అంతర్జాతీయం

4వేల ఏళ్లనాటి బాకు లభ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రాటిస్లావా: మధ్య ఐరోపాలోని స్లొవాకియాలో నాలుగువేల సంవత్సరాల నాటి డాగర్ (కత్తి) పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. హ్లోవెక్ పట్టణంలో అరుదైన ఈ ఆయుధం లభించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డేవిడ్ అనే గ్రాడ్యుయేట్ బృందం తవ్వకాల్లో వా నదీ తీరంలో దీన్ని కనుగొన్నట్టు జిన్‌హువా వార్తా సంస్థ పేర్కొంది. ‘కాంస్యంతో తయారైన ఈ బాకు రాజసం ఉట్టిపడేలా ఉంది’ అని పురావస్తు శాస్తవ్రేత్త మ్యాటుస్ స్లడాక్ వెల్లడించారు. 24.5 సెంటీమీటర్ల పొడవు 320 గ్రాముల బరువున్న ఈ కత్తి ఎక్కడా చెక్కుచెదరలేదు. పట్టుకోడానికి పటిష్టమైన పిడికిలితో చివర్లో తెరుచుకునే విధంగా మూడు బ్లేడ్లు అమర్చబడి ఉన్నాయి. మధ్య యూరోపియన్ లోహయుగం నాటిదని, బహుశా నాలుగువేల సంవత్సరాల నాటిదై ఉంటుందని భావిస్తున్నారు. స్లొవాకియా, చెకొస్లేవేకియాలో అలాంటివి వాడినట్టు ఇప్పటికీ అనేక ఆధారాలున్నాయి. వా నది ఒడ్డున దొరికినంత మాత్రాన అది అక్కడిది కాదని, ఎక్కడినుంచో తీసుకొచ్చిన ఇక్కద వదిలి ఉంటారని స్లడాక్ స్పష్టం చేశారు. స్లొవాకియాలో ఇప్పటికీ ఇలాంటివి నాలుగు డాకూలున్నట్టు పురావస్తు నిపుణులు తెలిపారు.