నెల్లూరు

పతాకం ప్రశ్నిస్తున్నది (మువ్వనె్నల మాలికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎగురుతున్న మువ్వనె్నల జెండా
ఎదురుతిరిగి ప్రశ్నిస్తున్నది
ఏడుపదులు పైబడిన నాకు
ఎప్పటికి లభిస్తుంది స్వేచ్ఛయని
ఎదురుప్రశ్న వేస్తున్నది
తెల్లదొరల నిరంకుశత్వాన్ని
తరిమి కొట్టిన ఐకమత్యం
తరచిచూసినా నేడు కానరాదేమని
తలకొట్టుకుని మరీ ప్రశ్నిస్తున్నది
హరితవర్ణాన్ని తనలో నింపి
హరితారణ్యాలను హరించి వేస్తూ
జనజీవనాన్ని అతలాకుతలం
చేస్తున్నారేమని
వేదన నిండిన హృదితో ప్రశ్నిస్తున్నది
కల్మషం లేని కాషాయాన్ని నాకు పూసి
కడుపు నిండా విషాన్ని మోసుకు తిరిగే
ఖలులు మనుషులుగా మారే రోజెపుడని
ఆర్తినిండిన మదితో ప్రశ్నిస్తున్నది
మల్లెపూల తెల్లదనాన్ని నాకిచ్చి
మరుభూమిగా దేశాన్ని మారుస్తూ
రక్తాన్ని చిందించే రాక్షసులుగా మారారేమని
రోదన చేస్తూ ప్రశ్నిస్తున్నది
మంచికి సంకేతాలైన మూడు వర్ణాలు
మసకబారి ఆనవాళ్లను కోల్పోయి
యాదృచ్ఛికంగా గాలిలో ఎగిరే
త్రివర్ణ పతాకానికి తలవంపులు తేకూడదు
యువతరం గుప్పిట్లో అవి
ఊపిరిపోసుకోవాలి
మసకలు తొలగిపోయి వెలుగులు చిందాలి
రంకు రాజకీయాల భ్రష్టత్వానికి దూరంగా
రవ్వలు చిందే కాంతులతో రవళించాలి
యువశక్తీ మేలుకో!
నీ బాధ్యతలేమిటో తెలుసుకో
దేశంలోని కుళ్లును కూకటివేళ్లతో పెకలించి
నవతరానికి నాంది గీతం పలుకు
నెలపొడుపు నీవై స్వేచ్ఛా పతాకానికి
ధగధగల కాంతులనందించు
నింగిని దాటే కీర్తికి సారధి నీవై
నీ జాతీయపతాకానికి అందించు..!
- శింగరాజు శ్రీనివాసరావు
చరవాణి : 9052048706

నమోస్తు..భరతమాతా..
జయజయ ప్రియభారతి
అందుకొనుమా మా వందన హారతి
అగణిత చరితయున్న దివ్యధాత్రి
అమేయ పరాక్రమ, త్యాగనిరతులున్న భారతి
ఆసేతు హిమాచలము నీ ఉనికి కాగ
అనేక మత, సంస్కృతులు నీ ఊపిరిలుకాగ
సింధు, హరప్పా, మొహంజదారో
నీ నాగరికతలుగ
గంగ, యమున, కృష్ణ, గోదావరి, పెన్నలు
నీ శిగపాయలుగ
మూడు సంద్రములు నీ జల సిరిసంపదలు

కాగ
వౌర్యులు, గుప్తులు, కుషాణులు నీ పాలకులుగ
చాణుక్యుడు, చరకుడు, నాగార్జునులు
ఆచార్యులు కాగ
వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు,
భట్టాచార్యులు శాస్తవ్రేత్తలుగ
ఖగోళ, వేదాంత, గణిత,
జ్యోతిష్య శాస్తమ్రులు పుట్టంగ
శంకర, రామానుజ, బుద్ధ, వివేకానంద,
పరమహంసలు గురుస్థానముగ
ధర్మభూమి, కర్మభూమిగ వెల్లంగ
అందుకొనుమా మా వందన హారతి
తెల్లవారలు కల్లకపటములతో
నీ స్వేచ్ఛహరించంగ
శాంతి సౌఖ్యములు నాశనము చేయంగ
భారతీయుల ఆత్మగౌరవమును అణగద్రొక్కంగ
జనగణమణ గీతం నీ స్తుతి గీతముగ
వందేమాతరము జన నినాదముగ
ప్రతి గుండెలో మోగంగ
గాంధీ, నెహ్రూ, పటేల్, నేతాజీలు దారిచూపంగ
చంద్రశేఖర, భగత్‌సింగ్, అల్లూరులు
త్యాగములు చేయంగ
దాస్య శృంఖలాలు ఆగస్టునెలలో తెగిపడంగ
స్వేచ్ఛాస్వాతంత్య్ర వాయువులు
భారతావనిలో నిండె
ఎందరో మరెందరో త్యాగఫలాలు
మన స్వేచ్ఛకే మూలబలాలుగ నిలబడంగ
జాతి సమైక్యతకు జవానులు విధులు
నిర్వర్తించగ
మువ్వనె్నల రెపరెపలు వినువీధిలో గర్వంగా

ఎగురుతుంది
ప్రధానులెందరో నీ అభివృద్ధికి
తోడ్పడుతూండగ
నీ ఘనతనేమని పొగడను భారతి
జయజయ ప్రియభారతి జనయిత్రి!
నీ కీర్తిబావుటాలు ఖండఖండముల ఎగురనీయ్
నమోస్తు భారతాంబ..నమోస్తు..
నీ చల్లని నీడలో దేశప్రజలంతా సేదతీరనీయ్
నీ కరుణాకటాక్షములతో జనులందరూ
వైరభావములు వీడి సమైక్యతగా నిలవనీయ్
ప్రతి హృదిలో విశ్వశాంతి భావనలు
మొలవనీయ్
దుష్టతలంపులు, దుర్మార్గపు చేష్టలు
దాపులకు రానీకుమా
ప్రజలందు సుఖశాంతులతో జీవించనీయ్
సద్బుద్ధిని ప్రసాదించు మాతా!
విశాలభావములు, సమతా ఆశయాలు

పెరగనీయ్
ప్రతిరంగమున జాగృతావస్థలు ప్రసాదించు తల్లీ..
సర్వేజనా.. సుఖినోభవంతు అని
దీవించు తల్లీ..!
- లక్కరాజు శ్రీనివాసరావు, 9849166951

ఎక్కడుంది స్వతంత్రం..? (కవిత)
ఎక్కడుంది స్వతంత్రం
మరెక్కడుంది స్వతంత్రం
నిన్న కట్టిన కట్టడాలు కుప్పకూలి పోతుంటే
కట్టిన కూలీలపై కమిటీలు వేస్తుంటే
కార్పొరేట్ చదువుకొరకు
కోట్లు కొల్లగొడుతుంటే
సర్కారు చదువులను చట్టుబండలు చేస్తుంటే
చేతలుడిగి ప్రభుత్వం చోద్యమే చూస్తుంటే
విశ్వవిద్యాలయాలకు కులగజ్జి అంటుకుంది
ర్యాగింగుల పేరుతో
రిషితేశ్వరులు కాలుతుంటే
కళ్లప్పగించి మనమేమో చూస్తుంటే
రాజకీయ నాయకులు రంగులే మార్చేసి
రణరంగాలను ఉసిగొల్పి
ప్రజాసేవ ముసుగులోన
ప్రజలను దోచేస్తుంటే
సూపర్ మార్కెట్లతో
చితికిన చిల్లర బతుకులు
అద్దాల సరుకులకు అందరూ ఆకర్షితులై
అట్టడుగు బతుకులు గుదిబండలవుతుంటే
పట్టపగలు యువతిపై యాసిడ్లే పోస్తుంటే
తప్పతాగిన భర్త బంధాన్ని తెంచేస్తే
బిడ్డలేమో గొడ్డులై కొమ్ములతో పొడుస్తుంటే
దిక్కులేని స్ర్తిమూర్తి దీనంగా చూస్తుంటే
సైకిలూ దొంగిలిస్తే
చట్టాలు తిరగేసి శిక్షలూ వేసేసి
లక్షలు భోంచేస్తే
లక్షణంగా వదిలేసి శిక్షలూ తప్పించి
అబ్బాయి ప్లస్సని
ఆప్యాయతలు కురిపించి
ఆడబిడ్డ పుడుతుందని ఆదిలోనే చంపేస్తే
మనకున్న రెండు కళ్లను
వేరువేరుగా చేసేస్తే
ఉన్నవారికి ఒక న్యాయం
లేనివాడికి మరో న్యాయం
నీతి మారుతోంది నిక్కచ్చిగ మనిషి మనిషికి
న్యాయానికి కళ్లుండీ
చూడలేని దౌర్భాగ్యం
ఎక్కడుంది స్వతంత్రం
మరెక్కడుంది స్వతంత్రం
- జడపల్లె మాధవాస్సుధ
నాయుడుపేట
చరవాణి : 9492935005