17న పాటల వసూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పైసా వసూల్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ముహూర్తపు రోజునే విడుదల తేదీని ప్రకటించి దానికి తగ్గట్టుగానే నెల రోజుల ముందే విడుదల చేయడం ఒక్క పూరీకే చెల్లింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటలను ఈనెల 17న ఖమ్మంలో అభిమానుల సమక్షంలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుక రోజున బాలకృష్ణ, పూరి జగన్నాధ్, నిర్మాత ఆనంద్ ప్రసాద్‌లు హెలికాప్టర్‌లో ఖమ్మంకు చేరుకుంటారట. అదే రోజున మరో ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన స్టంపర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత ఆనంద్ ప్రసాద్ వివరాలు తెలియజేస్తూ- బాలకృష్ణతో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా వుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పైసా వసూల్ లాంటి మంచి చిత్రాన్ని నిర్మించాం. ఇప్పటికే విడుదలైన స్టంపర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నామన్నారు. శ్రీయ, ముస్కాన్, కైరాదత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.