రివ్యూ

హిట్టు పట్టలేకపోయాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు ** దర్శకుడు

తారాగణం: అశోక్, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, జెమిని సురేష్, సుదర్శన్, నోయిల్, ప్రదీప్, సరస్వతి.
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాతలు: బిఎన్‌ఎస్‌సిపి విజయకుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి
కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం:హరిప్రసాద్ జక్కా.
‘దర్శకుడంటేనే ఇరవై శాతం క్రియేటివిటీ, ఎనభై శాతం మేనేజ్‌మెంట్’ అన్న భావనతో అల్లుకున్న కథ ఇది. సినిమాయే ఊపిరిగా, శ్వాసగా ఉన్న యువకుడు మహేష్ (అశోక్) ఓ నిర్మాతకు కథ చెప్తే అంతా బాగానే వుంది కానీ లవ్ ట్రాక్ మిస్సయ్యిందంటాడు. ఆ లవ్ ట్రాక్ తన కథలో మేనేజ్ చేయడానికి దర్శకుడు అవ్వాలనుకున్న మహేష్ తన ఊరికెళ్ళడం, అక్కడ నమత్ర (ఈషా రెబ్బా) పరిచయం కావడం, ఆమెను అనుసరించడం జరుగుతుంది. తర్వాత ప్రక్రియలో లభించిన అనుభవాన్ని తన సినిమాలో పెడ్తాడు. తొలుత అతన్ని కాదనుకున్నా అనంతరం నిజంగానే ప్రేమలో పడ్డ నమ్రత పరిస్థితులకు విసిగి అదృశ్యమైపోయిన మహేష్‌ని తిరిగి రప్పించడం ద్వారా కథ సుఖాంతమవుతుంది. వాస్తవానికి ‘దర్శకుడు’ కానె్సప్టు ఒక వ్యక్తికి అతను చేసే పనిమీద అచంచల అంకితభావముంటే అందివచ్చే ఏ అవకాశాన్నైనా తన లక్ష్యసిద్ధికే వినియోగిస్తాడని. అయితే ఈమధ్యలో తారసపడే వ్యక్తిగత బంధాలు, ప్రేమలు వగైరాల్ని లెక్కపెట్టడని. కానీ సినిమా ఆవిష్కరణలో ఇది స్పష్టంగా ‘దర్శకుడు’ చూపలేకపోయాడు. నమ్రతను కేర్‌గా చూసుకునే విధానంలోనూ ఇతర సంగతులలోనూ మహేష్ స్వచ్ఛమైన ప్రేమే కన్పడుతుంది. ఇంకోలా చూస్తే తన లక్ష్యంతోపాటు ప్రేమకీ ప్రాధాన్యత ఇస్తాడుగానీ, లక్ష్యం నెరవేరిన తర్వాత మాత్రమే అన్న భావనతోనూ ఉన్నాడనుకోవచ్చు. ఇలాంటి వగైరాల వల్ల సినిమా కాస్తంత గజిబిజి అయ్యంది. వాస్తవంగా సినిమా షూటింగ్‌లో కాస్ట్యూమ్స్ డిజైనర్ నిరంతరం సెట్‌లో ఉండాల్సిన పనిలేదు. కానీ కాస్ట్యూమ్ డిజైనర్ (నమ్రతే) షూటింగ్ జరిగినంతసేపూ ఉన్నట్లు చూపారు. ఐటెమ్ సాంగ్ పెట్టమంటే, సినిమా పాడైపోతుంది పెట్టనని మహేష్ అనడం బాగుంది. ఇక సినిమాపై ప్రేమ, చేసే పనిపై ఆరాధన ఉన్న మహేష్ పరిస్థితులకు లోబడి తొలి సినిమా తరువాత అదృశ్యమవడం ఎలా చూసినా అసంబద్ధమే. అయతే, ‘దర్శకుడంటే ఒక సినిమాతో ఆగిపోయేవాడు కాదు. మరో చిత్రానికి పయనించేవాడే దర్శకుడు’ అని నమ్రత పాత్రతో చెప్పించడం వరకూ ఓకే. ‘కలలు కనకుండా ఏమీ సాధించలేం, ప్రేమించకుండా ఏమీ ఆస్వాదించలేం’, ‘మనుషుల్ని వాడేసుకుంటాడు, మనసులతో ఆడేసుకుంటాడు’, ‘సినిమా అంటేనే దర్శకుడు, దర్శకుడు అంటేనే సినిమా..’ లాంటి డైలాగులు బావున్నాయ. అయితే కొన్నిటిని పెట్టాల్సిన చోట పెడితే మరింత బావుండేదేమో. ఉదాహరణకు ఓ సందర్భంలో నమత్ర, మహేష్‌నుద్దేశించి ‘ఫైట్‌మాస్టర్, ఫైట్స్ తీస్తాడు, డాన్స్‌మాస్టర్ డాన్సులు చేయిస్తాడు, ఇలా ఎవరికివారు అన్నీ చేసేస్తే దర్శకుడేం చేస్తాడు?’ అని అడుగుతుంది. అప్పుడు పైన పేర్కొన్న సంభాషణ (సినిమా అంటేనే..) అనిపిస్తే సరిగ్గా ఉండేది. ఇక నమత్ర తన అభిప్రాయాలు- అంటే తనకు మహేష్‌పై ఉన్న అభిప్రాయాన్ని వెళ్లబుచ్చడానికి పెట్టిన తాగుడు సన్నివేశం అనవసరం. అంతకుముందే అనేక సీన్స్‌లో తన భావాన్ని పరోక్షంగా చెప్పేసిన తరువాత సీన్ పెట్టడం సాగదీతే.
నటీనటుల అభినయ విశేషాలకొస్తే- ప్రముఖ దర్శకుడు సుకుమార్ చిత్ర ప్రచారంలో భాగంగా ఇందులోని కథానాయకుని పాత్ర అనుభవమున్న నటుడు నటించాల్సిందన్నారు. అది అక్షరాలా యధార్థం. ఎంతో భావ సంఘర్షణను పలికించాల్సిన పాత్ర మహేష్‌ది. దాన్ని కొత్త నటుడు అశోక్ పోషించడంవల్ల ఆ బెరకుతనం కొట్టొచ్చినట్లు కన్పడింది. ఈ అంశాన్ని అధిగమించేలా నమ్రత పాత్రధారిణి ఈషా రెబ్బా నటించారు. ఒకరకంగా చెప్పాలంటే సినిమా మొత్తం తన భుజస్కంధాలపై ఆమె మోశారని చెప్పాలి. ఒక సన్నివేశంలో అయితే హీరోను ‘‘అసలు నవ్వేమనుకుంటున్నావ్ ప్రేమంటే..’’ అన్న ధోరణిలో మాట్లాడుతూ కేవలం కనుబొమలు ఎగరేయడంతో బెదిరించిన సీన్ బాగా పండింది. చాలాకాలానికి ప్రదీప్ కథానాయిక తండ్రిగా ఇందులో కన్పడ్డాడు. అలాగే ప్రస్తుతమున్న దర్శకుల ట్రెండూ, ‘‘అక్కినేని నుంచి అల్లు అర్జున్ వరకూ’’ ప్రేమ కథల్లో నిరంతరం నడిచిపోతున్న రొటీన్ తరహానీ బాగా ఎత్తిచూపారు. స్వరాల్లో ‘ఆకాశం దించి మేఘాలలో సెట్ వేయనా’ పాట బాణీ కంటే ముందు విన్పించిన హమ్మింగ్ ఆకట్టుకుంది. పాటలోని మాటలు కాస్త ముతగ్గా (తొక్కలో స్క్రీన్‌ప్లే నా తాట తీసిందే) ఉన్నా పాత్ర అప్పటి మనఃస్థితిని ప్రతిబింబించింది. తాను చిత్రం విషయంలో ఏం కలగచేసుకోలేదని సుకుమార్ అన్నా, కొన్ని ఫ్రేముల కటింగ్‌లో వారి శైలి స్పష్టమయ్యింది. ఏ విషయం ఎలా వున్నా, కానె్సప్టులో చిత్ర దర్శకుడు అనుకున్న క్లారిటీని తెరపై చూపించడంలోనూ మెయిన్‌టైన్ చేసుంటే ‘దర్శకుడు’ తన ప్రభావాన్ని గాఢంగా ప్రేక్షకులపై చూపగలిగి ఉండేవాడు.

-అనే్వషి