విజయవాడ

ఇంద్రధనస్సు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్తుతెచ్చుకో నేస్తం
ఆనాటి తెల్లరంగు జెండా
అహింసా మార్గమైంది
సత్యవాక్కై నిలచింది
తెల్లవారిని బెదిరించింది
మూడు రంగుల సోయగమై
పరాయి వారి కళ్లు చెదిరేలా
రాట్నం తిప్పింది
ముచ్చెమటల్లో ముంచెత్తింది
అశోకుని ధర్మచక్రం అద్దుకొని
శత్రువుల భరతం పట్టింది
గగనవీధిలో గర్వంగా
రెపరెపలాడింది
ఈనాటి రంగురంగుల జెండాలు
చూస్తున్నావా..? నేస్తం!
రాజ్యం ఏలాలంటుంది ఒకటి
పొంచి గోతులు తవ్వేదొకటి
స్వీయ రక్షణకొకటి
హక్కుల భక్షణకొకటి
కంఠహారమై నవ్వేదొకటి
గొంతు బిగించేదొకటి
విడివిడిగా చేస్తున్నాయి కదా
వింత వింత చేష్టలు!
విలువలొదిలేసి
వలువలొలుచుకుంటున్నాయి
కలిసికట్టుగా ఈ జెండాలు
మనలను కలిపేదెపుడు నేస్తం
ధవళకాంతితో మనసులన్నీ
మెరిసేదెపుడు నేస్తం!
- షేక్ బషీరున్నీసాబేగం,
గుంటూరు.
చరవాణి : 9985193970

‘స్వాంతంత్య్ర’ ‘కృష్ణ’ప్రభ!
స్వేచ్ఛగా అలనాడు చెఱసాలను జనింప
స్వేచ్ఛకై చెఱమెట్టి చెలగినారు
పరశిక్షణార్థమై పాంచజన్యమ్మూద
ఉద్యమశంఖమ్ము లొత్తినారు
పాలు-పెర్గును-వెన్న పదిమందికిని పంచ
స్వాతంత్య్ర ఫలమును పంచినారు
విజయసారథి చవెలయ- స్వేచ్ఛారథ
విజయసారథు లౌచు వెలిగినారు
శౌరియందును- స్వాతంత్య్ర సమరయోధు
లందు పోలిక పొడగట్టె నరసిచూడ
వాసుదేవాష్టమి- స్వతంత్ర పర్యదినము
చెలిమిగా వచ్చుటదియె విశిష్టమిపుడు
వందనంబులు
సాహితీ చందనములు!
- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287

ఏడు పదుల స్వతంత్రం
ఆ గుడిసె ముందు ఒంటరిగా ఆ పోరడు
అమ్మ కూలిపనికెళ్లింది
అయ్య సారా తాగి
మత్తులో తూలుతున్నాడు
పక్కింటి రాంబాబు
తల్లి దగ్గర పైసలు తీసుకొని
మధ్యాహ్నం మ్యాటినీకెళ్లాడు
ఆ గుడిసె ముందు ఒంటరిగా ఆ పోరడు
గాజుకళ్లతో శూన్యంలోకి చూస్తూ
ఊహలకే పరిమితమైన
అందమైన భవిష్యత్తులోకి తొంగిచూస్తూ
ఆ గుడిసె ముందు ఒంటరిగా ఆ పోరడు
అంచలంచెలుగా ఎదిగి
కష్టాల కడగండ్లను దాటి
ఉన్నతోద్యోగిగా స్థిరపడి
అమ్మకు పాదాభివందనం చేసిన
అద్భుతాన్ని ఆవిష్కరించిన దృశ్యం
పంచరంగుల చలనచిత్రంలా
కన్నుల ముందు సాక్షాత్కరించింది
కడుపులో ఆకలి కేకలు పెట్టింది
పగటి కల చెదిరిపోయింది
ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు
పరమార్థం గుర్తుకొచ్చింది
ఆదివారం కూడా బడిలో
మధ్యాహ్న భోజనం పెడితే
పగటి కలలు కనడం మానేసి
ఒంటరితనానికి తిలోదకాలిచ్చి
హాయిగా బతికేయొచ్చు!
పాపం.. పసివాడి అంతరంగంలో
అల్పమైన ఆలోచన తొంగిచూసింది
ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం
సిగ్గుతో తలదించుకున్నది!
అడుగో.. ఇంకా..
ఆ గుడిసె ముందు
ఒంటరిగా.. ఆ పోరడు!
- విడదల సాంబశివరావు, చిలకలూరిపేట.

చరవాణి : 9866400059

లక్షావధాని..
లక్ష్యావధాని!
నన్ను అవని చేర్చుటకై
యమునితో పోరాడిన వీరనారి
నా ఉదయంతో విచ్చుకున్న
లెక్కలేని రెకులు గల కమలం
నేను మురళి రూపు దాల్చుటకై
కత్తిపోట్లు తిన్న వెదురుబద్ద
వివేకం చుక్కానిగ
ఆవేశము తెరచాపగ
నా జీవన నౌక రూపశిల్పి
జీవన సూత్రాల లెక్కల
చిక్కుల బాటల్లో దిక్సూచి
వణికించే కష్టాల్లో
నా చలి కుంపటి
అనుభవాల అవసరాల్లో
నిండు విస్తరి
అమ్మ..
ఆ లక్షావధానికి
లక్ష్యావధానికి
నా కవితా హారతి!
- గుడిపూడి రాధికారాణి

అమ్మ చీరకొంగు!
పసిపాప పాలు తాగిన
చంటిబిడ్డ బువ్వ తిన్న
ఆ వెనువెంటనే
ఆ పెదవులను తాకుతూ
ఆ చిరునవ్వు మల్లెలకు
లాల పోయగా
వారి పూదేహాలను
ఆప్యాయతగా అద్దుతూ
వేసవి ఉక్కబోతలో
చల్లని పవనాన్ని
వెదజల్లే పరిమిళ పత్రంలా
విసురుతూ..
పసిమొగ్గులను
హాయిగా నిద్రపుచ్చాలని
వెచ్చటి స్పర్శను కల్పిస్తూ
అమృతపు అమ్మ ప్రేమను
అందించే తొలి సాధనం
అమ్మ చీరకొంగు!
- పెయ్యల శ్రీనివాసరావు,
చరవాణి : 8500104456