భక్తి కథలు

బసవ పురాణం- 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోగయ్యగారి కథ
కెంబాగి అనే నగరంలో భోగయ్య అనే మాదిగ శివభక్తుడు ఉండేవాడు. శివుడొకనాడొక పెయ్య శవాన్ని భుజాన వేసుకొని భోగయ్యను పరీక్షించేనిమిత్తం ఒక జంగమ వేషంలో వచ్చి పెయ్యను వండిపెట్టమన్నాడు. భోగయ్య వండిపెట్టాడు. దానితో బ్రాహ్మణులు కోపించి భోగయ్యమీదికి రాగా భోగయ్య నగరం విడిచిపోయాడు. భోగయ్య వెంట సమస్త శివలింగాలూ వచ్చాయి. కెంబాగి పాడుబడింది. బ్రాహ్మణులంతా మళ్లీ భోగయ్య కాళ్ళమీద పడితే భోగయ్య కెంబాగికి తిరిగి వచ్చాడు. లింగాలన్నీ అతని వెనుకే వచ్చాయి. కెంబాగి తిరిగి నందనవనమయింది.
గుడ్డవ్వ కథ
గుడ్డవ్వ అనే కుష్ఠురోగి శివశరణురాలు ఉండేది. ఆమెను నగరంలోని బ్రాహ్మణులు అసహ్యించుకొని తరిమికొట్టగా ఆమె నగరం విడిచి సౌరాష్ట్రం పోవాలని బయలుదేరింది. శివుడే ఆమెకు ఎదురు నడిచి వచ్చాడు. గుడ్డవ్వ శరీరం బాగుచేశాడు. ఆమెను తిట్టినవారికి కుష్ఠువు వచ్చింది.
ఇతర భక్తులు
(పాల్కురికి సోమనాథుడు కల్యాణ నగరంలోవున్న బసవని సమకాలిక భక్తుల పట్టిక ఇచ్చాడు. ఆ భక్తులందరి పేర్లు ఇవి)
మడివాలు మాచయ్య, మాది రాజయ్య, బడవర బ్రహ్మయ్య, బాచి రాజయ్య, కిన్నర బ్రహ్మయ్య, కేశి రాజయ్య, కన్నద బ్రహ్మయ్య, కల్లి దేవయ్య, మోళిగ మారయ్య, ముసిడి చౌడయ్య, శూలద బ్రహ్మయ్య, సురియ చౌడయ్య, కీలకేత బ్రహ్మయ్య, కక్కయ్య, తెలుగేశు మసలయ్య, తెలుగు బొమ్మయ్య, శాంతదేవుడు, జమ్మయ్య, బాసవంతు కేసయ్య, ఏకాంత రామయ్య, ఉత్తమాంగద కేశి హొన్నయ్య, గండకత్తెర నాచయ్య, కాలాగ్ని రుద్రిశృంగి బొప్పయ్య, చిగురు చందయ్య, డింగరి మల్లయ్య, సంగమేశ్వరుడు, కదిరె రెమ్మయ్య, మహాకాళయ్య, పదుమరసును, పురాణ దమాయిభట్టు, ఉదర రామయ్య, యోగి దేవయ్య, ఉదర మరసు, హొన్నయ్య, ధవళయ్య, బొంతాదేవి, సవదర చిక్కయ్య, సారె నాయడు, శివముద్దదేవుడు, చిక్కదేవుడు, శివరాత్రి సంగయ్య, అవిముక్తయ్య, చండేశు చామయ్య, ముండబ్రహ్మయ్య, బండియ రేవణ్ణ, ఇండె సోమన్న, హాటకేశ్వరుని బ్రహ్మయ్య, మహాబలుడు, కోటేశు చామయ్య, గొగ్గయ్య, దుమ్మద బ్రహ్మయ్య, దూర్జటి కేశిఎమ్మె సంగయ, కపిలేశు విన్నయ్య, వొణిమేశు చిక్కయ, నులుక చంద్రయ్య, గణదాసి మాదన్న, గంటి మల్లయ్య, మురహాట కేతయ్య, హరవి హొల్లయ్య, గిరిగీటు సింగయ్య, గురుజ కాళవ్వ, బానస భీమయ్య, భాస్కరయ్య, గోనియ మల్లయ్య, గొగ్గయ్య, అల్లయ్య, మధుపయ్య, అనిమేః కేశిహోలయ్య, గోడల మల్లయ్య, ఓలె బ్రహ్మయ్య, కరహళ మల్లయ్య, బాల బ్రహ్మయ్య, పణిహరి బాచి కవిలె బ్రహ్మయ, బందికార మల్లయ్య, అవకర కేతయ్య, శివనాగుమయ్య, నిజలింగ చిక్కయ్య, నిర్లజ్జశాంతి నిజభావుడు నిత్య నౌమదమైల, అంక బ్రహ్మయ్య, గరహల బ్రహ్మయ్య, సుంకేశు బంకయ్య, లెంక మంచయ్య, ఏలేశు బ్రహ్మయ్య, ఈడె బ్రహ్మయ్య, మైలన బ్రహ్మయ్య, మాయి దేవయ్య, చక్కెర బ్రహ్మయ్య, శరణయ్య, చిక్క బ్రహ్మయ్య, శ్రీగిరయ్య, వీర మాదయ్య, వీర లింగయ్య, వీరబ్రాహ్మయ్య, వీరభావయ్య, వీరనాగయ్య, వీరకల్లయ్య, వీరభోగయ్య, విమల దేవయ్య, కక్కయ్య, కల్లయ్య, కాట కోటయ్య చిక్కయ్య, వీరయ్య, శ్రీ సూరసాని, కొండ గుడ్కేతయ్య, గుండయ్య, చండేశు బ్రహ్మయ్య, శంకరయ్య, అమృత దేవయ్య, అనిమిషయ్య, విమలదేవుడు మొదలైనవారు.
బసవ పురాణము
ద్వితీయాధ్యాయము సమాప్తం
అయపోయంది

(నా సమాధియే
మీకు సమాధానాలు చెబుతుంది
నాపై మీరు దృష్టిని నిలపండి
నేను మీ సర్వభారాన్ని మోసెదను
శ్రద్ద సబూరీలను మీకుంటే చాలు
నేను సర్వవేళలా మిమ్ము రక్షిస్తాను
అని చెప్పే శ్రీశిరిడీ సాయినాథుని లీలలు
శ్రీసాయి లీలామృతం
జంగం శ్రీనివాసులు
కలం నుంచి
శుక్రవారం నుంచి ప్రారంభం)

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్