ఫోకస్

మనిషిని మనిషిగా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులం, మతంతో సంబంధం లేకుండా మనిషిని మనిషిగా చూడాలి. తోటివారు సాటి మనుషులే అనే భావన మనుషులందరిలో ఉండాలి. దేశంలో దళితులపై దాడులు అనే అంశంలో రాజకీయ నాయకులు, మీడియా, వామపక్షాల పాత్ర విధ్వంసకరంగా ఉంటోంది. సెనే్సషనలిజంకోసం మీడియా ఇద్దరు వ్యక్తుల మధ్య, కొంతమంది వ్యక్తుల మధ్య జరిగే వివాదాన్ని, ఘర్షణను, దాడులను కులపరమైన దాడులుగా చూపుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కమ్మ, కాపులు కొట్టుకున్న సంఘనలు ఉన్నాయి. మీడియా వీటిని కమ్మ, కాపు దాడులు అని రాయవు. కానీ ఘర్షణ పడినవారిలో ఒకరు దళితులు అయితే దళితులపై దాడి అని చెప్పడం ద్వారా మీడియా సెనె్సషన్ చేయాలని ప్రయత్నిస్తోంది. రాజకీయ పక్షాలు దీనికి రాజకీయ రంగు పులిమి ప్రయోజనం పొందాలని చూస్తున్నాయి. ఇక వామపక్షాలు ఆగ్నికి ఆజ్యం పోసినట్టు ఇలాంటి వ్యవహారాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. రోడ్డు మీద ప్రమాదాలు సర్వసాధారణం. ప్రమాదం చేసేవాడు ఎదుటి వ్యక్తి ఏ కులం అని చూసి వాహనాన్ని పైకి పోనిస్తాడా? కారు ప్రమాదంలో దళితునికి గాయాలు అని కూడా రాసేస్థాయికి మీడియా చేరుకుంది. కుల పరమైన అంశాల విషయంలో మీడియా, రాజకీయ పక్షాలు సంయమనం పాటించాలి. ఇద్దరు వ్యక్తులు, సమూహాల మధ్య వివాదం అన్నప్పుడు వారిలో ఒక సమూహం దళితులు అయితే వివాదానికి కారణం కన్నా అక్కడ కులం ఏమిటని చూసి వివాదాన్ని ఎలా పెంచాలని మీడియా ప్రయత్నిస్తోంది. దేశ హితానికి ఇది మంచిది కాదు. దేశంలో ప్రతి రోజూ ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. బాధితుల్లో దళితులు ఉంటే దళితులపై అత్యాచారం అని చెప్పడం ద్వారా దళితులు కావడం వల్లనే ఈ సంఘటన జరిగింది అని చెబుతూ సమాజంలో అందరూ ఒకటే అనే భావన ఏర్పడకుండా చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు సంబంధించి ఏదైనా సంఘటన జరిగినప్పుడు కులం, మతం ప్రస్తావన తీసుకువస్తున్నారు. అదే విధమైన సంఘటన ఇతర మతాలు, కులాల విషయంలో జరిగినప్పుడు సంఘటనను సంఘటనగానే చూసే మీడియా వీరి విషయంలో మాత్రం కులం, మతాన్ని ప్రస్తావించడం ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. సనాతన ధర్మం మనుషులంతా ఒకటే అంటోంది. రాజకీయ నాయకత్వం, మీడియా సమాజాన్ని ఏకం చేసేందుకు ప్రయత్నించాలి కానీ వివాదాలను పెంచడానికి ప్రయత్నించవద్దు.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి