రివ్యూ

ప్యూర్ లవ్.. పూర్ ఫీల్!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * జబ్ హేరీ మెట్ సెజల్
తారాగణం: షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, మన్‌జోత్ సింగ్, అంజన్ శ్రీవాత్సవ్ తదితరులు
సంగీతం: హితేష్ సోనిక్
రచన, దర్శకత్వం: ఇంతియాజ్ అలీ

ఎవరితోనో నిశ్చితార్థం జరుగుతుంది?! మనసు -ప్రేమ ఇత్యాది మాటలకు అర్థం కూడా తెలీని అమాయకురాలైన అమ్మాయి రాబోయే మొగుడి గురించిన ఎటువంటి ఆలోచనలూ లేకుండా నిర్లిప్తంగా కాలాన్ని వెళ్లదీస్తూంటుంది. పెళ్లి కొద్ది రోజుల్లోకి వస్తుంది. ఈ శుభ ముహూర్తంలో ‘అతడు’ పరిచయమవుతాడు. అప్పటివరకూ ‘మనసు’ అంటే తెలీని అమ్మాయికి బోలెడన్ని అర్థాలు స్పృశిస్తాయి. జీవితం అంటే ఏమిటో తెలిసిపోతుంది. మనసులో ఏవేవో ఆలోచనలు చుట్టుముడతాయి. మనసు అతడి చుట్టూ పరిభ్రమిస్తుంది. అతణ్ణి ప్రేమించింత్తర్వాత తానేమిటో తెలుస్తుంది... క్రమేపీ అతడి మనసంతా తాను నిండిపోతుంది -ఇలాంటి కథలు మనకి కొత్తకాదు. ఎన్నో చూసేశాం. కానీ -అదే కానె్సప్ట్‌తో రిలీజైన ఈ సినిమా మరీ ‘మిడిల్ ఏజ్డ్’ కాకుండా.. కొద్దిగా యంగేజ్డ్‌తో తీసి ఉంటే కాస్తలో కాస్తయినా ప్రయోజనం చేకూరేది.
***
హరీందర్ ‘హేరీ’సింగ్ నెహ్రా (షారుఖ్ ఖాన్) ఓ టూరిస్ట్ గైడ్. కొద్దిగా అమ్మాయిల పిచ్చి. కానీ -సెంటిమెంట్లు... భావోద్రేకాలూ బోలెడన్ని. తరచూ పల్లె జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ ఉంటాడు.
ఓ గుజరాతీ కుటుంబాన్ని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి వస్తూండగా -ఆ ఫ్యామిలీకి చెందిన సెజల్ జవేరీ (అనుష్క శర్మ) మళ్లీ కారు బ్యాక్‌సీట్‌లో కనిపిస్తుంది. తన ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎక్కడో పడిపోయిందనీ.. ఏ విధంగానైనా దాన్ని వెతికి తెచ్చుకోవాలంటుంది. వెనక్కి తీసుకెళితే కోరినంత డబ్బిస్తానంటుంది. మొదట్లో ఒప్పుకోకపోయినా.. ఆఖరికి తీసుకెళ్లేందుకు ఒప్పుకుంటాడు హేరీ.
వారిద్దరి ప్రయాణం కొనసాగుతుంది. మాట మాట కలుస్తుంది. ఒకరి భావాల్ని మరొకరు అర్థం చేసుకుంటారు. ఒకరి మనసు ఒకరికి తెలుస్తుంది. మనసులో ఏ మూలనో దాగిన ప్రేమ ‘తెర’ మీదికి వస్తుంది. కానీ -సెజల్‌కి నిశ్చితార్థం అయిందన్న విషయం తెలిసిన హేరీ తన ప్రేమని మనసులోనే దాచుకొంటాడు. ఈ నేపథ్యంలో ‘ఎంగేజ్‌మెంట్ రింగ్’ ‘గ్యాస్’ దగ్గర ఉందన్న విషయం తెలుస్తుంది. గ్యాస్ ముఠా హేరీని కొడతారు. ఈ పరిస్థితుల్నుంచి బయటపడినప్పటికీ హేరీకి తీవ్ర గాయాలవుతాయి. గాయాలకు కట్టుకట్టేందుకు తన బ్యాగ్ ఓపెన్ చేసిన సెజల్‌కి ఎంగేజ్‌మెంట్ రింగ్ బ్యాగ్‌లోనే కనిపిస్తుంది. ఐతే -ఆ సంగతి హేరీ దగ్గర దాచిపెడుతుంది. అతడి మనసేమిటో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తుంది. ఆ తర్వాతి రోజు ఫ్రాంక్‌ఫోర్ట్‌లోని హేరీ ఫ్రెండ్ మాయంక్ పెళ్లికి ఇద్దరూ హాజరవుతారు. సెజల్‌ని హేరీ ప్రేమిస్తున్నాడని మాయంక్ తెలుసుకొంటాడు. ఈ ట్విస్ట్‌ల మధ్య సెజల్‌కి కోపం వచ్చి.. హేరీ నుంచి దూరంగా వెళ్లిపోయి నిశ్చితార్థపు పెళ్లికొడుకునే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొంటుంది.
అనేకానేక మలుపుల తర్వాత హేరీ -సెజల్ ఒకటవుతారు.
‘జబ్ వి మెట్’ ‘కాక్‌టెయిల్’ ‘తమాషా’ లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుడు ఇంతియాజ్ ఖాన్.. ఈ కానె్సప్ట్ కోసం శాయశక్తులా కృషి చేశాడు. కానీ.. ఎందుకో -్ఫఫ్టీ+ హీరో.. మూతి వంకర హీరోయిన్‌ని ఈ కథలో చూళ్లేక పోతాం. లవ్‌స్టోరీలో కొత్తదనాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు వీళ్లిద్దరూ కంట్లోని నలుసుల్లా మెరమెర పెడుతూంటారు. ఎంతటి భావోద్వేగ సన్నివేశాలైనా... ఆ ‘్ఫల్’ని తెచ్చుకోటానికి ప్రయత్నించినా వల్ల కాలేదు.
నటనాపరంగా - ఎవరినీ ఎంపిక చేయటానికి లేదు. నెదర్లాండ్స్ నుంచీ నూర్ మహల్ ట్రావెలాగ్ కథ బాగున్నప్పటికీ.. మింగుడు పడదు.

-బిఎనే్క