నెల్లూరు

ఒరే.. అనే పిలుపు కోసం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒరే.. అనే పిలుపులోనే ఉన్నది అనుబంధం
కులమతాలకతీతము మన బాల్యస్నేహం
చిన్ననాటి మిత్రులంతా
గుడిలాంటి బడిలో కలసి
తరగతి ముచ్చట్లను తలచుకొంటే
మనసు పొంగె
చిన్ననాటి పోలికలను
తమ మిత్రులలో చూసుకుంటూ
అరె.. ఒరె..అనుకొంటూ
ఆప్యాయత పంచుకుంటూ
గురువు గారు వేయించిన
గోడకుర్చి తలచుకుంటూ
శిక్షలెన్ని వేసిన అవి పెద్దబాలశిక్షలై
మన భవితకు బంగారుబాటలై నిలిచెలే..!

కలకటేరు అయిననేమి?
కవిరాజు అయిననేమి?
మంత్రివర్యులైననేమి?

మహామంత్రులైననేమి?
చిన్ననాటి మన మిత్రుడు
ఎంత ఎత్తు ఎదిగెనేమి?
ఒరే..అనే పిలుపు కోసం..
ఆరాటపడునులే..
ఇది కృష్ణకుచేల బంధం
అనురాగాల సుగంధం
- ఇనకొల్లు మస్తానయ్య
కందుకూరు
చరవాణి : 8096881006

రక్షాబంధనం
పెనవేసిన పేగు బంధములో
విడదీయరాని రక్తసంబంధములో
ఒకే కొమ్మ రెమ్మలం
ఒకే రెమ్మ పువ్వులం
పువ్వుల పొదలో ఒదిగిన గువ్వలం
గలగల ఎగిరే అల్లరి మువ్వలం
మువ్వల సవ్వడిలో
అడుగుల నడకలం
నడకల పయనంలో
కష్టసుఖాల కన్నీటి చుక్కలం
జాలువారే కన్నీటి చుక్కలలో
ఆనంద బాష్పాలం
ఆనంద బాష్పాల ఆప్యాయతలో
చిరునవ్వులం
చిరునవ్వుల చెలిమికి
చిరకాలం స్నేహితులం
కలిమి లేముల కష్టసుఖాలకు
కలకలాం వారసులం
కలకాలం నిలవాలి
అన్నాచెల్లెళ్ల అనురాగం
అమ్మ మనస్సులాగా సాగాలీ
అక్కాతమ్ముళ్ల మమకారం
అందుకు సాక్షిగా అందిన ఫలం
ఇద్దరి మధ్యన అనుబంధం
మణికట్టున వెలసిన
ఈ రక్షాబంధనం
- హస్తి మోహన్‌రాజు
చరవాణి : 8008511316

ఓ మనిషీ తెలుసుకో!
మానవత్వం పరిమళించే
మానవీయ విలువలు
మంటగలిసి పోతుంటే
చూస్తూ, ఊరుకోలేక
నేటి సమాజాన్ని యువతకు
దర్శింపచేస్తూ..
కవిత వ్రాసి హృదయఘోష
తీర్చుకోవాలని తపన..
సహనం కలవారికి - మాటలతో పనిలేదు
మాట అనరు - అనిపించుకోరు
కోపం గల వారికి - శత్రువుతో పనిలేదు
తన కోపమే తన శత్రువు కదా!
దాయాదులున్న వార్కి నిప్పుతో పనిలేదు
ఎందుకని? నిరంతరం అసూయ
ద్వేషంతో రగిలిపోతుంటారు కనుక
మంచి మిత్రుడు ఉన్న వారికి
ఔషధంతో పనిలేదు... ఎందుకని
అమృతతుల్యమైన మాటలతో
సన్మార్గం వైపు నడిపిస్తాడు గనుక,
దుర్మార్గులకు పాములంటే భయం లేదు
ఎందువలన? ఖలునికి నిలువెల్లా

విషమేకదా!
విద్యావంతునికి - ధనంతో పనిలేదు
తన పాండిత్యమే - ఒక ధనాగారం కనుక
సిగ్గు, సంస్కారం గల వనితకు
ఆభరణాలతో పనిలేదు
తన అందమైన సౌందర్యంతో
సృష్టినే, మైమరిపించగలదు కనుక..
ఇదీ.. ఈనాటి నవ సమాజం
భగవంతుడు, ఉతృష్టమైన
మానవజన్మనిచ్చాడు.
అందుకనే..సహనం..సజ్జన సాంగత్యం...
విద్యాధనం. సంస్కారం
సంస్కృతీ పరిరక్షణ వంటి
మంచి లక్షణాలు..అలవరచుకో!
కోపం, దుర్జన సాంగత్యం వదులుకో!
భరతమాత ముద్దుబిడ్డగా! ధీరోధాత్తుడుగా!
సంస్కారవంతమైన - సమాజం వైపు
అడుగులు వేసి - దానవత్వాన్ని విడనాడి
మానవత్వం గల మనిషిగా - మసలుకో!
నీ జన్మ ధన్యం చేసుకో!
- కొడవలూరు ప్రసాదరావు, గూడూరు
చరవాణి : 8500757622

మేఘ భరిణలు (కవిత)
మా పిల్లలు బడికి వెళ్తారు
నాకలల్నీ వాళ్ల కన్నీళ్లనీ భుజానికెత్తుకుని
గాలిలో లేపిన చేతులతో
ప్రేమపూర్వక పుష్పాల్ని బహూకరించి
జీవితాన్ని బ్రతుకు సంచిలో బంధించుకుని
మేఘ్భరిణలు పగిలినంత స్వచ్ఛని

చిర్నవ్వుతో
మా పిల్లలు బడికి వెళ్తారు

ఎవరి ఆనందాన్ని వాళ్లే వెతుక్కున్నట్లు
ఎవరి బ్రతుకుని వాళ్లే దిద్దుకుంటున్నట్లు
వాళ్ల మార్గాన్ని వాళ్లే నిర్మించుకోవటం కోసం
పూర్ణ ఆత్మల వారధుల్ని అవలీలగా

దాటుకుంటూ
పిల్లలు బడికి వెళ్తారు

దిగులుగా తోక ఊపే విశ్వాసి ‘బ్రౌనీ’ తిన్నదో

లేదో
అక్వేరియంలోని ‘డాలీ’కి ఆక్సిజన్

అందుతుందో లేదో
ఈరోజే విచ్చుకోవాల్సిన గులాబీ
మొగ్గ విచ్చుకుందో లేదో
ఈ సందేహాలలో నిండిని మనసుల్ని

నడిపించుకుంటూ
పిల్లలు బడికి వెళ్తారు

నీవు తీసుకురాలేకపోయిన
మెరిసే నక్షత్రం గురించో
నిదురగూళ్లలో కరిగి ప్రవహిస్తున్నప్పుడు
నానమ్మ చెప్పిన మంత్రగత్తె
మహారాజు కథ గురించో
రోజురోజుకీ కొత్తరూపాల్ని
సంతరించుకుంటున్న చెట్ల గురించీ
లక్షల సందేహాలని బయటే త్యగించి
బాల్యాన్ని మింగేస్తున్న జైలులోకి
పవిత్రంగా ప్రవేశిస్తారు
మనకుమల్లే పక్కవాడిని
దోచుకోవడమెలాగో వాళ్లకి తెలీదు
దృశ్యంలోపలి గొంతుకలతో
సంభాషించడమూ తెలీదు
వెనె్నముకల్ని గుజ్జు చేసి
తైలం తీయడం అసలే తెలీదు
వాళ్లు మానవత సంబంధాలకి
గొళ్లాలు బిగించడం చేతకాని వాళ్లు
ఏమీ తెలియకుండానే
ప్రపంచాన్ని ప్రేమతో నింపాలనే

తాపత్రయంతో
పిల్లలు బడికి వెళ్తారు

కలం పోగొట్టుకున్న స్నేహితురాలి
కళ్లలోని దిగుల్ని పసిగట్టి
జామెంట్రీ బాక్సులోంచి
ఓదార్పుని తీసిచ్చి మాయం చేస్తారు
మనం రెండుకళ్లూలేని పక్కవాడికి
ఓ కంటిని బహూకరించి
బ్రతుకు వెల్తురు నింపగలమా?

వాళ్లు గుండెని జండాకి కట్టి
శాల్యూట్ చేయగలరు
నీవు చేయగలవా? నేను చేయగలనా?

పిల్లలొస్తారు.. వంట చేయాలి
మరేదో చేయాలి.. అంటుంది నా భార్య
వాళ్లు వెళ్లి వచ్చే వరకూ
ఏదో చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు
నాకయితే ఆ ఆలోచనే రాలేదు
పిల్లలు ఎదుగుతున్నారు ఏదో ఒకటి చేయి
మనం ఉంటామో ఉండమో అంటుందోసారి
నిజమే మనం
పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి

ఎందుకంటే....
వాళ్లు బడికెళ్లి వచ్చేసరికి
మనం ఉంటామో ఉండమో...
- ఖాదర్‌షరీఫ్, చరవాణి : 9441938140