విశాఖపట్నం

ఆమోదించాం (మినీకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒరే వీరయ్యా! అయ్యగారు సొమ్మసిల్లి పడిపోయారు. నీళ్లు పట్టుకురా’’ అంటూ మంగతాయారమ్మగారి గావుకేకలకు పాలు పితుకుతున్న వీరయ్య పాత్ర అక్కడే వదిలేసి పరుగులాంటి నడకతో వచ్చి అయ్యగారి ముఖాన నీళ్లు చిలకరించాడు.
‘‘ఒరే వీరిగా ఇంత పెందలాడ ఆ దిక్కుమాలిన టివిలో ఏ ముదనష్టపు వార్త విన్నారో గాని ఇలా కుప్పకూలిపోయారు. నా పసుపు కుంకాలు చల్లగుండ. ఆ ముక్కోటి దేవతలకు మొక్కుకుంటాను. పైడితల్లమ్మ, బంగారమ్మ, నూకాలమ్మ నా పెనిమిటిని సల్లగా సూడండి. మొక్కులు చెల్లించుకుంటా’’ అంటూ పదేపదే మంగళసూత్రం కళ్లకద్దుకుంటూ అపసోపాలు పడుతుంది. వీరిగాడికి ఏమీ అర్ధం కావడంలేదు ఆయనెందుకు పడిపోయాడో, ఈవిడెందుకు రాగాలు తీస్తుంది అసలేం జరిగింది? అంతా అయోమయంగా ఉంది. ఆకలేసినప్పుడు అమ్మ గుర్తుకొచ్చినట్టే ఆపదొచ్చినప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు కాబోలు అనుకున్నాడు.
ఏడుకొండలు మెల్లగా కళ్లు తెరిచాడు. ఎదురుగా మంగతాయారు కనిపించింది. ఆమె కళ్లలో కన్నీరు వరదలా నేలపై ప్రవహించి అతని చొక్కాని తడిపేస్తుంది. వీరిగాడు చేతులు కట్టుకుని బేలగా తన ముఖంలోకి కన్నార్పకుండా చూస్తున్నాడు. పరిస్థితి అర్ధమయింది. తానెందుకు కుప్పకూలిపోయాడో వారికి తెలిస్తే బాగుండదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి. సమస్యలొచ్చినప్పుడే తెలివిగా ప్రవర్తించాలి. ధైర్యం కోల్పోకూడదనుకుంటూ మెల్లగా పెదాలు కదిలించాడు.
‘‘ ఒరే వీరిగా ఉదయం టివి చూస్తుండగా మగతగా కనురెప్పలు వాలిపోయాయి. వేకువ జామున వచ్చిన కల నిజమవుతుందంటారు. నా కలలో ముత్యాలమ్మ కనబడి’’
ఇంకా వాక్యం పూర్తి కాకుండానే వీరిగాడు అందుకుని ‘‘అయ్యా ముత్యాలమ్మ తల్లి మీకు కలలో కనిపించిందంటే నిజంగా మీరు పుణ్యాత్ములు బాబూ. అమ్మోరు ఏం సెప్పిందండి’’ అంటూ అడిగాడు.
‘‘పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది’’ అన్నాడు ఎమ్మెల్యే ఏడుకొండలు.
‘‘మీ పిల్లలకేందయ్యా బంగారు కొండలు. బాబు పై దేశాల్లో సదువుతుంటే పాప డాటరై పట్నంలో పెద్ద ఆసుపత్రి పెట్టింది. ఆళ్లకేం కొదవ. లచ్చిమిదేవి బిడ్డలు’’ అంటూ ఆనందంగా చెప్పాడు.
‘‘ఒరే సన్నాసి అమ్మోరు అడిగింది నా బిడ్డల గురించి కాదురా. ఎలచ్చన్లో ప్రజలంతా నా బిడ్డలే అని అని సెప్పాను గదరా. ఆళ్ల గురించి అడిగింది రా’’
‘‘నిజమే బాబూ ఆమె సత్తెనమైన తల్లి. ఆమెకు అందరు సమానమే. సల్లని తల్లి ఇంకేమి సెప్పిందో సెప్పండి’’ ఆత్రంగా అడిగాడు వీరిగాడు.
‘‘ఏడుకొండలు సంక్రాంతి పండగొస్తుంది. నా పిల్లలు ఆనందంగా పండగ జరుపుకోవాలి. పిండి వంటలు, కొత్త బట్టలు, నగలు కొనుక్కోవాలి. వాళ్లకి డబ్బుకి ఇబ్బంది రాకుండా చూడు. వాళ్లు అమాయకులు. వాళ్ల కష్టాలు, ఇష్టాలు నీతో చెప్పుకోలేరు. ప్రతి ఒక్కరికి జన్‌పధ్ బ్యాంకు ఖాతాలున్నాయి. ఒక్కొక్కరికి యాభైవేలు చొప్పున ఇవ్వు. వాళ్లు కాయకష్టం చేసుకునో, పంట దినుసులు అమ్ముకునో నీ అప్పు తీర్చేస్తార. వీడని నీడలా నీ వెంటనే ఉండి నీ జయాపజయాలలో పాలు పంచుకున్నారు. వాళ్లకి నువ్వు రుణపడి ఉన్నావు’’ అంటూ చెప్పిందిరా’’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
‘‘అయ్యా మనూర్లో వెయ్యి ఖాతాలున్నాయి. ఇప్పుడే దండోరా ఏయిత్తా. అమ్మోరు సెప్పినట్లు సెయ్యండి’’ అందటూ వీధిలోకి పరుగుతీశాడు వీరిగాడు.
భర్త మనసులో భావం గ్రహించలేక నిశే్చష్టురాలై నిలబడిపోయింది మంగతాయారు.

- బండారు చిన్న రామారావు, సెల్ : 9553330545.