Others

గురువు నేర్పిన జీవిత పాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కాలంలో అక్కడి విద్యార్థి సంఘం నాయకులు ఖానాజీని ఆహ్వానించారు. ఆ సమావేశానికి ఊరిలోని పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ హాజరయ్యారు. ఖానాజీ నాస్తిక వాది. ఆయన నాస్తిక సమాఖ్య కార్యాలయంలో సూర్యాపేటలో ఉంది. ఆయన నాస్తిక వాదం, అందుకు సంబంధించిన అంశాలపై ఉపన్యాసం ఇచ్చారు. విద్యార్థులు ఉత్సాహవంతంగా ఆయనపై ఎన్నో ప్రశ్నలను సంధించారు. అపుడు నా వయసు 25 ఏళ్లు. నేను కూడా కొన్ని ప్రశ్నలు అడిగాను. సమావేశం అనంతరం మా లెక్కల మాస్టారు తెలిదేవర వెంకట్రావు నన్ను స్ట్ఫా రూమ్‌కి పిలిచి మీటింగ్ వ్యవహారాలను అడిగాడు.
ఖానాజీ నా స్నేహితుడు కాబట్టి ఆయనను పొగుడుతూ, మీటింగ్ బాగా జరిగిందన్నాను. విద్యార్థులు ఉత్సాహవంతంగా అడిగిన ప్రశ్నల గూర్చి చెప్పాను. ‘ఇప్పుడు నువ్వేం పనిచేస్తున్నావ’ని తెలిదేవర నన్ను అడిగారు. నేను టీచర్‌గా పనిచేస్తున్నానని చెప్పాను. ‘రేపు నువ్వు క్లాస్‌కు పోవలసి ఉంది. నీ ఉత్సాహం చూస్తుంటే నీకు పాత సంఘం వాసనలు పోనట్లుంది..’ అన్నారు. అంటే ఏమిటి? అని అడిగాను. ‘నువ్వింకా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తననే అనుకుంటున్నావు. కానీ నువ్విప్పుడు ఒక టీచర్‌వన్న సంగతి మర్చిపోకు..’ అని తెలిదేవర అన్నారు.
అంటే ఏమిటి? అని మళ్లీ ప్రశ్నించాను. టీచర్‌కు ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉందని తెలిసినా, ఒక మత ప్రచారకుడని తెలిసినా, నిన్ను ఎంతమంది విద్యార్థులు ప్రేమిస్తారో దాన్ని మించి రెట్టింపుమంది విద్యార్థులు అసహ్యించుకుంటారు. రేపటి నుంచి నీ పాఠం కన్నా నీ రంగే ప్రధానమైపోతుంది. పిల్లలకు, టీచర్‌కు మధ్యన ఉండే బంధం సబ్జెక్టు మాత్రమే. కానీ వేరే విషయాలుంటే తరగతి గది పెడతోవన పడుతుంది. నీకు టీచర్‌గా రాణించాలని ఉందా? నాస్తిక ప్రచారకుడిని కావాలని ఉందా? అన్నాడు.
నాకు ఖానాజీతో పరిచయం కాబట్టి ప్రశ్నలడిగానని వివరించాను. ‘నువ్వు టీచర్‌గా ఉండాలంటే నీ రాజకీయ రంగు సబ్జెక్టుపైన మబ్బు కప్పుతుంది. కాబట్టి నువ్వెటుండాలో ? ఎట్లుండాలో? తేల్చుకోమని తెలిదేవర నాకు చివాట్లు పెట్టారు.
‘టీచర్‌కు ఒక ప్రత్యేకమైన మతంతో, సిద్ధాంతంతో కానీ సంబంధం ఉండవచ్చును. కానీ సబ్జెక్టులలో పిల్లలు ఉపాధ్యాయుణ్ణి ప్రేమిస్తారు కానీ- నీ గత చరిత్ర వల్ల ప్రేమించబడకూడదు. విద్యార్థుల జీవితంతో ఆడుకోకు. నువ్వెప్పుడైనా, ఎక్కడైనా నేను గణితం తప్ప వేరే అంశం చెప్పడం చూశావా?’ అని నన్ను మళ్లీ ప్రశ్నించారు. నువ్వు నన్ను గౌరవించేటట్లయితే క్లాస్ రూమ్‌లో ఇంకెప్పుడూ రాజకీయాలు మాట్లాడనని వాగ్దానం చెయ్’ అన్నారు. ఆనాటి నుండి ఇప్పటివరకూ ఏ తరగతి గదిలో కూడా నేను రాజకీయ పరమైన ప్రస్తావనలు ఎప్పుడూ తేలేదు.
... అది తెలిదేవర నుంచి నేను నేర్చుకున్న పాఠం.

-చుక్కా రామయ్య