విజయవాడ

‘గో’ విలాపం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలా! గోకులపాలా!
మా మొర వినవేలా!
పాపపుణ్యములెరుగని మూగజీవులం మేము
పవిత్రమైన చరిత కలిగిన వారము మేము
నీకత్యంత ప్రియమైన పశుజాతులం మేము
మా‘నవు’లు చేసే దుష్కృత్యాలు కనలేవా!
విధాత ఇచ్చిన గాలి, నీరు, గ్రాసము తింటూ
పరులకు ఏమాత్రము హానిచేయని
జంతువులం మేము
సాధుజీవులుగా బతికే మా కష్టాలు
తీర్చలేవా గోపాలా!
చనుబాలిద్దామని పూతన నిను లాలించబోగా
దాని దుర్మార్గం తెలుసుకుని
రొమ్మును చీల్చి ఊపిరులూదేశావే!
మా పాలు, పెరుగు, మీగడలు త్రావి
మా పసిపాపలను పొలం పనులకు వాడుకొని
వయసు తీరిన వెంటనే కబేళాలకు తరలించే
ఈ దుష్కర మనుజుల దుర్మార్గాలు కనలేవా! దేవా!
రాజసూయ యాగమున నిను నూరు దోషములు
ఎలుగెత్తి నిండు సభలో నినదించిన శిశుపాలుని
శిరమును నీ చక్రాయుధంతో
తరిగివేయలేదా మాధవా!
కుల మత వర్ణ భేదాలన్నవి తెలియనివారము
ప్రాంత, రాజకీయ కుళ్లు కుత్సితాలు
ఎరగని వారము
కాసింత ప్రేమతో గడ్డి, నీరు, ఆవాసమిస్తే
జీవితాంతం రుణపడి సేవలందిస్తామే
అలాంటి మమ్మల్ని గురిచేసే హింసలు
నీకు కనబడవా గోవిందా!
శకటాసురుడు, ధేనరుకాసురుడు,
బకాసురుడు వంటి
అసురులను సులువుగా తెగటార్చావే..
గోవులుగా పుట్టి, గోమాతలుగా పేరుపొంది
సాధుజీవులుగా పుట్టడం మా నేరం
ఇరుకు వాహనాలలో కుక్కి,
నీరు, ఆహారం పెట్టక
సలసల కాగే నీళ్లు మాపై పోసి
శీతల గిడ్డంగిలో నిల్వచేసి
పదునైన కరకు రంపాలతో మా చర్మాలు వలిచేసి
తలలు నరికి, కొమ్ములు తరిగేసి, కాళ్లు నరికి
దేహాన్ని ఖండఖండాలు చేసి విపణి వీధిలో అమ్మే
ఈ ‘నర’కాసురులు
నీకు కనబడలేదా గోపీలోలా!
నరకాసుర, కాలనేమి, శిశుపాల, జరాసంధుల వంటి దుర్మార్గులను వెంటాడి సంహరించావే దేవకీనందనా!
ముక్కలు చేసి, నూనెలలో వేయించి
మసాలాలు దట్టించి, శీతల డబ్బాల్లో కుక్కి
ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ
కాసుల సంపాదనే ధ్యేయంగా బతికే
ఈ మనుషుల లీలలు కనలేవా వాసుదేవా!
పాలకుల గుండెల్లో మాపై దయ కలిగించలేవా
చట్టాలు, న్యాయస్థానాల్లో
మాపై తీర్పులు రావా!
మనుషుల దుష్ట ప్రవృత్తికి అంతంలేదా?
మాకు భద్రత లేదా?
మూగజీవులమైన మమ్ము,
మా జాతి హత్యలను నిలపలేవా..
ఓ కన్నయ్యా! ఓ కరుణామూర్తి, ఓ కృష్ణమూర్తి
ఆపదమొక్కులవాడని, అనాథ రక్షకుడవని,
బాలలు, వృద్ధులు, మహిళలను గాచేవాడవని,
ఎన్నో ఎనె్నన్నో బిరుదులు కలిగిన నీవు
మాపై జాలి చూపలేవా?
మా జాతిని కాపాడలేవా..?
నందనందనా! నవనీత కిశోరా!
మా ‘విలాపం’ వినరావా!
మనుషులపై మా ఎడల
వాత్సల్యం కలిగించరావా.. దేవా!
- లక్కరాజు శ్రీనివాసరావు
చరవాణి : 9849166951

ఆవులకు ఆధార్ ప్రేమ!
అవును!
ఏదో ఒక రూపంలో
హింసను ప్రేమిస్తూ
ద్వేషాన్ని వెళ్లగక్కాల్సిందే
మనుషులకే సరిగ్గా బువ్వదొరక్క
అవకాశాలు లేక
ప్రభుత్వ పథకాలు అందక
నీరసం వచ్చిచచ్చి క్యూలైనులో కుప్పకూలి
వెలిముద్రలు పడకా
మిషన్లు పనిచేయకా
బ్యాంకులకు గ్యాస్, రేషన్ లింకుల్లేకా
స్కాలర్‌షిప్‌కు పేరు నమోదుకాక
ఒకటా, రెండా..
ఎన్ని.. ఎనె్నన్నని?
మనుషుల్నే హింసించి పీడించి
రాజ్యమేలే ప్రభుత్వాలు
ఇప్పుడు ఏకంగా
ఆవులకే ఆధార్ కార్డట!
ఇప్పుడు ఇక్కడ బతకాలంటే
ఆవులను పూజించాల్సిందే!
అందరూ ‘ఆవుబొమ్మ ఆధార్ కార్డ్’
మెడలో వేసుకోవాల్సిందే!?
- తంగిరాల సోని, నందిగామ.
చరవాణి : 9676609234