ఫోకస్

విజ్ఞానంతోనే విరుగుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళితులపై దాడులు ఇప్పుడే కొత్తగా జరగడం లేదు. అనాదిగా వస్తున్నదే. వారిపై వివక్ష కొనసాగినంత కాలం దాడులు జరుగుతూనే ఉంటాయి. గ్రామ పెద్దలు దళితులను వివిధ పనులకు వాడుకుంటున్నారు. వారిని కేవలం సేవకులుగానే అనేక ప్రాంతాల్లో చూస్తున్నారు. ఇప్పటికీ దళితులు గ్రామాల పొలిమేరల్లోనే జీవనం సాగిస్తున్నారు. గ్రామాల్లో ఏ గొడవ జరిగినా, అది పొలిమేరల్లోనే జరుగుతుంటుంది. ఈ గొడవల్లో అమాయక దళితులను చేరుస్తున్నారు. కక్షలు పెరిగి, దళితులపై దాడులు జరుగుతున్నాయి. అలాగే దళితుల రాజ్యాధికారాన్ని కూడా చూడలేక, వారిపై దాడులు జరుపుతున్నారు. దళితుల పెత్తనాన్ని కొంతమంది సహించలేరు. అకారణంగా దళితులను బలిపశువులను చేసి, రాజకీయ లబ్ది పొందుతున్నారు. దళితులు ఉన్నత విద్యలు అభ్యసించినప్పుడే, వారు ఈ దాడుల నుంచి తప్పించుకోడానికి ఆస్కారం ఉంటుంది. అంబేద్కర్‌ను రాజ్యాంగ పరిషత్ చైర్మన్‌గా తొలుత మహాత్మా గాంధీ ఆమోదించలేదు. ఆ తరువాత అంబేద్కర్ ఉన్నత విద్యను, తెలివితేటలను చూసి చివరికి గాంధీగారు కూడా మనసు మార్చుకున్నారు. దళితులు ఎప్పుడూ ఒకరి మోచేతి కింద నీరు తాగే వారులా ఉండకూడదు. వారు కూడా ఆర్థిక, వ్యాపార వాణిజ్య రంగంల్లో అడుగుపెట్టాలి. తద్వారా పది మందికి వారే ఉపాధి అవకాశాలు కల్పించినవారవుతారు. దీనివలన సమాజంలో దళితుల హోదా కూడా పెరుగుతుంది. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని సద్వినియోగం చేసుకోవలసి అవసరం ఎంతైనా ఉంది. కేవలం రిజర్వేషన్లనే నమ్ముకోకుండా, స్వశక్తిని దళితులు నమ్ముకున్ననాడు వారిని ఎవ్వరూ ఎదిరించలేరు.

- పివిఎన్ మాధవ్, ఏపి శాసన మండలి సభ్యుడు