విశాఖపట్నం

ఆకాశదేవర నాటక సమీక్ష (నాటక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశదేవర కథా రచయిత నగ్నముని.

దిగంబర కవుల్లో నగ్నముని ఒకరు.

అభ్యుదయ సాహిత్యం బలహీనమైనప్పుడు

ఏర్పడిన స్తబ్దతను బద్ధలు కొడుతూ

వచ్చింది ఈ దిగంబర కవిత్వం. మామూలు

సాహిత్యంతో పాటు కొన్నికొన్ని రోత పుట్టించే

వర్ణనలతో రాసేవారు. అందుకే దిగంబర

కవులు అంటారని చెబుతారు.
రచయిత నగ్నముని రాసిన ఆకాశదేవర

కథలో కొంత ఔచిత్యముంద. కథ ఆసాంతం

చదివితే కొంత తాత్వికత వెల్లడవుతుంది

రచనాపరంగా.
ఈ కథను నాటకీకరణ చేయమని జి.

బలరాం (ఐఎఎస్ రిటైర్డ్) పాటిబండ్ల

ఆనందరావుని కోరారు. ఆనందరావు

అందరికీ తెలిసిన వ్యక్తి. నటునిగా, నాటక

రచయితగా, దర్శకునిగా, ప్రయోక్తగా

ఔత్సాహిక కళాకారులందరికీ పరిచయమే.

ఈయన ఏ నాటకాన్ని తీసుకుని రాసిన

నాటకం ఆద్యంతం తగినన్ని జాగ్రత్తలు

తీసుకుని కళాత్మక దృష్టితో ముందుకు

సాగుతారు. ఈయన దర్శకత్వం వహించిన

‘పడమటగాలి’ నాటకం విశాఖపట్నంలో

నాలుగు రోజులు వరుసగా

ప్రదర్శింపజేయడమే కాక రాష్టమ్రంతటా

ప్రదర్శించారు. ఎన్నో సద్విమర్శలు,

పొగడ్తలు అందుకున్నారు. బలరాం అడిగిన

వెంటనే తీసుకుని చాలా మార్పులు చేస్తూ

కొంచెం ఎక్కువ రోజులే పట్టినా ప్రదర్శనకు

వీలుగా రాశారు. ఈ నాటకంలో విభిన్న

సమస్యలేమీ లేవు. ఉన్నదంతా ఒక

నిజాన్ని అబద్ధం చేస్తూ, తర్వాత ఆ

అబద్ధానే్న ప్రచారం చేస్తూ బయటికి

రాకుండా తొక్కిపట్టి ప్రచారంతో అబద్ధాన్ని

నిజం చేయడం. మూఢ ప్రచారాన్ని

సునాయాశంగా ప్రజల్లోకి ఎక్కించవచ్చు

అన్నదే ఈ నాటక సారాంశం. అయితే ఈ

కథను నాటకంగా మలచడం అనుకున్నంత

సులువు కాదు. ఇతివృత్తం, పాత్రల శబ్దం,

వాళ్ల భాష, శైలి, శిల్పం ఇలాంటివి ప్రేక్షకుల

స్థాయిని మనసులో పెట్టుకుని రాయాలి.

అందరినీ అలరించే విధంగా రాయాలి. ఆ

నిపుణత ఆనందరావులో పుష్పలంగా ఉంది.

నాటకం కళాత్మక విలువలు పోకుండా

జాగ్రత్త పడాలి. తరువాత ఈ నాటకంలో

హాస్య సన్నివేశాలు గానీ, స్ర్తి పాత్రలు గానీ

లేవు. ప్రదర్శనపరంగా మంచి విలువలను

తెలియజేస్తూ ప్రేక్షకుల మనస్సులలో మంచి

ముద్ర వేశారు. నాటక రచనకు కావలసిన

ఇతివృత్తాన్ని ఎన్నుకోవడంలో, పాత్రలను

తీర్చిదిద్దడంలో, పాత్రోచిత సంభాషణలు

రాయడంలో, సన్నివేశాలు సమకూర్చడంలో

ఆయనకు ఆయనే సాటి. ఈ నాటకం ద్వారా

ప్రత్యేకతను సాధించారు.
ఇకపోతే దర్శకత్వం వహించిన జి. బాలరాం

నాటకంలో వర్తమాన విషయాలు, సమాజ

స్థితిగతులు, బలీయమైన పార్శ్యాన్ని కళ్ల

ముందుంచారు. ఈనాడు జరుగుతున్న

అసంభవాలను సంభవాలుగా నమ్ముతూ

గుడ్డిగా ఎలా పతనమవుతున్నారో కళ్లకు

కట్టినట్లు చూపించారు. ఈ నాటకం ద్వారా

ఆర్థికంగా ఏం సాధించారో కానీ, హార్ధిక

శుభాకాంక్షలందుకున్నారు ప్రేక్షకుల నుండి

నాటకం సాంఘికమైనా, పౌరాణికమైనా ప్రతి

సన్నివేశాన్ని ఒక సవాలుగా తీసుకుని

ప్రేక్షకుల్ని తన కంటే ఒక మెట్టు ఎక్కువగా

ఊహించుకుంటూ దర్శకత్వం వహించారు.

అదే దర్శకుని అసలైన లక్షణం. నాటకంలో

మూలాంశాన్ని సుందరంగా చూపించే

ప్రయత్నం చేశారు. అలాగే నాటకం

అయిపోయిన తర్వాత ప్రేక్షకులు ఇచ్చే

సూచనలు, సలహాలు పాటించగలిగే ఓర్పు,

నేర్పు దర్శకునికి ఉండాలి. ఇవన్నీ

పాటించారు కాబట్టే నాటకం అయిపోయే

వరకు ప్రేక్షకులు పిన్‌డ్రాప్ సైలెన్స్‌గా

చూశారు. అదే శిరోధార్యం. అదే నిజ దర్పణం

దర్శకునికి. నాటకం అంతా అయిపోయిన

తరువాత బలరాం ఒక మాట చెప్పారు.

నాటకం మధ్యలో ఒకచోట అగ్నిపూలు వర్షం

కురిపించే సీను ఒకటి ఉంది. కానీ దానికి

స్టేజీ అనుకూలంగా లేదు అని చెప్పారు. కానీ

దర్శకునికి తెలియలేదు ప్రేక్షకులే

కళాకాంతులు వెదజల్లి కురిపించారని. కొన్ని

నాటకాల్లో ప్రేక్షకులు మధ్యలో వెళ్లిపోతారు.

కానీ ఈ నాటకంలో కళాకారులను,

నాటకీయతను, సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిపి

ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెట్టింది.

ఇంకొక విషయం ఏమిటంటే ఇందులో

ఇతివృత్తం చాలా విచిత్రంగా చూపించారు.

వ్యక్తికీ, వ్యవస్థకీ మధ్య జరిగే సంఘర్షణ

అబద్ధాన్ని నిజం చేస్తూ ప్రచారం ఎంత

వికటాట్టహాసం చేసిందో తెలియజేసింది.

మానవీయ విలువల్ని కాలరాస్తూ

మనుష్యుల విలువల్ని నమ్మకాల్ని పణంగా

పెట్టి మనుష్యుల చుట్టూ మనుష్యులే

ఆడుకునే అంశాన్ని కళ్లకు కట్టినట్లు

చూపించారు. అదే దర్శకుని దార్శనికత.

నాటక రచయిత సైతం ఊహించని విధంగా

రక్తి కట్టించి దర్శకుడు కృతకృత్యులయ్యారు.

దటీజ్ బలరాం ఐఎఎస్. ఈ నాటకం ద్వారా

రచయిత కథలో అంతర్ధారాన్ని ప్రజలకి

తెలియజేశారు. అనన్య స్వామి పాత్రలో

బలరాం, షణ్ముఖానంద స్వామి పాత్రలో

రచితమూర్తి, కారేష్‌గా గోవాద వెంకట్, ఇంకా

ఇతర పాత్రలు, సాంకేతిక నిపుణులు, సురభి

కళాకారులు ఇలా ఎవరికి వారు తమకంటూ

ఒక గుర్తింపు ఉండేలా సామర్ధ్యం

చూపించారు. ఒక బుట్టలో ఉన్న విడివిడి

పూలుగా కాకుండా అందరూ కలసి ఒక

హారంలా నడిపించారు. ఉత్కంఠ కలిగించే

నడక, జ్ఞాపకం ఉంచుకోవలసిన

సంఘటనలు, పాత్రలు రసానందాన్ని

అందించాయి. ప్రేక్షకులు కూడా ఆనందిస్తూ

కథనపరంగా రచయిత అంతరార్ధం

తెలుసుకున్నారు. గోవాడ వెంకట్

విషయానికి వస్తే హావభావ సంభాషణలతో

ఆసాంతం రక్తి కట్టించారు. ఇది వరకు డాక్టర్

అంబేద్కర్ నాటకంలో అంబేద్కర్‌గా నటించి,

అంబేద్కర్ అంటే ఇలాగే ఉండేవారా

అన్నంతగా నటనలో జీవించి అంబేద్కర్‌ని

చూడని ఈ తరం వాళ్లందరికీ నిజంగా

ప్రత్యక్షమయ్యారు. ఈ ఆకాశదేవర

నాటకంలో కూడా అంతగానే రక్తి కట్టించారు.

ఇంత మంచి నాటకాన్ని విశాఖ రంగస్థలం

మీద రంగసాయి నాటక రంగం పేరిట

నిర్వహించి బాదంగీర్ సాయి ప్రేక్షకుల

మన్ననలు అందుకున్నారు. వారి తండ్రి

జ్ఞాపకార్థం చాలా నాటకాలు వేయిస్తుంటారు.

సురభి నాటకాలను కూడా విశాఖకు రుచి

చూపించింది కూడా బాదంగీర్‌సాయే.

ఆర్థికంగా సాయి సంపన్నులు కాకపోయినా

అహర్నిశలు శ్రమిస్తూ వేయి ఏనుగుల

బలాన్ని సమకూర్చుకుంటారు.

- శ్రీమతి కోవిల, విశాఖపట్నం. సెల్ : 98496 38486.