హైదరాబాద్

ట్రాఫిక్ పరేషానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వేళల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి నగర శివార్లలోని రాజేంద్రనగర్, బండ్లగూడ, అప్పా జంక్షన్, హిమాయత్‌సాగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత నాలుగు గంటల నుంచి దాదాపు అరగంట సేపునగరంలోని మెహిదీపట్నం, లక్డీకాపూల్, నాంపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఫలితంగా మెయిన్‌రోడ్లలో భారీగా నీరు చేరింది. ఎగువ ప్రాంతమైన బంజారాహిల్స్ నుంచి అటు ఎర్రమంజిల్, ఖైరతాబాద్ ప్రాంతాలకు, అలాగే మాసాబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ ప్రాంతాలకు భారీగా వర్షపు నీరు రావటంతో నిత్యం రద్దీగా ఉండే పలు జంక్షన్లలో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. సాయంత్రం ఏడు గంటల సమయంలో సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా ప్యారడైజ్ ఫ్లే ఓవర్, సంగీత్‌రెడ్డి, స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఇక మెట్రోరైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కష్టాలు వర్ణణాతీతం. పనుల కారణంగా తవ్విన గుంతలను నేటికీ పూడ్చకపోవటంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. మెట్రో స్టేషన్ల పనులు జరుగుతున్న లక్డీకాపూల్, నాంపల్లి ఎం.జె.మార్కెట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నపుడు వాహనదారుల ఇబ్బందుల మరింత రెట్టింపయ్యాయి. పలు మెయిన్‌రోడ్లలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.