సాహితి

ఎదురైనాక..! (కవితలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడో
తప్పిపోయిన వాళ్ళంతా
ఎక్కడో అక్కడ ఎదురై
పల్కరించగానే
ఆశ్చర్యపడిపోవడం నీ వంతు,
ముడతలు పడిన
ముఖ వర్చస్సుపై
నడచివచ్చిన కాలాన్ని
లెక్కించి
శేషభాగాన్ని
అంచనా వేసేలోగా
ఆచూకి దొరకని వాళ్లే
ఎటుచూసినా!
- నిఖిలేశ్వర్
బిగించు పిడికిలి

పెద్దనోట్ల రద్దు చూడ్డానికి దుడ్డుకర్రే కావచ్చు
కానీ అవినీతి తిమింగలాన్ని కొట్టేందుకదొక్కటే చాలదు
రద్దయిన నోట్ల చెల్లింపుల్లోనూ, మళ్లింపుల్లోనూ
అవినీతాండవం కాదా అందరెరిగిన భాగోతం
ఇప్పటికీ అనిశా దాడుల్లో కుప్పలుగా దొరుకుతున్న
కొత్తనోట్లు కావా పేట్రేగుతున్న అవినీతానవాళ్లు
అవినీతమస్సు వ్యాప్తి చేసే మాల్వేర్ మూలవేరు
నీకూ తెలుసు నాకూ తెలుసు
నీకూ, నాకూ తెలుసని ఇద్దరికీ తెలుసు
క్రయ విక్రయాలు నమోదు చేసే కార్యాలయాల్లో
మార్గదర్శక విలువలు స్టక్ ఐపోయిన కంప్యూటర్ ప్రోగ్రాములు
ఇళ్ల స్థలాలు, భవానలూ, మడులూ, మాన్యాలు
ఎర చూపి పొందే ఋణాలకు
బ్యాంకులు మదింపు చేయించే ధరలు
మాత్రం హైస్పీడుతో పరిగెత్తే ప్రోగ్రాములు
సోదాల్లో అక్రమాస్తులు పట్టుబడిన ప్రతిసారీ
దస్త్రాలలో వాటి విలువ కొంచెమేననీ
విపణి విలువ మాత్రం బహుఘనమనీ
మరి మరీ దండోరావేస్తారు కదా మరి
నగరాభివృద్ధి సంస్థలు విక్రయిస్తే
బహిరంగ వేలంలో నివేశన స్థలాలు
వాస్తవానికి అద్దం పడతాయి దాఖలైన బిడ్స్
ప్రభుత్వ దస్త్రాల్లో ధరకు మట్టుకు
అవి ఇవ్వలేవు గైడెన్స్ అమ్మిన/కొన్న ధరనే
పత్రాలలో కెక్కించే ధన్యాత్ములు
ఉంటే ఎక్కడైనా వారు ఎడారిలో గులాబీలు
ఇది ‘అన్ రియల్ ఎస్టేట్’ అన్న
నిజం తెలియనిదెవరికి
వ్యవస్థ కాపలాదారులే దీనికి కాపు మరి
పదిలంగానే వదిలేస్తే ఈ కబంధ బంధం
అవుతుంది అవినీతిపై పోరాటం
పిడికిలి బిగించని ముష్టి యుద్ధం
భేరీ మోగించడమే కాదు సుమా సమరం
ఈ త్రాడు తెగేదాకా లాగడమే వివేకం.
- మల్లాప్రగడ రామారావు
9989863398
అందరికీ విద్య
మృగ్యమై అసమానతల వెలిలో
అసమగ్ర విశే్లషణ చదువుల
కొలిమిలో కాల్చబడి
కార్పొరేట్ల కాల్పనిక చదువుల
అంగడిలో ప్రశ్నకే అవకాశం లేని
జవాబే చెప్పలేని మెటీరియలైజ్డ్
ఫండమెంటలిస్టిక్
ఐడియాలజీ చదువుల వేటలో
ఎటునుండి ఎటు చదువుతున్నామో
తెలియని ధ్యాసలో
మానసిక వేదనలో
నిర్వేదంలో
ఎవరో నిర్దేశించే గమ్యంలేని
చదువుల ఆకళింపులో
అణువణువు క్షోభతో
సామాజిక వికాసమే కొరవడి
అచేతనమై
పుస్తకాల ఛేదనలో చెడుగుడు
బట్టీయం మహమ్మారి
మెదడును మొద్దుబారేట్లు చేస్తుంటే
భావితరం చట్రంలో బందీ
మానవ సంబంధాల విలువల వలువలు
సత్తెకాలపు చదువుల చేతిలో చిక్కి
వలవల వెలవెల
జ్ఞానసముపార్జన కొరవడి
ర్యాంకుల రంకులో రచ్చ
అదే మహాభాగ్యమనుకునే
మహానుభావుల పుట్టిల్లు
జీవనమంటే ఆ చదువే
ఎందుకూ కొరగాని మెదళ్ళ శక్తి
మెకాలే చదువు గుమాస్తాగిరీనిస్తే
గీచదువు గిరగిర తిప్పి
ఈడ్చికొడితే ఎదగలేక వెర్రిగా
అయినా చదువు కార్పొరేట్ల చేతుల్లో కీలుబొమ్మ
ఏలికలంతా ఆ తాను ముక్కలే
- గిరిప్రసాద్ చెలమల్లు