ఫోకస్

దాడులు అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళితులపై దాడులు జరగడానికి ముఖ్య కారణం, ఇంకా కుల వ్యవస్థ కొనసాగడం, దళితులను చిన్నచూపు చూడడమే. దేశానికి స్వాతంత్య్రం రాకముందు కుల వ్యవస్థ ఇంకా తీవ్రంగా ఉండేది. దాడులు తరచూ జరిగేవి. దళితులపై ఎవరైనా దాడి చేస్తే, దాడి చేసిన వారికి శిక్ష పడేది కాదు. స్వాతంత్య్రానంతరం దేశంలో పెను మార్పులు వచ్చాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌తో సహా ఇంకా అనేక మంది దళిత నేతలు సమాజంలో అందరూ సమానమేనంటూ, సమసమాజ స్థాపనకోసం కృషి చేశారు. ఇతర వర్గాలతో సమానంగా దళితులూ సమాజంలో భాగమేనని, వారూ అభివృద్ధి చెందాలని పోరాటం చేశారు. దీంతో దళితులకు హక్కులు కల్పించబడ్డాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా చాలాకాలం వరకూ దళితులపై దాడులు జరిగితే చర్యలు ఉండేవి కాదు. దళితులుగా పుట్టేది దాడులు అనుభవించేందుకా? అనే భావన వారిలో ఉండేది. క్రమేణా కొంత మార్పు వచ్చింది, వస్తోంది. రిజర్వేషన్ల వల్ల చదువు, చైతన్యం వచ్చింది. దాడులు కొంతవరకు తగ్గాయి. ఒకవేళ ఎక్కడైనా దాడులు జరిగితే దళితులే కాదు దళితేరులు కూడా ఖండించేవారు. కారంచేడు వంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. కాంగ్రెస్ హయాంలో ఎక్కడైనా దళితులపై దాడి జరిగితే హుటాహుటిన ప్రభుత్వం స్పందించేది. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి దళితులకు మనోధైర్యం కల్పించిన దాఖలాలున్నాయి.
దళితులపై దాడులు రెండు రకాలుగా జరుగుతున్నాయి. అగ్రవర్ణాలు చేసేవి, రెండోది అధికారంలో ఉన్న పార్టీలు చేయించేవి. మతం, కులం దాడి, ఇది ప్రభుత్వ దాడి. సిరిసిల్ల జిల్లా, నేరెళ్ళలో దళితులు కోలుకోలేని విధంగా పోలీసులు అమానుషంగా దాడి చేశారు. ఇది రాజ్యహింస అవుతుంది. కుల, మతాలకు గొడవ జరిగితే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. రాజ్యహింసకు గురైనవారు రాష్ట్రంలో దళితులు అభద్రతా భావానికి గురై భయంగా బతికే పరిస్థితి ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంవల్లే పోలీసులు దళితులపై థర్డ్‌డిగ్రీని ఉపయోగించి చిత్ర హింసలకు గురిచేశారు. సిరిసిల్ల ఘటనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నోరు మెదపడం లేదు. కెసిఆర్ తనయుడు కె. తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే దళితులపై దాడులు జరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలి. దళితుల సంక్షేమం, అభివృద్ధికోసం చర్యలు చేపట్టాలి. ఎస్‌సి కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి. దళితుల బాగోగులకోసం ముఖ్యమంత్రి తరచూ సమీక్షలు నిర్వహించాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలి.

- డాక్టర్ మల్లు రవి మాజీ ఎంపి, టి.పిసిసి ఉపాధ్యక్షుడు