మెయన్ ఫీచర్

సాంస్కృతిక స్వాతంత్య్రం సిద్ధించిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోటిలోన కోరలున్న
నిశాచరులు జిహాదీలు
కరచి కరచి భరత భూమి
స్వరూపాన్ని చెఱచినారు
నిలువెల్లా కోరలున్న
నిశాసురులు తెల్లదొరలు
తరచి తరచి భరత జాతి
స్వభావాన్ని విఱిచినారు!

స్వరూపం వికృతం అవడానికి పరాకాష్ఠ అఖండ భారతదేశం ముక్కలు చెక్కలు కావడం.. స్వభావం చెఱగిపోవడం కొనసాగుతున్న విదేశీయ భావదాస్యం.. డెబ్బయి ఏళ్ల స్వాతంత్య్రానికి ఇవి నేపథ్య వైపరీత్యాలు...
మనకు ‘జాతీయ కాలగణన’ పద్ధతి ఏర్పడి ఉంది. ‘కాలగణన’ను ‘శకం’ అని పిలవడం ఇప్పుడు రూఢ్యమైంది. అందువల్ల మనకు ‘జాతీయ శకం’ ఏర్పడి ఉంది. ఈ జాతీయ శకాన్ని 1938 ఏళ్లకు పూర్వం భారతదేశాన్ని పాలించిన ‘ప్రమర’ వంశపు సమ్రాట్టు శాలివాహనుడు ఆరంభించాడు. ఈ హేమలంబ నామ సంవత్సరం శాలివాహన శకం ప్రకారం 1939వ సంవత్సరం! ఈ జాతీయ కాలగణనను భారత ప్రభుత్వం ఆధికారికంగా క్రీస్తుశకం 1957 మార్చి నుండి అమలు చేస్తోంది! కానీ అరవై ఏళ్లుగా అమలు జరుగుతున్న ఈ ‘జాతీయ శకం’ గురించి దేశంలో ఎంతమంది విద్యావంతులకు తెలుసు? ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాల ఆరంభంలో మాత్రం జాతీయ శకాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు! జాతీయ శకం మన సాంస్కృతిక స్వాతంత్య్రానికి, స్వజాతీయ నిష్ఠకు నిదర్శనం. సాంస్కృతిక స్వాతంత్య్రం మనకు వచ్చిందా? వచ్చి ఉన్నట్టయితే అధికార కార్యకలాపాలన్నీ ఈ జాతీయ శకం ప్రకారం జరిగేవి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ‘అశ్విన’ లేదా ‘ఆశ్వయుజ’, కార్తిక, ‘అగ్రహాయణ లేదా ‘మార్గశీర్ష’, పుష్య, మాఘ, ఫాల్గున- అన్నవి ఈ ‘జాతీయ శకం’లోని నెలలు. ఈ నెలలు అనాదిగా మనదేశంలో జనం పాటిస్తున్నవే! బ్రిటన్ దురాక్రమణ మన దేశంలో వ్యవస్థీకృతం అయ్యేవరకు దేశమంతటా ‘కలియుగం’ కాలగణనకు ప్రాతిపదిక! ఉత్తర భారతంలోని అధిక ప్రాంతాల్లో ‘విక్రమ శకం’ దక్షిణ భారతంలో శాలివాహన శకం స్థిరపడడం దాదాపు రెండు వేల ఏళ్ల చరిత్ర. ‘కలియుగం’ ప్రకారం ప్రస్తుతం 5119వ సంవత్సరం నడుస్తోంది. కలియుగం 3044వ సంవత్సరంలో విక్రముని ‘సంవత్’ అన్న కాలగణన మొదలైంది! విక్రముడు శాలివాహనుని కంటే పూర్వుడు. విక్రముని మునిమనువడు శాలివాహనుడు.. కలిశకం కాని, విక్రమ శకం కాని, శాలివాహన శకం కాని ‘మతం’ పేరుతో వెలసిన శకాలు కావు! సర్వమత సంపుటమైన భారత జాతీయ సమాజానికి సంబంధించినవి. నిజానికి ‘కలియుగ’ కాలగణన కేవలం భారతదేశానికి సంబంధించినది. ఖగోళ వ్యవస్థలోని కాలానికి సంబంధించిన పరిణామ క్రమం ప్రాతిపదికగా రాత్రింబవళ్లు, ఋతువులు, సంవత్సరాలు, ‘యుగాలు’, ‘మహాయుగాలు’, ‘మన్వంతరాలు’, ‘కల్పాలు’ ఏర్పడుతున్నాయి. అందువల్ల ‘కలియుగం’ కాని, కలియుగ కాలగణన కాని ఒక మతం కాదు, మతతత్త్వం కాదు, మతోన్మాదం కాలేదు! అలాగే ‘విక్రమ’ సంవత్ కాని, శాలివాహన శకం కాని మతంతో ముడివడి లేవు! అందువల్లనే ఇవి సర్వమత సమభావానికి వేల ఏళ్లుగా ప్రతీకలు! బ్రిటన్ ‘దొరలు’గా చెలామణి అయిన దొంగలు ఈ సర్వమత సమభావ కాలగణన పద్ధతులను తొలగించారు. తాము మోసుకుని వచ్చిన ‘క్రీస్తు శకాన్ని’ మన నెత్తికెత్తారు! క్రీస్తుశకం మతంతో ముడివడి ఉంది! ఇలా సర్వమత సమభావ శకాలు అధికార, పాలన, విద్యా,వాణిజ్య రంగాల నుంచి తొలగిపోయి కేవలం ఒక మతానికి పరిమితమైన క్రీస్తుశకం ఇక్కడ విస్తరించడం బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు సాధించిన విజయం, భారత జాతికి దాపురించిన సాంస్కృతిక పరాజయం!
బ్రిటన్ వారు నిష్క్రమించిన తరువాత పదేళ్లకు మన ప్రభుత్వం ‘జాతీయ అధికార శకం’గా సర్వమత సమభావ చిహ్నమైన శాలివాహన శకాన్ని ప్రకటించింది! క్రీస్తుశకం 1957 మార్చి 22వ తేదీన శాలివాహన శకం- జాతీయ శకం- 1879 చైత్రమాసం ఒకటవ రోజు ఆరంభమైంది. కలియుగం ప్రకారం అది 4059వ సంవత్సరం, విక్రమ శకం ప్రకారం అది 2015వ సంవత్సరం! అరవై ఏళ్లు గడిచిపోయినప్పటికీ జాతీయ శకం ప్రసిద్ధం కాలేదు! ‘విద్యావంతులు’గా చెలామణి అవుతున్న వారిలో అత్యధికులు ఉదయాన నిద్రలేవరు లేచినా వారిలో అధికాధికులు దూరదర్శన స్రవంతులను చూడరు. ‘ఆకాశవాణి’ని వినరు! అందువల్ల ‘జాతీయ శకం’ సంవత్సరాన్ని, నెలను, రోజును ఈ మాధ్యమాలలో ఉటంకించడం చాలామందికి తెలియదు, తెలిసినవారిలో ఎక్కువమంది ‘ఇదేదో అర్థం కాని పంచాంగం చెబుతున్నారు..’ అని భావిస్తున్నారు! దేశంలో చాంద్రమానం నెలలు, ‘నిరయణ’ సౌరమానం నెలల ప్రసిద్ధమై ఉన్నాయి. కాని భారత ప్రభుత్వం అప్రసిద్ధమైన, జనానికి అర్థం కాని ‘సాయన’ సౌరమానాన్ని ఈ జాతీయ శకానికి ప్రాతిపదికగా నిర్ణయించింది. ఇలా నిర్ణయించరాదని, ‘నిరయణ’ సౌరమానాన్ని జాతీయ శకానికి ప్రాతిపదికగా నిర్ణయించాలని క్రీస్తుశకం 1950వ దశకం జాతీయ పంచాంగకర్తలు అనేకమంది కోరారట! కానీ ప్రభుత్వం వారు వినలేదు. అందువల్లనే గందరగోళం ఏర్పడి ఉంది. చాంద్రమానంలోని చైత్రం వంటి నెలలతోకాని, నిరయణ సౌరమానంలోని ‘మేషం’ వంటి నెలలతోకాని ఈ జాతీయ శకంలోని చైత్రాది నెలలకు ఏర్పడిన ‘జాతీయ శకాన్ని’ పాశ్చాత్యులు ‘గ్రెగేరియన్’ కాలండర్‌తో అనుసంధానం చేయడం కొనసాగుతున్న భావ దాస్యం.. ఏదీ సాంస్కృతిక స్వాతంత్య్రం?
అంతర్జాతీయ వ్యవహారాలలో క్రీస్తుశకాన్ని, ‘గ్రెగేరియన్’ కాలండర్‌ను పాటించవచ్చు. కానీ అంతర్గత వ్యవహారాల్లో జాతీయ శకమైన శాలివాహన శకాన్ని మనం ఎందుకు పాటించరాదు? నెలలో రెండవ శనివారం అన్నప్పుడు ‘జాతీయ పంచాంగం’-నేషనల్ కాలెండర్- లోని చైత్రాది నెలలలో రెండవ శనివారం కావాలి! ప్రభుత్వ కార్యాలయాలలోను, ప్రభుత్వేతర సంస్థలలోను, విద్యా సంస్థలలోను ‘ఒకటవ రోజు’ అని అంటే ‘జాతీయ శకం’లోని ‘చైత్రం’ మాసం ఒకటవరోజు కావాలి. ఇలాగే ఫాల్గున మాసం వరకూ పాటించాలి. ఈ ‘పాటింపు’ ప్రాతిపదికగానే, ఉద్యోగులకు జీతాలను ఈ జాతీయ పంచాంగ ‘చైత్రం’వంటి నెలల ప్రాతిపదికగా ఇవ్వాలి. పండుగల సెలవులను, జాతీయ ఉత్సవాల సమయాన్ని ‘జాతీయ శకం’ ప్రాతిపదికగా ప్రకటించాలి. అంటే ఆర్థిక సంవత్సరం, విద్యా సంవత్సరం వంటి వాటిని జాతీయ శకం ప్రాతిపదికగా లెక్కించడం మొదలుపెట్టాలి! ఈ జాతీయ శకం ప్రాతిపదికగా క్రీస్తుశకాన్ని అనుసంధానం చేసుకోవాలి గానీ, క్రీస్తుశకం ప్రాతిపదికగా జాతీయ శకాన్ని అనుసంధానం చేయరాదు.. సాంస్కృతిక స్వాతంత్య్రం అప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది.
క్రీస్తుశకాన్ని మన జాతి స్వచ్ఛందంగా స్వీకరించలేదు. బ్రిటన్ సామ్రాజ్యవాదులు వంచనతో కలియుగ కాలగణనాన్ని, విక్రమ సంవత్‌ను శాలివాహన శకాన్ని వ్యవహారం నుంచి తొలగించారు, క్రీస్తు మత శకాన్ని రుద్దిపోయారు. అనాదిగా సర్వమత సమభావ వ్యవస్థ పరిఢవిల్లుతున్న దేశంలో ఒక మత శకం మిగిలిన మతాల వారి నెత్తికెక్కడం వైపరీత్యం కాదా? మన జాతీయత సర్వమతాల సంపుటం! ఈ జాతీయతను నిలబెట్టడం కోసమే విక్రముడు 2074 ఏళ్లకు పూర్వం ‘సంవత్’ను ఆరంభించాడు. నేపాల్ అప్పుడు మన దేశంలో భాగం. నేపాల్‌లోనే విక్రముడు తన ‘సంవత్’-కాలగణన-ను ఆరంభించాడు! కలియుగం 2552వ సంవత్సరంలో అంటే క్రీస్తునకు పూర్వం 550వ సంవత్సరంలో సైరస్ అనే ‘శక’ రాజు మన దేశంలోకి చొరబడి అనేక ప్రాంతాలను దురాక్రమించాడు. ‘శక’ దేశం నేటి ఇరాన్. తన దురాక్రమణకు చిహ్నంగా ఇతగాడు ‘శకాన్ని’ ఆరంభించాడు. ఈ సైరస్ శకం కలియుగ కాలగణనను దిగమింగింది. ‘విక్రముడు’ కలియుగం 3020లో భారత ‘సమ్రాట్’ అయ్యేనాటికి ఈ సైరస్ శకం బహుళ ప్రచారంలో ఉంది. సైరస్ ‘శకేంద్రుడు’! ఈ విదేశీయ భావదాస్యం నుండి భారత జాతిని విముక్తం చేయడానికై ‘విక్రముడు’ కొత్త ‘జాతీయ కాలగణన’ ‘సంవత్’ను ఆరంభించాడు. విక్రముడు ‘శకారి’ అంటే ‘శకు’లను దేశం నుండి తరిమివేసినవాడు! భావదాస్యానికి విముక్తి విక్రముని నూతన ‘సంవత్’! విక్రముడు కొత్త శకాన్ని ఆరంభించిన తరువాతనే రోము చక్రవర్తి జూలియస్ సీజర్ తన ‘జూలియస్ కాలెండర్’ను ఆరంభించాడు, ఈ జూలియన్ కాలెండర్ తప్పుల తడకగా మారడం తరువాతి కథ. ఈ జూలియన్ కాలెండర్ క్రైస్తవ మత శకానికి ఆ తరువాత ప్రాతిపదిక అయింది. జూలియన్ కాలెండర్ తప్పుల తడకగా మారినందువల్ల పాశ్చాత్యులు తప్పులు దిద్దుకొని ‘గ్రెగేరియన్ కాలండర్’ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ‘గ్రెగేరియన్ కాలండర్’లో కూడ తప్పులు దొర్లుతున్నాయి!
విక్రముని తరువాత మళ్లీ మన దేశంలోకి చొరబడిన విదేశీయులు అనేక దశాబ్దుల పాటు భయంకర బీభత్సకాండను సాగించారు. ఈ బీభత్సకారులను తరిమికొట్టనవాడు విక్రముని ముని మనుమడైన శాలివాహనుడు! శాలివాహనుడు విదేశీయ బీభత్స మూకల నుండి దేశాన్ని విముక్తి చేయడమే కాక మనదేశానికి నిర్దిష్టమైన సరిహద్దులను ఏర్పరచినాడు, దేశానికి ‘హిందుస్థానం’ అన్న పేరుపెట్టాడు! ‘హిందుస్థానం ఇతిజ్ఞేయం..’ అని శాలివాహనుడు నిర్ధారించినట్టు చరిత్ర చెబుతోంది. ఇలా భౌతిక దురాక్రమణ నుంచి మాత్రమే కాక సాంస్కృతిక దురాక్రమణ నుంచి కూడ దేశాన్ని విముక్తం చేసిన వాడు కలియగం ముప్పయి రెండవ శతాబ్ది నాటి- అంటే క్రీస్తు శకం ఒకటవ శతాబ్దినాటి శాలివాహనుడు! శాలివాహన శకం ఈ దేశంలో ఇలా 1938 ఏళ్లుగా వ్యవహార శకం, సాధారణ శకం, సామాన్య శకం, ఇప్పుడు జాతీయ శకం, ప్రస్తుతం శాలివాహన శకం 1939వ సంవత్సరం నడుస్తోంది! అందువల్ల క్రీస్తుశకాన్ని ‘వ్యవహార శకం’గా కాని, సాధారణ శకంగా కాని, సామాన్య శకంగా కాని భావించడం భావదాస్యపు వారసత్వం. క్రీస్తు శకాన్ని కేవలం ‘క్రీస్తుశకం’గా మాత్రమే గుర్తించడం న్యాయం..
మన దేశంలోకి కలియుగం 3814వ సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 712లో జిహాదీ బీభత్సకారులు చొరబడ్డారు. ఈ జిహాదీలు శతాబ్దుల తరబడి జాతీయ స్ఫూర్తి కేంద్రాలను ధ్వంసం చేసారు. స్వజాతీయులు మళ్లీ నిర్మించుకున్నారు. మన పుస్తకాలను జిహాదీలు తగలబెట్టారు. భారతీయులు మళ్లీ వ్రాసుకున్నారు.. ఇలా లాభం లేదని భావించిన బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు తమ విద్యావిధానం ద్వారా మన ‘మస్తకాల’ను తగులబెట్టి పోయారు! స్వతంత్ర భారతంలో బ్రిటన్ బౌద్ధిక వారసత్వం కొనసాగుతుండడానికి ఇదీ కారణం.
భావదాస్య మధువు క్రోలి
స్వభావాన్ని మరచి సోలి
విదేశీయ వారసత్వ
విష హర్మ్య సుఖాల తూలి
స్వభూమీయ స్మృతి తప్పిన
స్వజాతీయ మతి తప్పిన
తన సంతతి- ‘స్వాతంత్య్రం
వచ్చిందని’ వదరుచుంటె
‘‘ఏదీ? ఎక్కడ ఉందని’’
వెదకు చున్నదోయ్ భారతి!

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్ : 99510 38352