రాజమండ్రి

రచయిత (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌నాథ్ గారి కథ పత్రికలో రావడంతో

ఉబ్బితబ్బిపోయాడు. నూతన రచయిత

‘వీరంద్ర’.
‘అమ్మకి వందనం’ ఎంత బాగుంది ఈ కథ అని

వీరంద్ర సురేష్‌కి చెప్పాడు.
నిజంగా బాగుందా? అంటూ చదవడం

ప్రారంభించాడు సురేష్. విజయనాథ్ ఏ కథ

రాసినా అది సంచలనమే. ప్రతి కథల్లోను ఒక

జీవిత సత్యం తెలియపరుస్తారు.
ఈరోజు అమ్మ మీద రాశారు. అమ్మ ప్రేమ

ఏంటో తెలియపరిచారు.
సురేష్ చదివి నిజమే చాలా బాగుంది!
ఆ రచయితని ఎప్పుడైనా కలిశావా?
లేదు కలవాలి అతనిది ఈ జిల్లానే! ఏదో మంచి

ముహూర్తం చూసుకొని వెళ్లాలి.
ఆ రచయితని కలవాలంటే ముహూర్తం

చూసుకోవాలా? ఎందుకంటే ఆ

మహానుభావుడిని చూడటంలో విశేషం

ఉండాలి కదా!
అభిమాని అంటే నువ్వే రా అంటూ వీరంద్రని

మెచ్చుకొన్నాడు సురేష్.
ప్రతి వారం ఏదో పత్రికలో విజయ్‌నాథ్ కథ

రావడంతో ఇంకా కలవాల్సిందే అంటూ

నిర్ణయించుకొన్నాడు వీరంద్ర.
పూజారిని అడిగి మంచిరోజు తెలుసుకొన్నాడు!
సార్ నేను మీరు చెప్పిన అడ్రస్ దగ్గర

ఉన్నాను. అవునా ఇప్పుడు నువ్వున్న దగ్గర

నుండి రైట్ తీసుకొని తిన్నగా వచ్చేస్తే ఐదో

ఇల్లు అని చెప్పాడు రచయిత.
వీరంద్ర అతను చెప్పింది అనుసరించి ఇంటికి

చేరుకొన్నాడు. ఆ ఇంట్లో భారీ శునకం గట్టిగా

అరవడంతో రచయిత విజయ్‌నాథ్

బయటకొచ్చాడు. రావోయ్ వీరంద్ర అంటూ

ఆహ్వానించి ట్రామీ అరవడాన్ని ఆపివేశాడు.
సరాసరి విజయ్‌నాథ్ వీరంద్రని తన గదిలోకి

తీసుకెళ్లాడు. ఆ గది పుస్తకాల బందీఖానా.

చిన్న రచయితల నుండి పెద్ద రచయితలు

వ్రాసిన పుస్తకాలు అక్కడ ఉన్నాయి.
వీరంద్రకు విజయ్‌నాథ్‌తో ఏం మాట్లాడాలో

అర్థంకాలేదు. చూస్తే చాలు అనుకొనే

రచయితను ఇప్పుడు దగ్గర నుండి సరాసరి

అతని ఇంట్లో అతని ముందు ఏదో అలజడికి

లోనయినట్లుంది అతని పరిస్థితి.
కథలు గురించి చర్చిస్తున్న సమయంలో

విజయ్‌నాథ్ భార్య జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది.

ఏదో సైగ చేయడంతో ఇద్దరు కలసి అక్కడ

నుండి వెళ్లడం గమనించాడు వీరంద్ర.
‘మీ అమ్మగారు మళ్లీ మంచం మీదే మూత్ర

విసర్జన చేశారు. ఆవిడకి సేవ చేయడం నా వల్ల

కాదు ఏదోక్కటి చేయండి’.
‘అమ్మకి నేనొక్కడినే, కూతుర్లు లేరు. ఈ తల్లి

మరొకరిని కంటే ఏమయ్యింది. చేసుకోలేక

చస్తున్నాం. కాస్త ఓపిక తెచ్చుకొని బాత్రూంకి

వెళ్లొచ్చు కదా. నాన్న పోయినప్పుడే ఈమెను

కూడా తీసుకుపోవాల్సింది అని భార్యకి

చెపుతుంటే వీరంద్ర విన్నాడు. ఏదో కరెంట్ వైర్

తగిలినట్లుగా అన్పించింది.
కాసేపు తర్వాత విజయ్‌నాథ్ నవ్వుతూ

వచ్చాడు రూమ్‌లోకి ఆ నవ్వులో వీరంద్రకి

సర్పం కాటుకు బలైన సర్పం గుర్తొచ్చింది.

ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా

ఉండాలన్పించలేదు.
సార్ చిన్న పనుండి మిమ్మల్ని మరోసారి వచ్చి

కలుస్తా అంటూ అక్కడ నుండి బయటకు

రాగానే శునకం మళ్లీ గట్టిగా అరిచింది. అక్కడ

ఒక దృశ్యం చూసి మనిషిలో ఉండే మరోకోణం

తెలుసొచ్చింది.
రచయిత భార్య శునకం వెళ్లిన మూత్ర

విసర్జనను పారివేయడం, అక్కడ ఉన్న మట్టిని

కడగడం చూసి వీరంద్ర మనసు మనసులో

లేకుండాపోయింది.
రచయిత ఆలోచనలు పత్రికలకు పరిమితం.

నిజ జీవితంలో కాదు అని వీరంద్ర

తెలుసుకొన్నాడు.

- నల్లపాటి సురేంద్ర సెల్: 9490792553