రాజమండ్రి

కవిత్వంపై నాగ్రాస్తం గాయపడ్డ గుండె భాష (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అక్షరాయుధులు కవులు - క్రాంతదరులు’

అన్నది వర్తమాన వాస్తవం. అందుకే తన

గాయపడ్డ గుండెభాషను అక్షరాల్లో

సంధిస్తున్న కవి శ్రీనాగాస్త్.్ర ఇక కవిత్వం

ఒక సమాజ చోదకశక్తిగా నిలబడటం,

గుర్తింపు పొందటం అంత సాధారణ విషయం

కాదు. దానికి జ్వలన జీవనం

అవసరపడుతుంది.
// నేను కవిని / ప్రజాగుండెల్లో అస్తమించని

సూర్యుడ్ని / ధరిత్రి నలుదిక్కులా

మింగుతున్న చైతన్య భేరిని // అక్షరమే నా

ఆయుధం / అక్షర మే నా కీర్తి ధ్వజం //

ఇది ఒక సందేశాత్మక ఆశయంగా

ప్రకటించుకున్నాడు. అలాగే ‘ఓ కవి

సార్వభౌమం’ శీర్షికలో కవుల్ని ఆత్మ

విమర్శన, ఆత్మాభిమానం, అస్తిత్వం

నిలుపుకోవాలన్న సందేశం ఉన్నది.

అవార్డులు, కుల గజ్జి, కీర్తికండూతులు,

పాలకుల పెంపుడు కుక్కల్లా బతకడం

కాదు. పోతన్నలా బతుకు అనడం ఔచిత్యం,

కవి కులంపై ఎక్కుపెట్టిన అస్తమ్రే కదా!
ఇలాంటి అస్త్ర-శస్త్రాలు నాగాస్త్ర మరిన్ని

అంశాలుగా కొన్ని శీర్షికల్లో తన అభివ్యక్తిని,

అలతి పదాలతో అక్షరీకరించారు. ‘రైతు’ను

జీవిత పుట్టిని, కాలం చేసే కరువు కనె

్నర్రల్నించి, పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో

దాచుకున్నాడంటారు. ఆరుగాలానే కాక //

కిసానంతే / మేడి వదలడు / వ్యవసాయం

మానడు/ పట్టువదలని విక్రమార్కుడు //

అంటున్నాడు. ఈక్రమంలోనే ముల్లుగర్ర చేత

బట్టిన, దళారీస్వామ్యం గిట్టుబాటు ధరలు

పొందలేనప్పటి దైన్యం, అప్పుల ఊబిలో

కూరుకున్నప్పటి హైన్యం తెలుపుతూ

‘దుక్కులు దున్నాల్సిందే’ శీర్షికని //

ఆరుగాలం పడ్డ కష్టానికి / పొలం బంగారు

కంకుల్ని ఈనింది/
... ధాన్యపు కంకుల్లోని ప్రతి గింజపైన

రైతున్న పేరే రాసి ఉంది// అన్నప్పుడు ఆ

కలలు సాకారం కావటం లేదన్నప్పుడు ... /

వడ్ల గింజలపై దళారీ పేరు మెరియడం /

చూసినప్పుడు... // లాభం లేదు / కలుగుల్లో

పొగ ఊదాల్సిందే / గిడ్డంగుల్లో బోన్లు

పెట్టాల్సిందే // అన్న ఆత్మ దమన శక్తిని

అక్షరాలా చైతన్యంగా తెల్పారు కవి.
‘చేరాగం’ శీర్షికల్లోంచి బిగించిన పిడికిలి వేళ్లా

ఐదింటికీ తను కల్పించిన అర్ధాన్ని

కవిత్వీకరించారు. బొటనవేలు - దొంగవోటు,

చూపుడువేలు-మేధోచిహ్నం, మధ్య వేలు -

కులం పుండు, స్వేచ్ఛావ్యాపారికి తాకట్టుగా

ఉంగరం వేలుని, చిటికెన వేలు మూఢభక్తిని

సూచిస్తే పిడికిలిని మాత్రం శ్రమజీవుల

సంకేతంగా, దోపిడీకి తిరుగుబాటుగా

అభివ్యక్తి వినూత్నంగా ఆలోచింపజేస్తుంది.
అలాగే వివాహ వ్యవస్థలోని ‘మూడు ముళ్లు’

‘తులసి’ ‘మా అమ్మ అమ్మ మమీ అయింది’

శీర్షికలు స్ర్తిత్వపు ఔన్నత్యాన్ని చాటేలా

హంద్యంగా ఆవిష్కరించారు కవి.

వర్తమానపు అద్దెగర్భాల గురించి వ్రాసిన

వాక్యాలు ప్రతీవారినీ కలచివేసేట్లుగా తమ్ము

తాము ప్రశ్నించుకునేలా

‘అమ్మతనం-అమ్మకపు సరుకుగా -

ప్రయోగశాలల్లో ఉరితీయ బడింది // అన్న

సంవేదన వర్తమానానికి అన్వయం చేయడం

గమనించవచ్చును. 54 కవితలు ఇలాగ

శీర్షికల్లోని ఎత్తుగడలన్నీ వైవిధ్యంగా

‘ముందు మంటలు’ ‘మరమ్మతులు’

‘జాతిరత్నాలు’ ‘ప్రశ్నలు అనేకం సమాధానం

ఒక్కటే’ నిత్య సత్యాల్ని-తన అధ్యయనంతో

జ్ఞానసాగరుడవడానికి తన కవితా జ్ఞానాన్ని

ఫలంగా అందించిన ప్రయత్న పథికుడు -

రాబోయే కాలం సంపుటాల్లో తన ముద్రను

బలంగా వేయాలని ఆకాంక్షిద్దాం.

అమ్మానాన్నలకి అంకితమివ్వడం

హర్షణీయం. నిబద్ధంగా పైకెత్తిన శంఖారావ

కవిత్వం ‘గాయపడ్డ గుండె భాష’.
ప్రతులకు:
శ్రీనాగాస్త్
కృష్ణాపురం, టి.నర్సాపురం
టి నర్సాపురం మండలం
ప.గో.జిల్లా - 534467
పేజీలు: 132,
వెల: రూ.100/-

- విఎస్‌ఆర్‌ఎస్ సోమయాజులు కాకినాడ, సెల్: 9441148158