మెయన్ ఫీచర్

‘వ్యాధి’ని పెంచుతున్న వాణిజ్య వైద్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రభుత్వ వైద్యశాలలు నిర్లక్ష్యానికి, క్రౌర్యానికి ‘నెలవు’లు! కాన్పు కోసం ‘దవాఖానా’కు వెళ్లే గర్భవతులు బయట పడిగాపులు పడి ఉండడం ఒక ఉదాహరణ మాత్రమే! ఇలాంటి గర్భవతులు వైద్యశాల ద్వారం వద్ద, సమీపంలోను ప్రసవించడం గురించి ఇప్పటికే ప్రచారమైంది. ఒక ‘వైద్య సహాయిక’ ఒకే ‘సిరంజి’తో-దాన్ని కడగకుండానే-అనేకమంది రోగులకు సూదిమందును ఎక్కించేసినట్టు ప్రచారమైంది! ఇంకా ఇంకా బోలెడన్ని ఉదాహరణలున్నాయి! మంచి వైద్యులు, మానవీయ భావ స్వభావులైన వైద్యులు ఉన్నారు. వీరి సంఖ్య తక్కువ. నిర్లక్ష్యంగా, కర్కశంగా ప్రవర్తించే ప్రభుత్వ వైద్యుల సంఖ్య ఎక్కువ. కానీ వ్యాధిగ్రస్తుల, వారి బంధువుల ఆగ్రహానికి అనేక సందర్భాల్లో మానవీయ వైద్యులు గురి అవుతున్నారట! కానీ సమాజంలో మొత్తం వైద్య సమూహం పట్ల వ్యతిరేక భావం విస్తరిస్తుండడం నడుస్తున్న చరిత్ర! ఇటీవల హైదరాబాద్ ఉస్మానియా వైద్యశాలలో ఒక వైద్యునిపై కొంతమంది దౌర్జన్యకారులు దాడి చేసి ఒక చెయ్యి విరిచారట! ఇలా ప్రాణదాతలైన వైద్యులపై దాడి జరగడం మిక్కిలి గర్హనీయం. నేరస్థులను కఠినంగా శిక్షించాలన్నది శాసనబద్ధులైన పౌరుల ఆకాంక్ష! కానీ, జనం ఏమనుకుంటారన్న వాస్తవాలను ఎ వ్వరూ నియంత్రించలేరు. ‘లోకానికి మూగటి మూయలేరు’, ‘జనం నోటికి తాళం వేయలేరు’ అన్నవి సామెతలు మాత్రమే కాదు, వాస్తవాలు! నోటికి తాళాలు లేని జనం బస్సులలో, రైళ్లలో, ఆటోలలో, విమానాలలో ఇటువంటి దాడులను గురించి చర్చిస్తునే ఉన్నారు. ‘ఒక చెయ్యి కాదు, రెండింటినీ విరిచేసి ఉండాలి..’ అన్న వ్యాఖ్య ఓ బస్సులో వినబడిందట! ఇలాంటి వ్యాఖ్య చేసిన వారిని పట్టుకుని శిక్షించాలి!
కానీ, వైద్యుల గురించి జనం ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటి?
సర్కారీ దవాఖానాలు నిర్లక్ష్యపు నిలయాలు, ప్రభుత్వేతర ఘరానా వాణిజ్య వైద్యశాలలు-కార్పొరేట్ హాస్పిటల్స్-దోపిడీ ప్రాంగణాలు! ‘కార్పొరేట్’ వైద్యశాలలు దోచుకుంటున్న తీరుకు వందలాది ఉదాహరణలు నిరంతరం ప్రచారమవుతున్నాయి! ‘మోకాలి చిప్ప’- నీ కాప్-లను అమ్మి అక్రమంగా వందలకోట్ల రూపాయలను దోచుకుంటున్న ‘కార్పొరేట్’ వైద్యశాలల గురించి ఇప్పుడు ప్రచారవౌతోంది! మోకాలి చిప్పలలో నొప్పి ఏర్పడినవారు యోగాసనాలు వేసి ప్రాణాయామం చేసినట్టయితే మోకాళ్లు యధావిధిగా నడవడానికి ఉపకరించగలవు. దమ్మిడీ ఖర్చు లేదు! లేదా తక్కువ ఖర్చుతో ‘్ఫజియో’్థరపీ-శారీరక వ్యాయామ వైద్యం-ద్వారా స్వస్థత పొందవచ్చు! కానీ కార్పొరేట్ వైద్యశాలలు విస్తరించిన తరువాత సహజమైన మోకాలి చిప్పలను ఊడగొట్టి కృత్రిమమైన ‘చిప్పల’ను అమర్చడం మొదలైంది! దీనికి లక్షలాది రూపాయలను రోగగ్రస్తుల నుంచి వైద్యశాలల వారు వసూలు చేస్తున్నారు. ఈ కృత్రిమమైన మోకాలి చిప్పలను విదేశాల నుంచి తెప్పిస్తున్నారట! ఒక్కో ‘చిప్ప’ను కొన్ని వైద్యశాలల వారు ముప్పయి వేల రూపాయలకు కొని లక్ష డెబ్బయి వేల రూపాయలకు మోకాళ్ల బాధితులకు అమ్ముతున్నారట! ‘వైద్యం అంటే వ్యాపార బీభత్సం..’ అన్నది ‘ప్రపంచీకరణ’ మప్పుతున్న వౌలిక పాఠం. హృదయ కోశ చికిత్స కోసం వాడే ఔషధ పరికరాల-స్టెంట్స్-ను కూడ ‘కార్పొరేట్ వైద్యశాలల’ వారు భయంకరమైన ధరలకు దశాబ్దుల తరబడి అమ్మినట్టు ధ్రువపడడం ‘ప్రపంచీకరణ’ మాయాజాలంలో మరో వంచన అధ్యాయం..
భారతీయులకు వైద్యం అనాదిగా జీవన విధానంలో భాగం! పాశ్చాత్యుల వైద్యం మానవ జీవితానికి సమాంతరంగా కొనసాగుతున్న అదనపుప్రక్రియ. జీవన పద్ధతి క్రమబద్ధమైన మానవీయ పథంలో సాగుతున్నట్టయితే అదనపు ఔషధాలు అవసరం లేదన్నది యుగయుగాలు సాగిన భారతీయ సంస్కారం! విదేశీయులు మన నెత్తికెక్కిన ఉండిన సమయంలో మన జీవన పద్ధతి వికృతమైంది. నిజానికి బ్రిటన్ వంటి పాశ్చాత్యులు వికృతపరిచిపోయారు! సూర్యోదయంలో మానవ జీవన ప్రక్రియ మాత్రమే కాదు, సకల జీవ జాల క్రియశీలత ఆరంభం కావడం ఈ సహజమైన, సృష్టిగతమైన వ్యవస్థ!ఈ వ్యవస్థను పాశ్చాత్యులు భగ్నం చేశారు! సూర్యుడు ఉదయించడం కంటే ముందు నిద్రలేవడమన్న జీవన సంప్రదాయం ఇప్పుడు మూలపడింది. ఫలితంగా భారతీయులు రోగగ్రస్తులు కావడం మొదలైంది! ఇలా రోగాలను విస్తరింప చేసిన పాశ్చాత్య జీవన పద్ధతి అనవసరమైన మందులతో, అవసరం లేని శస్తచ్రికిత్సలతో మన శరీరాలను మరింత పాడు చేస్తోంది! క్రీస్తునకు పూర్వం దశాబ్దుల క్రితం జీవించిన చరకుడు, సుశ్రుతుడు వంటి వారు శస్తచ్రికిత్సల అవసరం లేకుండా రోగాలను నయం చేశారు, అవసరమైనప్పుడు శస్త్ర చికిత్సలను కూడ చేశారు! ఆ ‘చరకుడు’ పతంజలి మహర్షి! వైద్యంతో శారీరక రోగాలను నిరోధించిన, నిర్మూలించిన పతంజలి మహర్షి ‘యోగం’తో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి మానసిక రుగ్మతలను దూరం చేశాడు. మానసిక ఆరోగ్యానికి శాశ్వత వ్యవస్థ యోగం! ‘యోగం’, ‘వైద్యం’ వాణిజ్యగ్రస్తం కాకపోవడం భారతీయ జీవన పద్ధతి! పాతికేళ్ల క్రితం మొదలైన ప్రపంచీకరణ భారతీయ జీవన పద్ధతుల అవశేషాలను కూడ చెరపివేస్తోంది! ఘరానా వాణిజ్య వైద్యం-కార్పొరేట్ మెడిసిన్-మన జీవ నాడులను కర్కశంగా నమిలి మింగుతోంది!
‘యోగం’తో, ‘వైద్యం’తో మానవాళి బౌద్ధిక భౌతిక స్వస్థతను వ్యవస్థీకరించిన పతంజలి- మన ‘వాక్కు’ను మన ‘మాట’ను మన ‘్భష’ను కూడ ఆరోగ్యవంతం చేశాడు! పాణిని రచించిన ‘వ్యాకరణాని’కి పతంజలి ‘మహాభాష్యం’ రచించాడు. భావ వ్యక్తీకరణకు భాష మాధ్యమం! ‘అక్షరాలు అజరామర భావానికి రూపాలు’. ఇలా మనస్సును, వచస్సును, కర్మను సమీకృతం చేసిన పతంజలిని అందువల్లనే భారతీయులు నిరంతరం ఇలా స్మరిస్తున్నారు.
‘యోగేన చిత్తస్య పదేన వాచాం
మలం శరీరస్యచ వైద్య కేన
యో పాకరోత్ తంప్త్రవరం మునీనాం
పతంజలిం ప్రాంజలి రాణతోస్మి’
ఇలా సమీకృతమైన సమగ్రమైన భారతీయ వైద్యం క్రీస్తునకు పూర్వం పనె్నండవ శతాబ్ది నాటి పతంజలితో మొదలు కాలేదు, అనాదిగా మన జీవన పద్ధతిగా మారి ఉంది! అశ్వనీ దేవతలన్న జంట వైద్యులు అందువల్లనే భారతీయ జీవన ఉచ్ఛ్వాస నిస్వాసాలు.. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దంలో జీవించి ఉండిన ‘్ధన్వంతరి’ అన్న వైద్యుడు మొదటి ‘్ధన్వంతరి’ కాదు. అనాదిగా ఉన్న ‘్ధన్వంతరి’ పరంపరలోని వాడు. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి ‘్ధన్వంతరి’ భారత సమ్రాట్ ‘ప్రమర’ వంశపు విక్రముని ఆస్థానంలోని ‘నవరత్నాల’లో ఒకడు, మహాకవి కాళిదాసుకు, జ్యౌతిష విజ్ఞాన ధురీణుడైన వరాహ మిహిరునికి సమకాలీనుడు..! సూర్యోదయానికంటే ముందు లేచి ‘వెలుగుల దొర’కు స్వాగతం పలకడంతో భారతీయుని దినచర్యకు ప్రారంభం! ముందుకు వెనుకకు పక్కకు వంగడం శరీరాన్ని పైకి సాగదీయడం సూర్య నమస్కారం! ఈ సూర్య నమస్కారం నిరంతర వైద్య చికిత్స! కడుపుకొవ్వుతో నిండి కుండలాగ, రుబ్బురోలు లాగ, గుమ్మడిపండు లాగ, వంట ఇంధనం ‘బండ’ సిలండర్-లాగ మారకుండా నిరోధించే చికత్స సూర్య నమస్కారం! ‘సూర్యుడు జగత్తునకు ఆత్మ’-సూర్య ఆత్మా జగతః- అన్న వేద వాక్యం ఆయుర్వేద వైద్యానికి ప్రాతిపదిక! వెలుగును ప్రేమించేవారు, వెలుగు జీవన సర్వస్వమన్న సత్యాన్ని గుర్తించినవారు, వెలుగును పెంచినవారు, వెలుగును పంచినవారు ‘బ్రహ్మ’ ముహుర్తంలో లేదా ‘బ్రాహ్మీ’ ముహుర్తంలో నిద్రలేవడం భారతీయత, అనాది హైందవ జాతీయత! ‘బ్రహ్మ’ ముహూర్తం చీకటికి చరమాంకమైన వేకువ.. తెల్లవారుజాము! అప్పుడు నిద్రలేచి ‘వెలుగుల దొర’ రాక కోసం నిరీక్షించడం, నిరీక్షిస్తూ క్రియాశీలురు కావడం రోగ నిరోధక ఆయుర్వేదం.. ఈ వైద్యం వల్ల వంద రోగాలలో తొంబయి తొమ్మిది మన జోలికి రావు!
ఇది భారతదేశంలో అనాదిగా ఉన్న సహజ వైద్యం! ఉదయాన గోమూత్రం సేవించినట్టయితే నోరు బాగా తిరుగుతుంది, నాలుక బాగా మాట్లాడుతుంది, కడుపు పరిశుభ్రం అవుతుంది, శరీరం పరిపుష్టం అవుతుంది, బుద్ధి విశ్వహిత చింతకం అవుతుంది! గోమూత్రం లేదా ఆవు పంచితం కేవలం ఒక జంతువుమూత్రం కాదు. ప్రముఖ రచయిత చిట్టా దామోదర శాస్ర్తీ వివరించినట్టు గోమూత్రం ‘సురభి జలం, జవ సత్వాలను పెంచే జీవామృతం..’ ఆవు జంతురూపమైన వైద్య దేవత! దివ్యత్వం హేతుబద్ధమైన, తర్కబద్ధమైన శాస్ర్తియ వాస్తవమని ఇప్పుడు పాశ్చాత్యులు సైతం గుర్తించారు! గుర్తించిన వారికి ‘దివ్య కణాన్ని’-డివైస్ పార్టికల్, గాడ్ పార్టికల్-కనుగొన్నవారికి ‘నోబెల్’ బహుమతులను ఇచ్చారు! అది వేరే కథ! కానీ అనాదిగా ఈ దేశంలో ‘ఆయుర్వేద వైద్యం’ ఉంది! అందువల్ల అది ప్రధానమైన చికిత్సా విధానం! తరువాత వచ్చిన, పాశ్చాత్య దేశాల నుంచి వ్యాపించిన వైద్య విధానం ‘ప్రత్యామ్నాయ వైద్యం’-ఆల్టర్‌నేటివ్ మెడిసిన్- కావాలి! కానీ బ్రిటన్ రాజకీయ బీభత్సకారులు పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి పడిన ‘అల్లోపతి’ని ప్రధాన వైద్య విధానంగా వ్యవస్థీకరించిపోయారు! ఫలితంగా భారతీయమైన ఆయుర్వేదం ప్రత్యామ్నాయ వైద్యం స్థాయికి దిగజారింది. ఇప్పటికీ వైద్య రంగంలో బ్రిటన్ దురాక్రమణదారుల వారసత్వం కొనసాగుతుండడం భావదాస్య ప్రవృత్తికి మరో సాక్ష్యం మాత్రమే!
దమ్మిడీ శుల్కం తీసుకోకుండా భారతీయ సంప్రదాయ పద్ధతిలో వైద్య సేవలందిస్తున్న విశుద్ధ జీవనులు దేశమంతటా ఉన్నారు! వారు ప్రసిద్ధులు కాదు. అనంతపురం జిల్లాలోని ‘మడకసిర’కు సమీపంలో నల్ల అక్కమ్మపల్లె ఉంది. మోకాళ్ల నొప్పులను నివారించే నిర్మూలించే సంప్రదాయ చికిత్సకులు ఆ ఊళ్లో ఉన్నారు. వారు మందిస్తారు, పథ్యం చెబుతారు. డబ్బు పుచ్చుకోరు.. సుప్రసిద్ధ రచయిత మధురాంతకం రాజారాం క్రీస్తు శకం 1980వ దశకంలో ‘అర్హత’ అనే కథను వ్రాశాడు. చిత్తూరు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో వుండిన ‘సిద్ధముని’ ఈ కథలో నాయకుడు! సిద్ధముని ఆయన పూర్వులు మధుమేహం వ్యాధిని వన మూలికల మందుతో నయం చేసేవారు. సిద్ధముని సమయంలో ఈ మందు వెల రెండు రూపాయలు! అంటే మందు తయారుచేయడానికి అయ్యే ఖర్చును మించి సిద్ధముని వ్యాధిగ్రస్తుల వద్ద ఏమీ పుచ్చుకోడు! సిద్ధముని ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వ్యవసాయం కోసం అప్పు కావలసి వచ్చింది. పట్టణంలోని మిత్రుని వద్దకు వెళ్ల ఋణ సహాయం కోరాడు! అప్పు చేయవద్దని, ‘మధుమేహం’ మందు ధర పెంచితే వేల రూపాయలు ఆర్జించవచ్చునని సిద్ధమునికి మిత్రుడు సలహా చెప్పాడు. కానీ సిద్ధముని, ‘అయ్యో.. అదెలా సాధ్యం? పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ పుచ్చుకుంటే మందు పనిచేయదు.. గుర్వాజ్ఞ!’ అన్న సమాధానం చెప్పాడు! సిద్ధముని గ్రా మీణుడు, సగటు భారతీయుడు! మధురాంతకం వారు చెప్పినది వాస్తవ జీవన గాథ! ‘ప్రపంచీకరణ’ ఈ కథను దిగమింగుతోంది..

-హెబ్బార్ నాగేశ్వరరావు