ఆటాపోటీ

సూపర్ డాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా ఆటగాడు లిన్ డాన్‌ను సూపర్ డాన్ అని పిలుస్తారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో అతను ఐదు పర్యాయాలు సింగిల్స్ విభాగంలో స్వర్ణాలను సాధించాడు. పార్క్ జో బాంగ్, జావో యునె్లయ్ కూడా తమతమ కెరీర్‌లో ఐదేసి పతకాలను గెల్చుకున్నప్పటికీ, అవి సింగిల్స్ ఈవెంట్‌లో కాదు. పార్క్ పురుషుల డబుల్స్‌లో రెండు, మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడు పతకాలను సాధించగా, జావో మహిళల డబుల్స్‌లో రెండు, మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడు చొప్పున పతకాలు గెల్చుకుంది.
పార్క్ రికార్డు
ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో చైనా ఆధిపత్యాన్ని ఎవరూ కాదనలేరు. అయితే, ఎక్కువ పతకాలు గెల్చుకున్న ఆటగాడిగా దక్షిణాఫ్రికాకు చెందిన పార్క్ జూ-బాంగ్ రికార్డు సృష్టించాడు. డబుల్స్ విభాగంలో పోటీపడే అతను మొత్తం ఐదు పర్యాయాలు స్వర్ణాలు సాధించాడు.
మూన్ ది గ్రేట్
దక్షిణ కొరియా ఆటగాడు కింగ్ డాంగ్ మూన్‌ను బాడ్మింటన్ సూపర్ స్టార్‌గా అభివర్ణిస్తారు. అందుకు కారణం లేకపోలేదు. 1999 ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో అతను పురుషుల సింగిల్స్‌తోపాటు, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్స్‌లోనూ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు.