ఫోకస్

చైతన్యం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళితులను గౌరవించినప్పుడే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యపడి అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి. దళితుల రక్షణకు అనేక చట్టాలున్నా వాటిని అమలుచేసే అధికారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. దళితుల్లో చైతన్యం తీసుకొస్తేనే వారిపై జరిగే దాడులు ఆగుతాయి. అసమానత, దళితుల అభివృద్ధి నిరోధకతనాన్ని పూర్తిగా రూపుమాపాలి. చట్టాలను నిర్లక్ష్యం చేసే ఎంతటివారిపైనైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో చుండూరు, కారంచేడు తరహాలో రాష్ట్రంలో దళితులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మధ్య తూర్పు గోదావరి జిల్లా గగనపర్రులో దళితులపై దాడులు చోటుచేసుకోగా ప్రభుత్వ జోక్యంతో సద్దుమణిగాయి. దళితులపై దాడులు, అగ్రవర్ణాల ఆధిపత్యం, అంటరానితనం, దళితుల ఎదుగుదల చూడలేకపోవడం, కొంతమేరకు వెట్టిచాకిరి, అక్కడక్కడ రెండుగ్లాసుల పద్ధతి చోటుచేసుకునేవి. తెలుగుదేశం ప్రభుత్వం దళితుల చట్టాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. అగ్రవర్ణాల ఆధిపత్యానికి అడ్డుకట్టవేస్తోంది. చట్టం అమలు చేయడంలో సమర్థత, ఎస్సీ, ఎస్టీ కమిషన్, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే దళితులపై దాడుల నివారణకు దోహదపడ్డాయి. దళితుల్లో నిరక్షరాస్యత, చైతన్యం లేని కారణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు వారి దరికి చేరడం లేదు. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. దళితులు ధైర్యంగా అగ్రవర్ణాల దాడులు ఎదుర్కోవాలి. మూఢనమ్మకాలు విడనాడి ఆర్థికంగా ఎదగాలి. విద్యాపరంగా ఉన్నత చదువులు, విదేశీ విద్యను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దళితులకోసం ప్రభుత్వమే భూములు కొనుగోలుచేసి అప్పగిస్తోంది. ఇందుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. దళితులపై దాడుల నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎస్సీ సబ్‌ప్లాన్‌తో దళితులకు వౌళిక సదుపాయాలు కల్పించి వారు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సాహిస్తోంది.

- కొల్లు రవీంద్ర, ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి