విజయవాడ

పిన్ని (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏడాదికోసారి ఈ తద్దినం అంటూ ఢిల్లీ నుంచి

గుంటూరుకు నన్ను పిలవటమేంటి? మన

కన్నతల్లి కూడా కాదు. నాన్న మేనల్లుడి చేత

ఆ కార్యక్రమం జరిపించవచ్చు కదా!’ విసుగ్గా

అన్నాడు రవి.
తమ్ముడి వంక ఆశ్చర్యంగా చూశాడు

రఘురాం.
‘అమ్మ చనిపోయేనాటికి నీకు ఏడు, నాకు

పదేళ్లు. నానమ్మ నాన్నకి మళ్లీ పెళ్లి

చేద్దామనుకుంటుంటే వచ్చిన అమ్మాయి

మనల్ని సరిగా చూసుకోదని, మనకోసం పనె

్నండేళ్లు పెద్దవాడైన నాన్నని రెండో పెళ్లి

చేసుకుంది పిన్ని. నాన్న జీతంతో మనకు పెద్ద

చదువులు చదివించటం కుదరదని, తనతో

కలిసి నేర్చుకున్న మరో నలుగురితో కలిసి సిటీ

సెంటర్‌లో టైలరింగ్ షాపు పెట్టింది. నాన్న

జీతానికంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించి,

ఆ మొత్తం మనకోసం జాగ్రత్త చేసి పెద్ద

చదువులు చదివించింది. ఇప్పుడు మనం ఇంత

మంచి పొజిషన్‌లో ఉన్నామంటే అదంతా పిన్ని

చలవే. మన అమ్మ బతికున్నా మనకింత

మంచి జీవితం లభించేది కాదు. మన హోదా

చూసే డా. రాజారాం గారు నీకు

వాళ్లమ్మాయినిచ్చారు. ఆయన అన్న

కూతుర్ని నాకిచ్చి చేశారు. పెళ్లిలో అందరూ

మనల్ని శ్రీదేవి గారి పిల్లలు అన్నారేగానీ,

శ్రీహరి గారి పిల్లలని అనలేదు. అందరి దగ్గరా

పిన్ని అంత మంచిపేరు తెచ్చుకుంది. అలాంటి

పిన్నికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?

ఏడాదికోసారి ఆబ్దీకం అంటూ పిన్నిని

తలచుకొని పదిమందికీ భోజనాలు పెట్టి,

వచ్చినవారంతా పిన్నిని పొగుడుతుంటే ఎంత

ఆనందం కలుగుతుందీ..! విశ్వాసం లేని మనిషి

శవాన్ని కుక్కలు కూడా వాసన చూడవట.

మన భవిష్యత్తు కోసం తన జీవితాన్ని

ధారపోసిన పిన్నికి నువ్వు’... ఆగిపోయాడు

రఘురాం.
‘నన్ను క్షమించన్నయ్యా..’ తప్పు ఒప్పుకొని

తలవంచుకున్నాడు రవి.

- నాగమల్లిక, గుంటూరు.