అంతర్జాతీయం

మాకేం తెలియదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ గురించి తమకేమీ తెలియదని చైనా బుధవారం వాదించింది. లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు సమీపంలో భారత భూభాగంలోకి చొరబడడానికి యత్నించిన చైనా సైన్యాలను భారత జవాన్లు నిలువరించడానికి యత్నించడంతో ఉద్రిక్తత తలెత్తిందని బుధవారం మీడియా కథనాలు పేర్కొన్న నేపథ్యంలో చైనా వాటిపై స్పందించింది. ఈ సంఘటన గురించి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హు చున్యింగ్‌ను ప్రశ్నించగా, దానిగురించి తనకేమీ తెలియదని ఆమె చెప్పారు. అంతేకాదు చైనా సైన్యాలు ఎల్లప్పుడు కూడా సరిహద్దుల్లో శాంతిభద్రతలను పరిరక్షించడానికే ప్రయత్నిస్తాయని కూడా ఆమె చెప్పారు.
భారత భూభాగంలోకి చొరబడడానికి యత్నించిన చైనా సైనికులను సరిహద్దుల్లో కాపలా కాస్తున్న భారత జవాన్లు నిలువరించినట్లు బుధవారం మీడియాలో కథనాలు వచ్చాయి. చైనా సైనికుల చేతుల్లో ఐరన్ రాడ్‌లు, రాళ్లు కూడా ఉన్నాయని, తోపులాటలో ఇరువైపులా కొంతమందికి స్వల్పగాయాలయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. చైనా సైనికులు రాళ్లు కూడా రువ్వారని, అయితే వెంటనే పరిస్థితిని అదుపులోకి తేవడం జరిగిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు. అనధికారిక సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి) వెంబడి ఇలాంటి చిన్న చిన్న ఘర్షణలు సర్వసాధారణమని జమ్మూ, కాశ్మీర్ పోలీసులు అంటున్నారు. కాగా, డోక్లామ్‌లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనపై చైనా మరోసారి తన వాదననే కొనసాగించింది. ఇరుపక్షాల మధ్య చర్చలు ప్రారంభం కావాలంటే భారత సైన్యాలు ఆ ప్రాంతంనుంచి వైదొలగాలన్నది తాము ముందునుంచీ చెప్తున్న షరతని చున్యింగ్ స్పష్టం చేశారు. ఈ సరిహద్దు వివాదం కారణంగా ప్రతి స్వాతంత్య్ర దినోత్సవంనాడు ఇరు దేశాల సరిహద్దు జవాన్ల మధ్య జరిగే సమావేశం ఈ ఏడాది జరగలేదు. భారత సైన్యం పంపిన సందేశాలకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ) అధికారులు స్పందించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఉత్తర లడఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ, అరుణాచల్ ప్రదేశ్‌లోని కిమితూ, లడఖ్‌లోని చుశుల్, అరుంచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సమీపంలోని బుమ్-లా, సిక్కింలోని నాథులా మొత్తం అయిదుచోట్ల ఈ చర్చలు జరుగుతాయి.
చిత్రం.. లడఖ్ ప్రాంతం (ఫైల్ ఫొటో)