హైదరాబాద్

నగరంలో వంద కోట్లతో పార్కుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, వనస్థలిపురం: ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం కోసం, ఆరోగ్యకర రాజధానిగా తీర్చిదిద్దేందుకు వంద కోట్ల వ్యయంతో పార్కులను అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉన్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశంతో మంత్రి జోగు రామన్న, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రాంమోహన్, జిహెచ్‌ఎంసి, అటవీ శాఖ ఉన్నతాధికారులు శనివారం నగరంలోని పలు పార్కులను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో, నగర శివారులో పచ్చదనాన్ని పెంచి అటవీ బ్లాక్‌లను మరింత అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పార్కుల్లో పర్యటించి, పరిశీలిస్తున్నామని అన్నారు. దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకతలు హైదరాబాద్‌కు ఉన్నాయని, చుట్టు పక్కల సుమారు 99 పార్కులతో నగరం ఉందని ఆయన తెలిపారు. గత పాలకులు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారని ఆయన విమర్శించారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించి మేడిపల్లి చేరుకుని అక్కడి శాంతివనం అర్బన్ పార్క్‌ను సందర్శించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఆ తర్వాత ఉప్పల్ శివారులోని భాగ్యనగర్ నందనవనంలో పర్యటించారు. అక్కడి సందర్శకుల కోసం చేసన ఏర్పాట్లు బాగున్నాయని, ఇదే విధంగా మిగతా చోట్ల చేస్తే బాగుంటుందని మంత్రి జోగు రామన్న అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ద్రోహుల పార్టీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ద్రోహుల పార్టీ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ విమర్శించారు. విద్యార్థుల ఆత్మబలిదానాలు చూసి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. టిజాక్ చైర్మన్ కోదండరామ్ యాత్ర సందర్భంగా కామారెడ్డిలో విద్యార్థులపై దాడి చేసిన వేణుగోపాల్ రెడ్డి ఓ రౌడీ, స్థానిక ఎమ్మెల్యేకు కుడి భుజం అని ఆయన ఆరోపించారు. నేరెళ్ళ ఘటనలో స్థానిక ఎస్‌ఐపై చర్య తీసుకున్నారే తప్ప జిల్లా ఎస్‌పిపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
ట్రాఫిక్ చలాన్లతో దోపిడి:దానం
మాజీ మంత్రి దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ దొడ్డిదారిన డబ్బులు దండుకునేందుకు ట్రాఫిక్ చలాన్లు వేస్తున్నారని విమర్శించారు. నగరంలో రెండు లక్షల గుంతలు ఉన్నాయని ఆయన తెలిపారు. వాటి గురించి పట్టించుకోకుండా చలాన్లు వేయడం భావ్యం కాదన్నారు. ఇలాఉండగా అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని మతతత్వానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతామని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.

ఇక డ్రైవర్ లేని కార్లు

హైదరాబాద్: భారత్ రోడ్లపైకి డ్రైవర్ లేని కార్లు వచ్చేందుకు ఎంతో కాలం ఆగనక్కర్లేదని ప్రఖ్యాత శాస్తవ్రేత్త , కార్నెగి మిలాన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ రాజిరెడ్డి చెప్పారు. శనివారం నాడు ట్రిపుల్ ఐటి 16వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారత్ రోడ్లపై ఈ తరహా కార్లు మరో 5 నుండి 8 ఏళ్ల వ్యవధిలో వస్తాయని అన్నారు. రవాణా వ్యవస్థ మొత్తం ఆటోమేషన్‌కు వెళ్తుందని, ప్రజ్ఞానంతో కూడిన విజ్ఞానం రానున్న రోజుల్లో ప్రాధాన్యత వహించనుందని అన్నారు. ఈ సందర్భంగా రెడ్డి ల్యాబ్స్ సిఇఓ జి వి ప్రసాద్ మాట్లాడుతూ జీవితంలో తాను ఏ విధంగా ఎదిగిందీ వివరించారు. విభిన్నత్వం ప్రతి వ్యక్తిని సమర్ధుడిగా తయారుచేస్తుందని అన్నారు. విజయవంతం కావాలంటే జీవితంలో నిరంతరం నేర్చుకుంటూ ఎదగాల్సిందేనని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ పి జె నారాయణ్ మాట్లాడుతూ స్టార్టప్‌లకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. స్టార్టప్‌లకు అవసరమైన పారిశ్రామిక ఔత్సాహికతను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఆడిటోరియంలో జరిగిన ఈ స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్ధులు అంతా ఖాదీ వస్త్రాలతో నిండుగా కనిపించారు. 473 మందికి స్నాతకోత్తర పట్టాలను అందించారు. ఈ సందర్భంగా 84 మంది పరిశోధక అభ్యర్థులు తమ డిగ్రీలను పొందారు. గౌతమ్ వేప రెండు బంగారు పతకాలు సాధించగా, మరో ఇద్దరు విద్యార్థులు అబినీత్ జైన్, సౌజన్య పొన్నపాలి ఆల్ రౌండ్ అవార్డులు పొందారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు 116 కంపెనీలు ముందుకు వచ్చాయని సంస్థ డైరెక్టర్ పేర్కొన్నారు. చదువు పూర్తి చేసిన వారందరికీ ఉద్యోగాలు వచ్చాయని, ఐటి కంపెనీల్లో గరిష్టంగా 17.7 లక్షల వేతనానికి ప్లేస్‌మెంట్ లభించిందని ఆయన అన్నారు. అదే ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్లకు గరిష్టంగా 18.8 లక్షల వేతనం వరకూ లభించిందని పేర్కొన్నారు.

స్కూల్ బస్సు నిర్లక్ష్యానికి చిన్నారి బలి

రాజేంద్రనగర్: స్కూల్ బస్సు నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ వెనుకకుతీసే క్రమంలో వెనుక ఉన్న చిన్నారిని గమనించకుండా కదిలించాడు. ఈ ఘటనలో చిన్నారి చక్రాల కిందపడి మృతి చెందింది. ఈ ఘటన రాజేంద్రనగర్‌లో సంచలనం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఎల్లప్ప అంజలి కూతురు మానస(2). శనివారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటుంది. రాజేంద్రనగర్‌లోని ఆదర్శ విద్యాలయం స్కూల్ బస్సు హనుమాన్‌నగర్‌లో స్కూల్ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చింది. బస్సుడ్రైవర్ వెనుక ఉన్న చిన్నారిని గుర్తించకుండా వెనుకకు తీసుకోవడంతో బస్సు చిన్నారి అంజలికి తగిలింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో స్థానికులు బస్ డ్రైవర్‌ను ఆపి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు తగిలిన ఘటనలో చిన్నారి అంజలి మృతి చెందడంతో చిన్నారి తల్లిదండ్రులు చిన్నారి మృతదేహంపై పడి విలపించారు. మృతి చెందిన చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ విఘత జీవి కావడంతో తట్టుకోలేకపోయారు. చిన్నారి తల్లిదండ్రులు ఏడుస్తుండడంతో స్థానికులు వారిని ఆపలేకపోయారు. చిన్నారి మృతితో బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతికి కారణమైన బస్సు డ్రైవర్, స్కూల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. కుటుంబానికి తగిన న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

భగవద్గీత మానవాళికి గొప్ప సందేశం
హయత్‌నగర్: భగవద్గీతతో శ్రీకృష్ణుడు ప్రపంచ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చారని నాగార్జున విద్యాసంస్థల చైర్మన్ గుమ్మకొండ విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. చంపాపేట్ డివిజన్ గాయత్రినగర్ చౌరస్తాలోని నాగార్జున ది నెక్ట్స్‌జెన్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో పాఠశాల యాజమాన్యంతో కలిసి ఉట్టికొట్టి సంబరాలు జరిపారు. విఠల్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీ కృష్ణుడి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్ చైర్‌పర్సన్ రజిని విఠల్‌రెడ్డి, జోనల్ ఇన్‌చార్జి కట్ట రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ఎన్.సరోజ పాల్గొన్నారు.
లోటస్‌ల్యాప్ స్కూల్‌లో...
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్‌లోని లోటస్‌ల్యాప్ పబ్లిక్ స్కూల్‌లో చిన్నారులకు అక్షరభ్యాసం నిర్వహించారు. అనంతరం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరిపారు. చిన్నారులు శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణలో ఉట్టి కొట్టారు. పాఠశాల చైర్మన్ ఏకుల శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ మంజూల రెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుండే దేశ సాంస్కృతి సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నిర్మలరావు, ఉపాద్యాయులు ఉషాకిరణ్, ఇన్‌చార్జీలు రవళి, రాజకుమారి పాల్గొన్నారు.
బాలాపూర్: మీర్‌పేట్‌లోని నాగార్జున మాంటిస్సోరి ఐఐటి కానె్సప్ట్ పాఠశాలలో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేష ధారణలో ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా నాగార్జున విద్యాసంస్థల చైర్మన్ గుమ్మకొండ విఠల్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జీవితం అందరికి ఆదర్శప్రాయమని అన్నారు. భగవద్గీత ద్వారా ప్రపంచ మానవాళికి గొప్ప సందేశం అందించారని పేర్కొన్నారు. నాగార్జున విద్యాసంస్థల వైస్ చైర్ పర్సన్ జి.రంజని విఠల్‌రెడ్డి, మేనేజీంగ్ డైరెక్టర్ జి.కార్తికేయ రెడ్డి, ప్రిన్సిపాల్ జె.సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ ఆర్.జ్యోతి, ఇన్‌చార్జులు కనకదుర్గ, రాధిక పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
ఉప్పల్: లోక కల్యాణార్థం పుణ్య కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి అన్నారు. శనివారం మేడిపల్లిలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో కల్యాణ మండపం, ప్రహారీ, స్వాగత తోరణం పనులకు ఆలయ కమిటీ చైర్మన్ పాశం బుచ్చి యాదవ్, డైరెక్టర్లు యుగంధర్ రెడ్డి, సహదేవ్ గౌడ్, ఇఇ భాగ్యలక్ష్మితో కలిసి భూమి పూజ నిర్వహించారు. దైనందిక జీవితంలో పలు సమస్యలతో మానసిక ఒత్తిడికిలోనై అనారోగ్యానికి గురికాకుండా దైవసన్నిధిలో పూజలు నిర్వహిస్తే ఉపశమనం కలుగడంతో పాటు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉంటారని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి 25శాతం నిధులు కాంట్రిబ్యూషన్ కింద చెల్లిస్తే మిగితా 75శాతం ఎండోమెంట్ శాఖ ఇస్తుంది. బిల్డర్స్ అసోసియేషన్ స్వచ్చందంగా ముందుకు రాగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అప్పటికప్పుడు రూ.51వేలు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే కల్యాణ మండపానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుబ్బాక విష్ణువర్ధన్ రెడ్డి సహాయ సహకారం అందించడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆలయ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రముఖులు, పట్టణ పెద్దలు నిర్మాణానికి విరాళం ఇవ్వడానికి పోటీపడ్డారు. ప్రజల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కమిటీ చైర్మన్ పాశం బుచ్చి యాదవ్ పేర్కొన్నారు.

ఎన్‌సిసి జాతీయ ఐక్యతా శిబిరం
ఉప్పల్: కాచవానిసింగారంలోని నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ ఆవరణలో నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (ఎన్‌సిసి) క్యాంప్ విజయవంతంగా ముగిసింది. అసోసియేట్ ఆఫ్ ఎన్‌సిసి ఆఫీసర్స్ తెలంగాణ, ఎపి డైరెక్టరేట్ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు జరిగిన క్యాంప్‌లో దేశంలోని 26 రాష్ట్రాల నుంచి 650 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యత, విశిష్టతపై ఎన్‌సిసి, నేవీ, ఎయిర్‌ఫోర్స్, మిలటరీ, పోలీసు, ఫైర్ విభాగాల ఉన్నత స్థాయి అధికారులు క్యాంప్‌లో పాల్గొని క్లుప్తంగా వివరించారు. చివరి రోజు ఎయిర్ కమడోర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి.మహేశ్వర్ పాల్గొని విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. విద్యార్థుల ఆటపాటలు, క్రీడా విన్యాసాలపై సంతృప్తి చెంది అభినందించారు. క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిస్వాసంతో కలిగి భావిభారత పౌరులుగా ఎదగాలని అన్నారు. దేశ సేవ కోసం ఆర్మీలో రాణించడానికి ఉత్సాహం చూపించాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ సికింద్రాబాద్ కల్నల్ ఎన్‌ఎస్ పాల్, కల్నల్ శశికాంత్ వై.జాదవ్, కెప్టెన్ వరప్రసాద్, ఆఫీసర్స్ సత్యనారాయణ, ప్రభాకర్‌రావు, బృందావనం, హరిదేవ్, ఎస్‌ఎన్ జక్థార్ సింగ్, నల్ల మల్లారెడ్డి గ్రూప్ ఇన్సిట్యూషన్స్ చైర్‌పర్సన్ కేతిరెడ్డి సంధ్యావళి, కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన భాషల్లో విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం బోనాలు, బతుకమ్మ సంబురాలు, రాజస్థాన్, బెంగాలీ, మహరాష్ట్ర సంప్రదాయ నృత్యాలు ప్రత్యేకంగా నిలిచాయి.

సహజయోగ ధ్యానంతో సంపూర్ణమైన ఆరోగ్యం
ఉప్పల్: సహజయోగతో అంతర్గత శక్తి జాగృతి పొంది ఆత్మసాక్షాత్కారం ప్రత్యక్ష అనుభూతి పొందవచ్చని శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగ అంతర్జాతీయ ట్రస్టు వైస్ చైర్మన్ దినేష్ రాయ్ అన్నారు. శనివారం మేడిపల్లి ఎం కనె్వన్షన్ సెంటర్‌లో దక్షిణ భారతదేశ సహజయోగ సెమినార్-2017 జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అనుభవజ్ఞులైన రెండువేల మంది సహజయోగులతో పాటు విదేశీ సహజయోగులు సైతం పాల్గొన్నారు. సహయజోగ ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్య పరివర్తన కలుగుతుందని పేర్కొన్నారు. శాస్ర్తియంగా సహజయోగంతో కలిగే ఉపయోగాలను నిరూపించుటకోసం సుదీర్ఘమైన పరిశోధనలను చేపట్టి వీటి ఫలితాలను ప్రజల్లోకి తీసికెళ్లినట్లు పేర్కొన్నారు. యోగంతో ఆత్మ స్వరూపమును అనుభవం పూర్వంకంగా గ్రహించి ఉన్నతస్థితికి చేరుకోవడమే లక్ష్యంగా గుర్తించాలన్నారు. సహజయోగంతో మానవాళి యోగం వలన కలిగే అన్ని లాభాలు అందరికీ అందించాలన్న లక్ష్యంతో శ్రీ మాతాజీ ఈ యోగాన్ని రూపొందించారని తెలిపారు. సహజయోగ సాధకులచే నిర్వహించే సామూహిక యోగ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. దైనందిన జీవితంలో బాధ్యత నిర్వహణలో పని ఒత్తిడి నుంచి మానసిక ఉపశమనం కోసం సహజయోగ ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. మధ్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాల భారిన పడిన యువతను సహజయోగ ద్వారా సన్మార్గంలో పెట్టి వారిలో సంపూర్ణమైన పరివర్తన తీసుకరావడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. సహజయోగ ట్రస్టు తెలంగాణ రాష్ట్రం కోఆర్డినేటర్ కె.బ్రహ్మచారి మాట్లాడుతూ సమాజంలోని ఎన్నో అసాంఘిక, అనైక్యత కార్యక్రమాలకు సహజయోగం చక్కటి పరిష్కారమార్గమని వీటిని తెలుసుకుంటే సమాజానికి తద్వారా దేశానికి ఎంతో మేలు అని పేర్కొన్నారు. సహజయోగ సాధనతో వ్యక్తిగత సంపూర్ణ వికాసం పెంపొందించుకునే కార్యక్రమాలను అన్ని ప్రాంతాలకు విస్తృతం చేస్తున్నామని తెలిపారు. సహజయోగ సాధనలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి కావలిసన మెలుకవులు వ్యక్తిగతంగాను, సామాజికపరంగా, మానవాభివృద్ధికి ఉపయోగపడే విషయాలపై చర్చించారు. సెమినార్‌లో ట్రస్టు జాయింట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ పన్సూర్, కెకె అగర్వాల్, జయోకరణ్ చౌదరి, టిఎస్ బాబ, అనీల్ జోషి, శ్రీచంద్ చౌదరి, హెచ్‌పి చౌదరి, డాక్టర్ రాకేష్, ఎకె ఝా, డాక్టర్ హీరాజోషి పాల్గొన్నారు.