ఏ స్థలం చాలుతుంది?
నా దుఃఖం పరాయి దుఃఖం
పేపర్ దుఃఖం టీవి దుఃఖం
అడుగడుగూ
దుఃఖం అలుముకుంటున్నప్పుడు
దినమంతా రాత్రి దుఃఖం
రాత్రి అంతా అప్పు దుఃఖం
ఉదయం తెల్లార లేదనే దుఃఖం
అస్తమయం నా గుండె నిండా
అలుముకుందనీ దుఃఖం
ఆ దుఃఖాన్ని ఎలా తరమగలను నేను
అతీతుడవి కమ్మని
పరమాత్మ బాటలో పొమ్మని
వేదాంతుల ఘోష
పాపం
ఓటు వేయని పరమాత్మునికి
నా బాధలెందుకో!
- సిహెచ్.మధు, నిజామాబాద్
సెల్.నం.9949486122

వానజల్లు
కరువు మేఘాల్ని చీల్చుకొని
తళతళలాడే మెరుపులతో
ఫెటీల్మన విరుచుకుపడే ఉరుములతో
ఓ వర్షపురోజు.. కురిసిన వానజల్లు..
అవని.. ఆకాశం ఏకంగా
కలుపుతున్న వానధారలు!
వాన చుక్కల్లో తడుస్తూ..
మురుస్తున్న ధరిత్రి!
మట్టి దేహంపై అభిషేకపు జలం
సమస్త కల్మషాలను కడిగేస్తూ..
తడి ఇంకిన కళ్లలో
నీటి జల పుట్టినట్లుగా..
ఆనందపు ఊట ఏదో..
నిండుగా మనస్సును మీటినట్లుగా..
ఈ వానజల్లు.. మదిమదిని..
ఎద ఎదను తట్టి లేపుతూ..
ఒక సంభ్రమాశ్చర్యాల హేలలో

ముంచివేస్తూ..
మనస్సునూ..మనిషిని

పునరుజ్జీవింపజేస్తూ..
కోటి ఆశలు..కొత్త కోర్కెలకు పురుడుపోస్తూ..
అమ్మచేతి చల్లని స్పర్శగా
తలపై జారిన నీటిపూల ప్రవాహం
మంచి ముత్యాలహారం.. ఈ వానజల్లు!
- బి.కళాగోపాల్, నిజామాబాద్
సెల్.నం.9441631029