కృష్ణ

ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ అన్నారు. శనివారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులేనని అన్నారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌లకు వచ్చే ప్రజల పట్ల మర్యాద పూర్వకంగా మెలిగి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వారంలో రెండు రోజుల పాటు ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో బందరు, గుడివాడ, అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు, శనివారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో నందిగామ, నూజివీడు సబ్ డివిజన్ ప్రజల కోసం ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాదివస్‌లో వచ్చే ప్రతి సమస్యపై తక్షణం స్పందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబరుకు వచ్చే అర్జీలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. వైట్ కాలర్ నేరాలు, ఇసుక అక్రమ రవాణా, తప్పిపోయిన వారు, గుర్తు తెలియని మృతదేహాల విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు.