సంపాదకీయం

‘చొరబాటు’ పట్టని స్వభావం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనానుంచి దిగుమతి అవుతున్న ‘సమాచార సాంకేతిక’ వస్తు సామగ్రిని నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట! విస్తరిస్తున్న చైనా భౌ తిక దురాక్రమణ వ్యూహం మన ప్రభుత్వ ‘్భవన’కు విచిత్ర నేపథ్యం! చైనానుండి దిగుమతులను చేసుకోరాదన్న జ్ఞానోదయం మన ప్రభుత్వానికి దశాబ్దుల క్రితం కలిగి ఉండాలి. ‘కలుగకపోవడం’ జాతీయ మహాపరాధం! ఈ మహాపరాధం కారణంగానే మన దేశంలో చైనా వాణిజ్య సామ్రాజ్యం విస్తరించిపోయింది. అనవసరమైన నాసిరకం చైనా వస్తువులు దాదాపు ప్రతి ఇంట్లోకి చొరబడిపోయి ఉండడం ఈ వాణిజ్య బీభత్సకాండకు కొనసాగుతున్న సాక్ష్యం! చైనా భౌతిక దురాక్రమణ వ్యూహం వికృతంగా మన సరిహద్దుల చుట్టూ బిగిసిపోతున్నదని ఇప్పుడు మరోసారి స్పష్టమైంది. ప్రస్తుత ఘట్టంలో సిక్కిం, భూటాన్‌లోని డోక్‌లాలో మొదలైన ఈ భౌతిక దురాక్రమణ ఉత్తరఖండ్‌కు విస్తరించింది, లడక్‌లో మళ్లీ పెద్దఎత్తున చైనా సైనికులు ‘వన్‌గంగా’ ప్రాంతంలోకి మంగళవారం చొరబడి మన భద్రతాదళాలపై రాళ్లు రువ్వారుట! రాళ్లురువ్వడం కశ్మీర్ లోయ ప్రాంతంలో జిహాదీ బీభత్సకారులు అమలు జరుపుతున్న వ్యూహం! మన సైనికులపై, పోలీసులపై కశ్మీర్ లోయ ప్రాంతంలోని జిహాదీలు నిరంతరం రాళ్లు రువ్వుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకారులను చైనా ప్రభుత్వం కూడ సమర్ధిస్తోంది! అందువల్ల జిహాదీల స్ఫూర్తితో చైనీయ సైనికులు లడక్‌లో ‘రాళ్ల యుద్ధం’ ఆరంభించారు! ఇలా ప్రస్తుత ప్రచ్ఛన్న బీభత్స ఘట్టంలో ‘డోక్‌లా’లోకి చొరబడిన చైనా లడక్‌లో చొరబాట్లను పునరుద్ధరించింది. చైనా నుంచి సాంకేతిక సమాచార సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులను దిగుమతి చేసుకోవడం వల్ల మన భద్రతకు భంగం క లుగుతోందన్నది ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం గుర్తించిన వాస్తవం! ఈ చైనీయ సామగ్రి వల్ల మన భద్రతా సమాచారం బయటికి పొక్కే ప్రమాదం ఉందట! అందువల్ల చైనానుండి వచ్చి పడుతున్న ఈ సాంకేతిక పరిజ్ఞాన పదార్థ, పరికరాలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నది జరుగుతున్న ప్రచారం! సాంకేతిక వస్తు సామగ్రిని మాత్రమే కాదు, చైనానుంచి అన్ని రకాల దిగుమతులను నిషేధించడం వల్ల మాత్రమే మన అంతర్గత భద్రత, మన దేశ సరిహద్దుల భద్రత పెంపొందగలదన్నది ‘విచక్షణ జ్ఞానం’ వివరిస్తుండిన చారిత్రక వాస్తవం! తమ దేశ సరిహద్దులను దురాక్రమిస్తున్న శత్రుదేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులను ప్రపంచంలోని మరే ఇతర దేశం కూడ దిగుమతి చేసుకొనడం లేదు. కానీ మన ప్రభుత్వాలు దశాబ్దుల తరబడి చైనా భౌతిక దురాక్రమణతో నిమిత్తం లేకుండా చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాయి..
వాణిజ్యం, దౌత్యం, సరిహద్దుల భద్రత, ప్రజల మధ్య భావ వినిమయం, క్రీడలు, కళలు- ఇవన్నీ దేశ సార్వభౌమాధికారంలో భాగం, ప్రాదేశిక సమగ్రతలో భాగం! కానీ మన దేశంలో మాత్రం వీటన్నింటినీ వేరువేరుగా చూస్తున్న విధానం అమలు జరుగుతోంది. డోక్లాలో మన వీరులు చైనీయ ముష్కరులతో పోరాడుతున్న దృశ్యాలు ఆవిష్కృతమవుతునే ఉన్నాయి. మన భూభాగంలోకి చొరబడిన ఈ శత్రువులను బయటికి నెట్టివేయడనికి మన జవానులు తలపడుతున్నారు. ఈ దృశ్యాలను మాధ్యమ తరంగిణుల- టీవీ చానల్స్-లో మనం తిలకిస్తున్నాము. చైనాకు చెందిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’తో మన రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానపు ఒప్పందాలను, పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఉండడం సమాంతర పరిణామం! ముఖ్యమంత్రులు, మ త్రులు చైనాకు వెళ్లి రావడం, అక్కడి బుల్లెట్ రైళ్ల గురించి, ఎఱ్ఱగంధం బొమ్మల గురించి ఇక్కడ ప్రచారం చేయడం అంతర్జాతీయ సమజం విస్మయంతో తిలకిస్తున్న పరిణామ క్రమం! మన ఎఱ్ఱ చందనం కలప భారీగా చైనాకు తరలిపోతోంది, కౌరుచౌకగా కదిలిపోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు చైనాకు వెళ్లి ‘ఎఱ్ఱ గంధం చెక్కలను కొనుగోలు చేయండని’ చైనా సంస్థలను ఆహ్వానించి కూడ వచ్చారట! ఇలా సక్రమంగా గంధం దుంగలను తరలించుకొని పోవడంలో చైనా సంతృప్తి చెందడం లేదు. చైనా నుండి వస్తున్న నేరస్థులు అక్రమంగా ఎఱ్ఱచందనం చెక్కలను దొంగరవాణా చేస్తున్నారు. ఇలా గంధం కలపను కాజేసిన చైనా ఈ కలపతో తయారైన బొమ్మలను మళ్లీ మన దేశానికి ఎగుమతి చేస్తోంది. ప్రాకృతిక సంపద, ముడిసరుకు మనది, పారిశ్రామిక ఉత్పత్తులు చైనావి..
తమ ప్రాణాలను సైతం సమర్పించి సరిహద్దులకు ప్రాణం పోస్తున్న త్యాగమయ జీవనులు సైనికులు, సరిహద్దు భద్రతా దళాలవారు, సముద్ర తీర రక్షణ బృందాలవారు, భారత్ టిబెట్ సరిహద్దు రక్షణ దళాలవారు, ఇతర అనుబంధ సైనికులు, పోలీసులు.. వీరందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపి ఉన్నాడు. వీరుల పట్ల దేశ ప్రజలకు సదా ఉన్న కృతజ్ఞతా భావం ప్రధాని ప్రసంగంలో ప్రస్ఫుటించింది. మన దేశాన్ని నలువైపుల నుంచి ది గ్బంధం చేస్తున్న చైనా ముష్కర మూకలతో మ న వీరులు తలపడుతుండడం సరిహద్దులలో నెలకొని ఉన్న దృశ్యం! ఈ దృశ్యాన్ని తిలకించిన తరువాత కూడ మన ప్రభుత్వాలు చైనా సంస్థలకు మన పారిశ్రామిక పథకాలను కట్టబెట్టవలసిందేనా? మనం చైనా వారి వస్తువులను కొనుగోలు చేయవలసిందేనా? చైనా పెట్టుబడుల కోసం దేబిరించవలసిందేనా? ఇలా మన ప్రభుత్వాలు చైనా పెట్టుబడుల కోసం దేబిరిస్తున్న దృశ్యాన్ని తిలకించిన మన సరిహద్దు సంరక్షకుల మనోభావాలు గాయపడవా? మన సైనికుల మనోబలాన్ని, చైనాతో మనం జరుపుతున్న ‘వాణిజ్యం’ దెబ్బ తీయడం లేదా? చైనా ప్రజలు గల్లీ గల్లీలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో భారతీయ భోజనాలు చేయడం లేదు. కానీ మన నగరాలలో, పట్టణాలలో, పల్లెలలో, గల్లీ గల్లీలోను చైనీయ క్షిప్ర భోజనశాల-చైనీస్ ఫాస్ట్ఫుడ్ సెంటర్లు ఏర్పడిపోయి ఉన్నాయి. చైనా దురాక్రమణ పట్ల, నిరంతరం జరుగుతున్న చొరబాట్ల పట్ల మన విద్యావంతులకు, మేధావులకు, ప్రముఖులకు ‘చీమలు కుట్టడం లేదు..’ మాతృభూమి స్వరూప సమగ్రత పట్ల తపన పడని స్వభావం కలవారు, ధ్యాస లేనివారు చైనీస్ ఫుడ్‌ను ఆవురావురమని ఆరగిస్తునే ఉన్నారు, ముక్కులు నలుపుకుంటూ, మూతులు తిప్పుకుంటూ...
చైనీయ వస్తువులను కొనవద్దని బోధన చేస్తూ అనేక జాతీయతా ఉద్యమ సంస్థలవారు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి స్వాతంత్య్ర దినోత్సవం వరకు దేశవ్యాప్తంగా ‘జనజాగరణ’ చేసారు. డోక్‌లాంలోకి చొరబడి పోయిన చైనీయ దళాలు ఉత్తరఖండ్‌లోని బారాహోటిలోకి చొరబడడం సమాంతర పరిణామం. మంగళవారం లడక్‌లోకి చొరబడి రాళ్లు విసిరారట. చైనా వాణిజ్య సంస్థలు మన దేశంలో ప్రవేశించడాన్ని నిషేధించడం లేదని గత 27వ తేదీన రాజ్యసభలో ప్రభుత్వం స్పష్టం చేయడం ముక్తాయింపు!