హైదరాబాద్

నో యువర్ ఫోర్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగావకాశాల పట్ల యువతను ప్రోత్సహించేందుకు ఎయిర్‌ఫోర్స్ విభాగం శనివారం నాడిక్కడ హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ‘మీ త్రివిధ దళాల గురించి తెలుసుకో (నో యువర్ ఫోర్స్‌సెస్)’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. రానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. జంటనగరాల్లోని పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్ధులు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించారు. ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాలు, యుద్ద విన్యాసాలు వంటి వాటిని అక్కడ ప్రదర్శించారు. స్టేషన్ మ్యూజియంను కూడా సందర్శించి ఎయిర్‌ఫోర్స్ విభాగం ప్రత్యేకతలను విద్యార్థులు తెలుసుకున్నారు. ఎయిర్‌పోర్స్‌లో గతంలో పని చేసిన వారి అనుభవాలు, సాధించిన విజయాలను తెలియజేసే విధంగా ప్రోత్సాహక లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్న ఉద్యోగ ప్రత్యేకతలు, సౌకర్యాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు వంటి వాటిని ఎయిర్‌ఫోర్స్ అధికారులు విద్యార్థులకు వివరించారు.