కృష్ణ

పాముల్లంకలో విజృంభించిన విష జ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: మండలంలోని పాములలంక గ్రామంలో విష జ్వరాలు విజృంభించాయి. వారం రోజుల క్రితం మొదలైన జ్వరాలు గత మూడు రోజులుగా తీవ్రమయ్యాయి. రోజుకొక కుటుంబాన్ని తాకుతూ గ్రామాన్ని చుట్టుముట్టేశాయి. కర్రా శైలజ(34) డెంగ్యూ జ్వరానికి గురై మూడు రోజుల క్రితం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఇంటికి తాళం పెట్టి కుటుంబ సభ్యులంతా విజయవాడ ఆస్పత్రి వద్దే ఉంటున్నారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో సుమారు 100 మంది ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నట్టు చెపుతున్నారు. ఎక్కువగా టైఫాయిడ్ జ్వరాలు సోకినట్టు గ్రామస్తులు చెపుతున్నారు. కృష్ణానది పాయల మధ్య ఉన్న పాములలంక చుట్టూ పచ్చని పొలాలతో ఆహ్లాదంగా ఉంటుంది. సుమారు 1200 మంది జనాభా ఉన్నారు. ఎక్కడా వర్షం మురుగు కంటికి కూడా కనిపించదు. కాలుష్యం ఉండదు. అలాంటి గ్రామ ప్రజలను విష జ్వరాలు చుట్టుముట్టాయి. చాలా గృహాలలో మంచం పట్టిన జ్వరం బాధితులు కనిపిస్తున్నారు. కర్రా చినకోటయ్య అనే వృద్ధుడు జ్వరంతో లేవలేని స్థితికి వచ్చాడని కుటుంబ సభ్యులు చెప్పారు. బత్తుల శివాజీ ఇంటిలో నలుగురికి జ్వరాలు సోకాయి. కుటుంబ సభ్యులందరినీ జ్వరాలు బాధిస్తుడటంతో ఆ కుటుంబ తల్లడిల్లుతోంది. తోట్లవల్లూరు నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో కృష్ణానదిపాయల మధ్య పాములలంక ఉంది. కృష్ణానదీపాయలో నుంచి తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయటంతో గ్రామంలోకి ఒక్క ఆటోలు మాత్రమే వస్తాయి. జ్వరం సోకిన బాధితులు ఆటోలలో తోట్లవల్లూరు పీహెచ్‌సీకి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. అంతకుమించి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. గ్రామంలో సబ్‌సెంటర్ ఉన్నా అక్కడ మందులు బిళ్ళలు మాత్రమే లభిస్తాయని, మెరుగైన చికిత్స అందాలంటే తోట్లవల్లూరు పీహెచ్‌సీకి రావాలని ప్రజలు చెపుతున్నారు. అందుచేత గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలావుండగా రహదారుల వెంట కొన్ని చోట్ల పేడతో కూడిన పెంటపోగులు ఉన్నాయి. పిచ్చిచెట్ల పొదలు ఇళ్ళమధ్య ఖాళీ స్థలాల్లో ఉన్నాయి. ఇవి దోమలకు నిలయాలుగా ఉంటున్నాయి. పాములలంకలో ప్రతి ఇంటిలో జ్వరాల బాధితులు ఉన్నారని, తమ ఇంటిలో అందరికీ జ్వరాలు సోకాయని మాజీ ఎంపిటిసి సభ్యుడు పొత్తూరి రవి తెలిపారు. గ్రామం నుంచి తోట్లవల్లూరు వచ్చేందుకు రవాణా సౌకర్యం లేదని, అందుచేత గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇదిలావుండగా పాముల్లంకలో పరిస్థితిపై తోట్లవల్లూరు పిహెచ్‌సి వైద్యాధికారి విజయకుమార్‌ను వివరణ కోరగా ఆ గ్రామం జ్వరాలతో బాధపడుతున్న విషయం వాస్తవమేనన్నారు. ఇప్పటికే 25 మందికి పైగా జ్వరం బాధితులు పిహెచ్‌సికి వచ్చి వైద్యం చేయించుకున్నారన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.