హైదరాబాద్

మెట్రో రైలు కారిడార్లలో కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర ప్రజల జీవనంతో ముడిపడి ఉన్న ముఖ్య శాఖల మధ్య తలెత్తిన సమన్వయలోపం నగరంలో వాహనదారుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా మెట్రోరైలు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో, ఇరుకైన రోడ్లున్న ప్రాంతాల్లో ఈ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. శాఖల మధ్య సమన్వయలోపానికి సికిందరాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జి నుంచి రాకపోకలు నిలిపివేయటం నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక్కడ మెట్రోరైలు పనులు ఊపందుకోవటంతో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ దారుల్లో దారి మళ్లించేందుకు హైదరాబాద్ మెట్రోరైలు, నగర ట్రాఫిక్ పోలీసు శాఖ, మెట్రోరైలు గుత్తేదారు సంస్థ ఎల్ అండ్ టి కూడా బాధ్యత వహించాల్సి ఉండగా, వాహనదారులకు కేవలం రెండురోజుల ముందే సమాచారమిచ్చారు. ఈ ఆంక్షలను అమలు చేసే ముందు వాహనదారులకు సమాచారమివ్వటంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించాల్సిన వివిధ ప్రభుత్వ శాఖలు వాహనదారులే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని చేతులెత్తేశాయి. ఆర్టీసి క్రాస్‌రోడ్డు నుంచి, కవాడిగూడ, పద్మారావునగర్‌ల నుంచి ముషీరాబాద్ చౌరస్తా, గాంధీ ఆసుపత్రి మీదుగా వేల సంఖ్యలో వాహనాలు సికిందరాబాద్ వైపువస్తుంటాయి. ఎక్కువ మంది వాహనదారులు ఇక్కడకు వచ్చిన తర్వాత ఒలిఫెంటా బ్రిడ్జి మూసివేసినట్లు గుర్తించిన తర్వాత తాము స్టేషన్‌కు ఎలా వెళ్లాలో తెలీక గల్లీల్లో చక్కర్లు కొడుతున్నారు. అంతేగాక, వాహనదారుల్లో చాలా మందికి ప్రత్యామ్నాయ మార్గాలపై అవగాహన అంతంతమాత్రమే. మహానగరంలో అత్యధికంగా వాహనాలు రాకపోకలు సాగిస్తూ, రద్దీగా ఉండే ప్రాంతాల్లో సికిందరాబాద్, అమీర్‌పేట ప్రాంతాల్లో ప్రస్తుతం ఆంక్షలు అమల్లో ఉండటంతో వాహనదారులకు ప్రయాణం నరకంగా మారింది. మైత్రివనం జంక్షన్‌లో నిర్మిస్నుస్తున్న మెట్రోరైలు ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ పనుల కారణంగా మరో రెండు నెలల పాటు ఇక్కడ ఆంక్షలు అమలయ్యే అవకాశముంది. ఫలితంగా మూసాపేట వైపు నుంచి పంజాగుట్ట వైపు రావాలంటే వాహనదారులు బల్కంపేట, ధరమ్‌కరమ్‌రోడ్డు, కంట్రీక్లబ్, సిఎం క్యాంపు కార్యాలయం ముందు నుంచి పంజాగుట్టవైపు రావల్సి వస్తోంది. ఫలితంగా రెండు నుంచి మూడు కిలోమీటర్లు తిరగాల్సి వస్తోందని వాహనదారులంటున్నారు. బల్కంపేట, ధరమ్‌కరమ్ రోడ్డులోని చిన్న రోడ్లలో గంటల తరబడి వాహనాలు క్యూ కడుతున్నాయి. ఒలిఫెంటా బ్రిడ్జి మూసివేయటంతో బోయిగూడ, బన్సీలాల్‌పేట, మోండామార్కెట్, ఎస్‌డిరోడ్డు, సంగీత్‌రోడ్లలో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీనికి తోడు ఆర్టీసి క్రాస్‌రోడ్డు, ముషీరాబాద్ నుంచి సికిందరాబాద్ వైపు వచ్చే మెయిన్ రోడ్డులో కూడా మెట్రో పనుల కారణంగా తవ్విన రోడ్లపై గుంతలను నేటికీ పూడ్చలేదు. పలు చోట్ల స్థల సేకరణ కోసం నేలమట్టం చేసిన భవనాల వ్యర్థాలను తొలగించకపోవటంతో రోడ్లు ఇరుకుగా మారి. వాహనదారుల ఇబ్బందులను రెట్టింపయ్యాయి. కనీసం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ట్రాఫిక్ మళ్లింపు ఉన్న ప్రాంతంలో సిబ్బందిని నియమించి, వాహనదారులకు కావల్సిన సమాచారం అందించేలా ఏర్పాట్లు చేయాలని వాహనదారులు కొరుతున్నారు.