విజయవాడ

శ్రీవారి ప్రేమ పురాణం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామటుకు నా కోరికలు తీరిపోయాయి.

వాటికి అంతం లేదనుకోండి అది వేరే విషయం.

ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వాడిని. అదీ

సాధ్యమైంది. అన్నగారు ఒక్క కలం పోటుతో

కరణాల ఉద్యోగాలు పీకేసినా ఏదో సెలక్షన్

కమిటీ వారి దయ వల్ల మంచి ఉద్యోగమే

దొరికింది. కమ్యూనిస్టు నాయకుడు నారాయణ

గారిలా గాంధీ జయంతి రోజున మాంసం

దుకాణాలు బంద్ చేయాలనే రూలున్నా

విజయవాడ కార్పొరేషన్ వారి పుణ్యమాని

అందుబాటులో వున్న రోజుల్లో ఇడ్లీలో చికెన్

నంజుకుందామనుకున్న కోరికా తీరింది. ఆ

విషయంలో తరువాత మా అత్తగారి

అత్యుత్సాహం, జోక్యంతో నాకు, మా ఆవిడకు

పదిహేను రోజులు యుద్ధం జరిగింది. శాంతి

చర్చల అనంతరం జోయాలుక్కాస్‌లో 50వేల

రూపాయల బిల్లు చెల్లించి సంధి చేసుకున్నా.

ఇలాంటివే చాలా చిన్న కోరికలు. అసలు కోరిక

మాత్రం అలానే ఉండిపోయింది. ఎవరినైనా

ప్రేమించి పెళ్లాడాలని కాలేజీ రోజుల నుంచి

ప్రయత్నాలు చేసేవాడిని. చాలా ఏళ్లు ఏపీకి

ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించిన

చంద్రబాబు నాయు డు గారిలా కుస్తీ పట్టాను.

అయినా ఫలితం శూన్యం. అదే కోరిక

మిగిలిపోయింది. నామటుకు నేను బాగానే

ఉంటానంటారు మిత్రులు. ఆరోజుల్లో ఆర్

నారాయణమూర్తి సినిమాలు బాగా చూసేవాణ్ణి.

తమ ఆస్తులు తప్ప జనం ఆస్తులు జనానికి

పంచిపెట్టాలనుకునే కొందరు వీర

కమ్యూనిస్టుల సిద్ధాంతం వంటబట్టించుకున్న

వాణ్ణి. అదే ఊపులో కాలేజీలో కాలరెగరేసుకొని

తిరిగేవాణ్ణి. ఆడపిల్లలు నాతో చనువుగా

మాట్లాడేవారు. చాలామంది అందంగానే

ఉండేవారు. వారిలో ఒకరిని ఎంచుకొని

ప్రేమించి, పెళ్లి చేసుకుందామని అనుకున్నా.

దేవుడు నాకా అవకాశం లేకుండా చేశాడు.

నాతో పాటు మామయ్య కూతురు సుధారాణి

కూడా అదే కాలేజీలో చదివేది. ఇద్దరి గ్రూప్

ఒకటే. రూములు ఒకటే. నేను తేడాగా

చూస్తేచాలు పోస్ట్‌మాన్‌లా సాయంత్రం

వాళ్లమ్మకు, అదే మా అత్తయ్యకు చెప్పేది.

ఆవిడకు సమాధానం చెప్పటానికి నా తల

ప్రాణం తోకలోకి వచ్చేది. డిగ్రీ తరువాత పీజీ

కూడా పూర్తికావటంతో మంచి ఉద్యోగం, మామ

కూతురు సుధతో పెళ్లి చకచకా జరిగిపోయాయి.

నా కోరిక మా త్రం అలానే ఉండిపోయింది.

ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న నా కోరిక

మా ఆవిడకూ తెలుసు. మాటల్లో ఎప్పుడైనా ఆ

ప్రస్తావన తీసుకొస్తే ‘పెళ్లి అయ్యాక

ప్రేమించకూడదా?’ అనడిగేది. ఏదేమైనా నా

కోరిక అలానే ఉండిపోయింది. ప్రేమికుల్లా

పార్క్‌లకు వెళ్లటం, ఖాళీగా వుంటే థియేటర్లలో

సినిమాలు చూడటం, బీచ్‌లు తిరగటం

(బెజవాడలో బీచ్ లేకున్నా పుష్కరాలకు

తయారుచేసిన పుష్కర ఘాట్ల చుట్టూ

తిరుగుతూ సరిపెట్టుకోవటం) చేయాలని ఉం

డేది. నాకో ఆలోచన వచ్చింది. సాయం త్రం

బస్‌స్టాప్‌లో సుధ నిలబడేటట్లు, నేను కూడా

కాస్త దూరంలో నిలబడి ఏమాత్రం పరిచయం

లేనివాళ్లలా కొంటెచూపులు, కోరచూపులు

చూసుకోవాలని, వీలైతే కన్ను గీటాలని

అనుకున్నా. అదే మాట సుధతో చెప్పాను.

‘బాగుంది సంబడం. మన పరు వు బెజవాడ

బస్‌స్టాపు దాకా ఎక్కిస్తావేంటి బావా?’ అంటూ

తప్పించుకుంది. ‘ఐనా నీకిదేం బుద్ధి’ అంటూ

క్లాస్ పీకింది. రెండు మూడురోజులు సత్యాగ్రహం

చేశాను. పిలిచినా పలకకపోవటం, కాఫీ, టీలు

ఇచ్చినా తాగకపోవటం, భోజనం తిన్నా కోడి

కెలికినట్లు కెలకటం లాంటి పనులు చేస్తూ

మూడ్రోజులు కాలం గడిపేశాను. చివరికి ఓ

అంగీకారానికి వచ్చాం. బస్సు స్టాండ్‌లో నిలబడి

సైట్ కొట్టటం! ఇదీ మా ఒప్పందం. నేను ఆఫీస్

నుంచి వచ్చేటప్పుడు బస్ స్టాండ్‌లో

నిలబడ్డాను. సుధ కూడా అదే సమయానికి

వచ్చింది. సైట్ కొడుతూ, చేతులతో సైగలు

చేస్తున్నాను. సుధ ఏమీ తెలియనట్లు చిరాగ్గా

ముఖం పెట్టింది. చుట్టుపక్కల వాళ్లు

మమ్మల్నే, ముఖ్యంగా ననే్న

గమనిస్తున్నారు. కొందరు తిడుతున్నారు

‘వీడికి ఇదేం రోగం’ అంటూ. ఇంతలో షీ-టీమ్

వచ్చింది. టీజింగ్ అంటూ నన్ను జీపు

ఎక్కించింది. వాళ్ల నుంచి తప్పించుకు

రావటానికి పెద్దమొత్తమే ఖర్చుపెట్టాల్సి

వచ్చింది. ఇంటికి వచ్చేటప్పటికి గుమ్మంలో

సుధ నవ్వుతూ నుంచుంది. ఏడ్పుమొఖంతో

ఇంట్లోకి దూరాను. చాలాకాలం దాకా నాకు

తెలియలేదు, సుధనే పోలీసులకు ఫిర్యాదు

చేసిందని!

- వేలూరి సుధారాణి, విజయవాడ. చరవాణి : 9392101586