విశాఖపట్నం

నిర్లక్ష్యం ఖరీదు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడో లేదు నిర్లక్ష్యం
శునకాల దాడిలో
బలవుతున్న చిన్నారుల ప్రాణాల్లో
అధికారుల నిర్లక్ష్యంలో
మర్రి చెట్టు ఊడల్లా
ఎక్కడ చూసినా ఉంది
విద్యుత్ వైర్లు వేలాడతూనే ఉంటాయి
అందరూ ఆ వైర్లని చూస్తూనే ఉంటారు
కానీ ఎవరికీ పట్టదు
అక్కడే ఉంది అందరి నిర్లక్ష్యం
బాలల ప్రాణాలు బలిగొంటున్న
మురుగు కాలువల్లో
నోళ్లు తెరుచుకుని చూస్తున్నాయి
మేరా భారత్
స్వచ్ఛ్భారత్ అంటారు పెద్దలు
ఎక్కడుంది స్వచ్ఛ్భారత్
ముందు ప్రజల్లో మానవత్వం మేల్కొనాలి
ఎవరో వచ్చి ఏదో చేస్తారని భ్రమ వదలాలి
తిరగబడ్డ శునకాలను తరిమి తరిమి కొట్టాలి
వేలాడే విద్యుత్ తీగల సమాచారం
అధికారులకు అందించాలి
ఫుట్‌పాత్‌లపై పలకలు, రోడ్లపై
గోతులను చూసి ఊరుకోరాదు
సంబంధిత అధికారులకు తెలపాలి
ఎక్కడి సమస్యలను అక్కడే
పారదోలేందుకు ప్రయత్నించాలి
మనుషులంతా సంఘటితంగా
పోరాడితేనే మనుగడ సాధ్యం
ఈ సత్యం మనమంతా తెలుసుకోవాలి
అప్పుడే మనది స్వచ్ఛ్భారత్ అవుతుంది
నిర్లక్ష్యం మటుమాయం అవుతుంది
- వేగి నూకరాజు, గవరవీధి,
బుచ్చిరాజుపాలెం, విశాఖపట్నం-530027.
సెల్ : 7702141014.

అలంకారం
కొండల గుండెలపై పడుతున్న వాన
నిరుపేద నిబ్బరాన్ని నిలదీస్తున్నట్టుంది
మబ్బులతో ముసురు పట్టిన ఆకాశం
పెద్దదిక్కును కోల్పోయిన ఇల్లులా ఉంది
ఒడ్డును ఒరిసి పారుతున్న వాగు
కపట ప్రేమకు మోసపోయిన
కలకంఠి కన్నీటిలా ఉంది
పెనుగాలికి జడలు విప్పిన మర్రిచెట్టు
దిక్కు లేని వృద్ధురాలి గోడులా ఉంది
భారీ వర్షానికి తడిసి పాడైన తోట
విభేదాలతో కొట్టుకున్న వీధిలా ఉంది
మనోహరమైన పోలికకు
ఉపమానం ఒక అలంకారం
అందులో ఉంది జీవితం
జీవితమంటే మనోహరమే కాదు
మనసును మెలి పెట్టే బాధల సమాహారం

కూడా
అద్భుతమైన ప్రకృతికి ఆనందించడమే కాదు
సాటి వారి బాధలో సానుభూతి చూపేందుకు
ఉపమానం ఉపయోగం
నిండయిన మనసుకు అదే నిజమైన

అలంకారం
- శివలెంక ప్రసాదరావు,
ఆంజనేయ గుడి దగ్గర, రామాకాలనీ,
సాలూరు పోస్టు, విజయనగరం జిల్లా.
సెల్ : 9492 740147.

మెదడే ఓ కార్ఖానా
మానవ మెదడే ఓ కార్ఖానా
విద్యకి ఆలోచనలు
వ్యాపారానికి తెలివితేటలు
వృత్తికి మెళకువలు
సాహిత్యానికి ఊహలు
సంగీతానికి స్వరాలు
చిత్రలేఖనానికి నైపుణ్యం
నటనకు మెరుగులు
నాట్యానికి లయలు
న్యాయవాదులకి నేర్పరితనం
డాక్టర్లకి దైవత్వం
నేతలకి వాగ్దానాలు
యువతకి మేధస్సు
స్ర్తిలకి కళలు
రైతన్నకి శక్తియుక్తులు
ఉపాధ్యాయులకి ఓర్పు
- జిఎస్‌కె సాయిబాబా,
అనకాపల్లి. సెల్ : 92481 73116.