ఫోకస్

ఆర్థిక స్వావలంబన సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ కొన్నిచోట్ల దళితులు వివక్షకు గురవుతూనే ఉన్నారు. బలహీనులను బలవంతులు భయపెట్టే పరిస్థితి మొదట్నుంచే వస్తూనే ఉంది. అలానే సామాజికంగా, ఆర్థికంగా దళితులు బలహీనులు కావడం, ప్రభుత్వాలు సైతం వారి అభివృద్ధికి మాటల్లో చెప్పినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి కారణాలతో దళితులు వెనుకబడే ఉంటున్నారు. ఈ పరిస్థితి తొలగాలంటే ఆర్థికంగా దళితులు స్వావలంబన సాధించాలి. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి. దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించడం, భూ పంపిణీ, విద్యా వౌలిక వసతుల కల్పన, ఆర్థిక వెసులుబాటు కోసం విరివిగా రుణాల మంజూరు వంటి ఎన్నో సంస్కరణలు అమలు చేయడం ద్వారా దళితుల్లో ఆర్థిక పరిపుష్టి సాధ్యమవుతుంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. గతంలో ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా దళితులు విద్యావంతులుగా మారి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. అవి అప్పట్లో ఎంతో సత్ఫలితాలిచ్చాయి. ప్రస్తుతం దళితుల మధ్య వర్గ విభేదాలు సృష్టించడం ద్వారా ప్రభుత్వాలు వారి ఐక్యతను దెబ్బతీసి పబ్బం గడుపుకోవడం విచారకరం. దళితులు తమ మధ్య విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా ఉంటే ఎంతటి బలవంతులైనా వారి వైపు చూసే ధైర్యం చేయలేరు. తాము ఐకమత్యంగా ఉన్నంత కాలం ఎవరు కూడా తమను బలహీనులుగా అనుకోరనే సత్యాన్ని గుర్తించాలి. దళితుల సంరక్షణకు భారత రాజ్యాంగం ఎన్నో హక్కులు, చట్టాలను రూపొందించింది. అయితే వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. వీటి అమలు సక్రమంగా ఉంటే దళితులపై దాడులకు దిగేవారికి కఠిన శిక్షలు అమలు చేయడంద్వారా భవిష్యత్తులో మరెవరూ వారిపై అన్యాయంగా దాడులకు దిగే ధైర్యం చేయలేరు.

- కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్యే, సూళ్లూరుపేట