రాజమండ్రి

చింతలపాటి వారి ‘సూఫీ - ఖురాన్’ భక్తితత్వం (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిని ఎవరు పంచుతారు? మంచిని ఎందరు

పంచుతారు?.. అసలు మంచి అవసరమా?..

నిజమే. ఓ మంచి విషయాన్ని నలుగురికి

చెప్పాలని కంకణం కట్టుకున్న వారు

సి.బి.వి.ఆర్కే శర్మ. ఓ మంచి తోవలో

నడవటానికి ఉద్దేశించినవే మతాలు. మరి ఆ

మతాల చాటున విద్వేషాలు, వైషమ్యాలు

సృష్టించి మనుషుల ఐక్యతను, దేశం

సౌభ్రాతృత్వాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. మత

విద్వేషాలతో మారణ హోమం సృష్టిస్తున్నారు.

వైరి వర్గాలుగా మారి దాడులు, ప్రతిదాడులు,

ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిపోతోంది. ఇటువంటి

తరుణంలో ముస్లిం మతంలోని విశిష్టతను

చాటి చెప్పడానికి ‘సూఫీ - ఖురాన్’ అనే

పుస్తకాన్ని వెలువరించారు శర్మగారు.

దివాన్‌చెరువు శర్మగా ప్రసిద్ధి చెందిన

సిబివిఆర్కే శర్మ గారు మూడున్నర దశాబ్దాలు

విద్యారంగంలో కృషి చేసి రాష్టప్రతి

పురస్కారాన్ని పొందారు. ఎక్కువ కాలం

దివాన్‌చెరువు గ్రామంలో పనిచేయడం వల్ల ఆ

ఊరి పేరుతో పిలుచుకునే పలుకుబడి

అయ్యింది. పాఠాన్ని సుబోధపర్చడంతోపాటు

విద్యార్థి మనసుకు హత్తుకునేలా చెప్పడం

శర్మగారి ప్రత్యేకత. ఈ పుస్తకంలో ఉన్న

మూడు వ్యాసాలూ ఆయన ప్రసంగ పాఠాలే.

వేల సంవత్సరాల క్రితం భారతీయ తత్వాన్ని

ఆసరాగా తీసుకొని ఎన్నో దేశాలు

స్ఫూర్తినొందిన చారిత్రక విషయాలు అయితే

శర్మగారు ఉపనిషత్తుల్లోని వేదాలలోని

విషయాలను విడమరిచి చెప్పారు. ముఖ్యంగా

ఛందోబద్ధ కావ్యరచన చేసిన తొలి ముస్లిం కవి

ఉమర్ అలీషా సూఫీతత్వాన్ని

బయలుపరచారు శ్రీ శర్మ. ఉమర్ అలీషా

హిందూ ముస్లిం మతాల సంస్కృతి

సమ్మేళనంతో రూపొందించిన సూఫీతత్వాన్ని

ప్రచారం చేశారు. ఆధ్యాత్మిక ప్రబోధాలతోపాటు

ఉన్నత నైతిక విలువల్ని పరమత సహనాన్ని

నిత్య మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే

జ్ఞాన బోధనేగాక సత్ సమాజ నిర్మాణానికి

కూడా అవిరళ కృషి చేశారు. స్వాతంత్య్ర

ఉద్యమంలో పాల్గొని ప్రజలను ఉత్తేజితులను

చేసిన గొప్ప దార్శనికుడు. సత్యం మార్గంలో

పయనించటానికి ప్రేమ, భక్తి అని రెండు

చక్రాలను సాధనంగా చేసుకుంటూ అందుకునే

సత్యానే్వషణ ఫలమే సూఫీతత్వం. ఇస్లాం

సారాన్ని ముష్కిరత్వంగా మతానికి

అన్వయించి అపార్థం చేసుకుంటున్న

తరుణంలో ముస్లిం మతం

మహోహన్నతతత్వాన్ని మనందరికీ

పరిచయం చేయడానికి పూనుకొన్న శర్మగార్ని

ప్రతి భారతీయుడు తప్పక అభినందించాలి.

ఉమర్ అలీషా రచించిన సూఫీ వేదాంత

ధర్మంలోని పద్య వివరణలు వివరిస్తూ

మనసుకు హత్తుకునేలా రాశారు.
మనోనిగ్రహ సాధనకు హిందూ మతం యోగ

మార్గాన్ని నిర్దేశిస్తుంది. అలాగే ఇస్లాం మతం

కూడా జిక్ అనే ప్రత్యేక మార్గాన్ని నిర్దేశిస్తుంది.

జిక్ అంటే హృదయ మాలిన్యాన్ని పొగొట్టి

పరిశుభ్రం చేసే ప్రక్రియ అన్నమాట. ఉమర్

అలీషా సూఫీ రుషి. ఆయన యోగ పద్ధతులలో

నైపుణ్యాన్ని సాధించారు. యోగ మార్గం ద్వారా

అల్లాలో ఐక్యం కావడాన్ని ప్రబోధించారు.

ఇస్లాంలో జిక్ ప్రక్రియను భారతీయ పద్ధతులలో

సాధించారని శర్మగారు వివరిస్తున్నారు.

శర్మగారు పండితులు మాత్రమే కాదు,

సంస్కృత, తెలుగు, ఆంగ్ల, పారశీ, ఉర్దూ, అరబీ

భాషలు తెలిసిన వారు. ఆయన అధ్యయన

శీలత్వంతో అనేక విషయాలు తేటతెల్లం చేశారు.

పద్యమన్నా, శోకమన్నా ప్రాణమిస్తారు.

కనుకనే వాటి అర్థ వివరణలు ఇవ్వడంలో

ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఉమర్ అలీషాలోని

పాండిత్య ప్రకర్షణను వివరించడానికి

కరోపనిషత్తులోని శ్లోకాన్ని ఉదహరిస్తూ ఆయన

రాసిన చంపక మాల పద్యాన్ని విశదపరిచారు.

జీవాత్మ, పరమాత్మ, స్వరూపాల అణు

సామర్ధ్యాన్ని వివరించారు. బ్రహ్మతత్వ

స్వరూపాన్ని ఎలా ఆవిష్కరించారో చెప్తారు.

హిందూ మతంలోని యోగులు, ఇస్లాంలోని

సూఫీలు పోల్చి చూపటం చాలా గొప్పగా

జరిగిందంటారు శర్మగారు.
అయితే రుబాయిత్/రుబాయిల్ తెలుగు కవితా

ప్రక్రియల్లో ఒక భాగమైపోవడానికి కారణం

ఉమర్ ఖయ్యూం పారశీ దేశానికి చెందిన కవి.

వందల సంవత్సరాల క్రితం జన్మించిన స్వతంత్ర

భావాలు గల కవి, పండితుడు. అయితే ఆయన

పూర్తి పేరు ‘హకీం ఫియాసుద్ధీన్ అబుల్ ఫతహ్

ఇబ్నే ఇబ్రహీం ఆల్ ఖయ్యాం నైషాపురి’.

అయితే ఈయన కలం పేరు ఉమర్

ఖయ్యూంగా ప్రసిద్ధికెక్కారు. చాలా స్వేచ్ఛా

ప్రియుడు. జీవితాంతం బ్రహ్మచారిగా గడిపిన

వాడు. పారశీకు కవిత్వంలో మన తెలుగు

మాత్రాగణ ఛందోబద్ధంల ఓ నాలుగు పద్య

(కావ్య) భేదాలున్నాయి. ఈ రుబాయి కూడా

తేటగీతి వలె ఉంటుంది. మొదటి రెండు

పాదాల్లో ఉండి తర్వాత నాలుగు పాదాల్లోకి

మారింది. భావ వ్యక్తీకరణకు రెండు పాదాలు

చాలటం లేదని నాలుగు పాదాల్లోకి మారారు.
సూఫీతత్వానికి దగ్గరగా తన భావాలు

వొలికించిన వారు ఉమర్ ఖయ్యూం. స్వేచ్ఛా

ప్రయత్నంతో మధువు, ప్రియురాలు ప్రధాన

వస్తువుగా మార్మికత్వాన్ని ప్రజల ముందు

పెట్టి ఉదాత్త తత్వాన్ని వ్యక్తీకరించారంటారు

శర్మగారు. ఉమర్ రచనలు వచ్చిన అనేక

అనువాదాలను ఈ వ్యాసంలో చర్చించారు

రచయిత. ఉమర్ రాసిన రుబాయిలు అనేక

భాషల్లో అనువదింపబడి భక్తిరస ముక్తికి

సోపానమయ్యాయి. ముఖ్యం గా మన

తెలుగువాడు హరికథా పితామహుడుగా

కీర్తిల్లిన ఆదిభట్ల నారాయణదాసు గారు ఉమర్

ఖయ్యూం 120 రుబాయిల్ని సంస్కృత

శ్లోకాలుగా అనువాదం చేసిన మొదటి కవి.

అలాగే అచ్చు తెలుగులోనికి అనువాదం చేసిన

మొదటి కవి దువ్వూరి రామిరెడ్డి గారు. 1928లో

‘పానశాల’ పేరుతో ఉమర్ ఖయ్యూం

‘మధుకలశం’ పేరుతో ఈ రుబాయిల్ని

అనువదించారు. ఇక ఇంగ్లీషులోకి, ఉర్దూలోకి

బాలివుడ్ నటుడు అమితాబ్ బచ్చన్

తండ్రిగారైన హరివంశరాయ్ బచ్చన్ ‘మధు

కలశ్’ పేరుతో హిందీలోకి అనువదించారు.
ఇంతకీ చెప్పొచ్చేది మన తెలుగు కవితా

ప్రక్రియల్లోకి రుబాయిలు కూడా చేరి తెలుగు

హృదయాల్లోకి చేరడం వెనుక ఉమర్ ఖయ్యూం

ఒక కారణం. అయితే ఉమర్ ఆలీషా గారు

చేసిన ‘ఉమర్ ఖయ్యూం’ రుబాయితుల్ని

సమగ్ర పరిశీలనా దృష్టితో మనముందు

ఎరుకపరచిన విషయం ఈ వ్యాసంలో

కన్పిస్తుంది. కేవలం ఒక ఆధ్యాత్మిక దృష్టితో

మాత్రమేగాక కవిత్వపరంగా ఎంతటి

మార్పులకు, మూలాలకు గురై తెలుగు

సాహిత్యంలో కీలకమైన ప్రక్రియగా గుర్తింపు

పొందిందో మనకు అవగతమవుతుంది.

చివరగా పుస్తకంలోని మూడవ వ్యాసం

ఆదిభట్ల నారాయణదాసు గారు కేవలం మనకు

తెలిసిన హరికథకుడు. ఎంతటి కవి పండిత

విద్వాంసుడో తెలియజెప్పారు. శర్మగారు

పారశీకాన్ని అధ్యయనం చేసినా, ఉర్దూని

పఠించినా భాషకు, సాహిత్యానికి మతం

అడ్డుగోడ కారాదనే. ఇతర మత ధర్మాల్లోని

అంశాలు హిందూ మత ధర్మాల్లోని అంశాలు

ఎలా సారూప్యత కలిగి ఉన్నాయో చూపించారు.

ఏదిఏమైనా ఓ మంచి ప్రయత్నానికి మార్గం

సుగమం చేసిన శర్మగార్ని అభినందించాలి.
ప్రతులకు
సి.బి.వి.ఆర్కే శర్మ
16-3-7/7, ఎఫ్-1,
శ్రీ వెంకటసాయి అపార్ట్‌మెంటు,
పోస్ట్ఫాసు వద్ద, శ్రీరామ్‌నగర్,
రాజమహేంద్రవరం - 05
సెల్: 9849354754

- రవికాంత్, 9642489244