రంగారెడ్డి

మీజిల్స్, రుబెల్లా నివారణకు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్: మీజిల్స్, రుబెల్లా నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డి.దివ్య పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంగం లక్ష్మిబాలికల గురుకుల పాఠశాలలో మీజిల్స్, రుబెల్లా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఒక టీకాతో రెండు వ్యాధులు నివారించవచ్చని అన్నారు. టీకాలు వేయించుకున్న విద్యార్థులు ఇంటికి వెళ్లి ఇరుగుపొరుగుకు టీకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. టీకాలు వేయించుకోవడంపై అపోహలు మానుకుని, టీకాలు వేయించుకోవాలని, కొందరు టీకాలకు భయపడతారని, ఆరోగ్యం బాగుండాలంటే నొప్పి ఉన్నా టీకాలు వేయించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ దశరథ్, జిల్లా విద్యాధికారి ఎం.దీపిక, జిల్లా సంక్షేమాధికారి జ్యోత్స్న, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుధాకర్ షిండే, ప్రోగ్రాం అధికారి లలిత, డిప్యూటి డిఎంహెచ్‌వో మనోహర్, జిల్లా మాస్ మీడియా అధికారి చంద్రయ్య, డిసిసిబి డైరక్టర్ ఎన్.కిషన్ నాయక్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ప్రహ్లాద రావు, మెడికల్ సూపర్‌వైజర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
ధారూర్: తొమ్మిది నెలల నుండి 15 సంవత్సరాల వయస్సు పిల్లలకు మీజిల్స్, రుబెల్లా టీకాలను వేయించి తట్టు, తదితర వ్యాధులనుండి కాపాడుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ పద్మజ అన్నారు. గురువారం ధారూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు టీకా వేసే కార్యక్రమాన్ని పరిశీలంచారు. రాష్ట్రంలో చిన్నారి పిల్లలెవరూ తట్టు బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రమైన నీటిని తాగాలని సూచించారు. మండల పరిషత్ అధ్యక్షురాలు ఉమాపార్వతి మాట్లాడుతూ మండంలోని పిల్లలందరికీ టీకాలు వేయించేలా అంగన్‌వాడీ టీచర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరికీ పాఠశాల దగ్గరికి వెళ్లి టీకాలు వేయాలని అన్నారు. కార్యక్రమంలో ధారూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు నాయక్, కోఆప్షన్ సభ్యుడు హఫీజ్ పాల్గొన్నారు.
కొడంగల్: తొమ్మిది నెలల నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలందరికి వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని అంగడిరాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు సరస్వతి అన్నారు. గురువారం మండల పరిధిలోని రుద్రారంలో రూబెల్లా టీకాల పంపిణీని తహశీల్దార్ వెంకటేష్‌తో కలిసి ప్రారంభించారు. టీకాలు వచ్చే నెల 23వ తేది వరకు ఆయా గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఉపకేంద్రాల్లో వేస్తారని చెప్పారు.
బొంరాస్‌పేట: విద్యార్థులు అందరూ తప్పనిసరిగా రుబెల్లా నిరావణ టీకాలు వేయించుకోవాలని జడ్పీటిసి జ్యోతిరెడ్డి ఆన్నారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన రుబెల్లా టీకాల కార్యక్రమంలో ఎంపిపి మంగమ్మతో కలిసి పాల్గొన్నారు. తట్టు, రుబెల్లా వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున టీకాలు వేయించుకోవాలని కోరారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రవీంద్ర యాదవ్ మాట్లడుతూ బొంరాస్‌పేటలో 1413 మంది విద్యార్థులకు రుబెల్లా నివారణ టీకాలు వేశామని తెలిపారు. డాక్టర్ కొండల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వినాయక చవితికి ముస్తాబైన బొజ్జగణపయ్యలు

తుదిమెరుగులు దిద్దుతున్న కళాకారులు * ముందుగానే కొనుగోలు చేస్తున్న యువత

షాద్‌నగర్ టౌన్: వినాయక చవితి పర్వదినానికి బొజ్జగణపయ్యలు ముస్తాబవుతున్నాయి. వినాయక చవితి పండగ సమీపిస్తుండటంతో బొజ్జగణపయ్యలకు కళాకారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. వినాయక చవితి పండగను పురస్కరించుకుని కళాకారులు వివిధ రకాల ఆకారాల్లో వినాయక విగ్రహాలను తయారు చేశారు. షాద్‌నగర్ పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన వినాయక విగ్రహాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలను తయారు చేసేందుకు మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి కళాకారులు ఇక్కడకు వచ్చి బొజ్జగణపయ్యలను తయారు చేస్తున్నారు. బొజ్జగణపయ్యలను తయారు చేయుటలో కళాకారులు బిజిబిజిగా ఉన్నారు. భక్తులు నచ్చే విధంగా గణేష్ విగ్రహాలను తయారు చేసి విక్రయించేందుకు సిద్ధంగా పెట్టారు. అంతేకాకుండా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ముందు నుంచే కొనుగోలు చేస్తే ధర తక్కువగా ఉంటుందనే ఉద్ధేశ్యంతో వ్యాపారులు ముందుగానే విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే ప్రస్తుత ఏడాది కళాకారులు రకరకాల విగ్రహాలను తయారు చేయడంతో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి నుంచే వ్యాపారులు వినాయక విగ్రహాలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు కొనసాగిస్తున్నారు. వినాయక చవితి పండగ రోజులు సమీపిస్తుండటంతో వినాయక చవితి నిర్వాహక కమిటి సభ్యులు విగ్రహాలను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు శంషాబాద్ తదితర ప్రాంతాలకు ముందుగానే తరలివెల్లి బుకింగ్ చేసుకుంటున్నారు. గత సంవత్సరం కంటే ప్రస్తుత ఏడాదిలో 25నుంచి 30శాతం వినాయక విగ్రహాల ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కళాకారులు పేర్కొంటున్నారు. వినాయక విగ్రహాల ఆకారాన్ని బట్టి ధరలు నిర్ణయిస్తామని తెలిపారు. వినాయక విగ్రహాలను తయారు చేసేందుకు మహారాష్ట్ర, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి ముడిసరుకులను తీసుకురావాల్సి వస్తుందని, దీంతో రవాణా చార్జీలు సైతం పెరిగిపోయాయని, ఈ భారం విగ్రహాలపై పడుతుందని కళాకారులు పేర్కొంటున్నారు. ఆగస్టు 25న వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఇప్పటికే భారీ మొత్తంలో వినాయకులను తయారు చేసి సిద్ధం చేశారు. షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో మల్లేష్ అనే యువకుడు మట్టి వినాయకులను తయారు చేస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వినాయక విగ్రహాల విక్రయం ఏవిధంగా ఉంటుందో వినాయక చవితి పర్వదినం వరకు వేచి చూడాలని వ్యాపారులు అంటున్నారు. కాగా, విఘ్నేశ్వరులను తయారు చేసేందుకు పది లక్షలకు పైగా ఖర్చు పెట్టామని, గిట్టుబాటు ఏమాత్రం రావడం లేదని, ఆర్థికంగా నష్టలను చవిచూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని రాజస్థాన్ వ్యాపారి కేతారామ్ వివరించారు. రూ.1500 నుండి రూ.15వేల ధరల్లో వినాయక విగ్రహాలు ఉన్నాయని, సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండే విధంగానే విగ్రహాలను తయారు చేసినట్లు తెలిపారు. వర్షాలు లేవు.. వినాయకులను ఈ ఏడాది ఏ విధంగా కొనుగోలు చేస్తారో తెలియడం లేదని పేర్కొన్నారు. తయారు చేసిన విగ్రహాలు విక్రయిస్తేనే తమకు గిట్టుబాటు లభిస్తుందని వివరించారు.

యజ్ఞంలా హరితహారం
* ప్రతి గ్రామంలో 40వేలకు పైగా మొక్కలు నాటాలి * కలెక్టర్ ఎంవి రెడ్డి
మేడ్చల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఓ పవిత్ర యజ్ఞంలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి ప్రజాప్రతినిధులకు అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మండల, జిల్లా అధికారులు, విఆర్వోలు, కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్.. ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్లు, తదితర అంశాలపై సర్పంచ్‌లను అధికారులను అడిగితెలుసుకున్నారు. గ్రామ ప్రణాళికను అన్‌లైన్ ఎందుకు చేయలేదని ఎంపిడిఓ దేవసహయం, ఇఓపిఆర్డీ రమేశ్‌ను నిలదీశారు. గ్రామ ప్రణాళికలను అన్‌లైన్ చేయాలని ఆదేశించారు. గ్రామ ప్రణాళిక కమిటీ ద్వారా తీర్మానించి పనులపై సర్పంచ్‌లు ఈశ్వర్, నరేందర్‌రెడ్డి, స్రవంతిలను అడిగితెలుకున్నారు. ఈశ్వర్ మాట్లాడుతూ గుండ్లపోచంపల్లి ప్రణాళిక బడ్జెట్ రూ. 2కోట్లు అవుతుందని వివరించారు. గ్రామ ఆదాయం ఎంత అన్ని కలెక్టర్ ఆడుగగా రూ. కోటి ఉంటుందని వివరించారు. గ్రామ పంచాయతీకి మిగులు బడ్టెజ్ ఉంది కదా కలెక్టర్ చమత్కరించగా.. సిబ్బంది జీత భత్యాలకు రూ. 80 లక్షల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. కండ్లకోయ ప్రణాళిక బడ్జెట్ రూ. కోటి వుందని ఆదాయ రూ. 70 లక్షల వరకు ఉందని వివరించారు. రూ. 30లక్షలు ఎలా సర్దుకుంటారని ప్రశ్నించగా దాతలు ఇతరత్రా నిధులతో సమకూర్చుకుంటామని సర్పంచ్ సమాధానం ఇచ్చారు. పూడూరు సర్పంచ్ స్రవంతి తమ గ్రామ ప్రణాళిక కోటి రూపాయలని ఆదాయం కేవలం రూ. 23లక్షలేనని వివరించగా లోటు బడ్జెట్‌ను ఎలా సర్దుబాటు చేస్తారు అని కలెక్టర్ ప్రశ్నించగా ఎంపి, ఎమ్మెల్యేల నిధులతో పాటు దాతల సహాయం కోరుతామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలోని వనరులను సద్వినియోగం చేసుకుని ఆదాయం పెరిగేలా పాటుపడాలని కలెక్టర్ ఈ సందర్భంగా సర్పంచ్‌లకు సూచించారు. గ్రామ ప్రణాళిక కమిటీలలో ఎంపిటిసిలకు ప్రాతినిథ్యం కల్పించకపోవడంపై ఎంపిటిసి మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా కలెక్టర్ వెంటనే స్పందించి ఎంపిటిసిలకు కూడా అందులో ప్రాతినిథ్యం కల్పించాలని సర్పంచ్‌లను అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలకు తావివ్వకుండా ఎంపిటిసిలతో పాటు అందరిని కలుపుకు పోవాలని ఆయన సూచించారు. జిల్లాస్థాయి సమావేశాలకు ఎంపిటిసిలను ఎందుకు ఆహ్వానించడంలేదని మోహన్‌రెడ్డి కలెక్టర్‌ను ప్రశ్నించగా ఆహ్వానించాల్సిన అవసరం లేదని గ్రామానికి ప్రధానంగా సర్పంచ్ అన్నీ తానై చూసుకుంటాడు కాబట్టి సర్పంచ్‌కు ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. మేడ్చల్ మండలంలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛ్భారత్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన సర్పంచ్‌లను అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. మహిళల ఆత్మభిమానం దెబ్బతినకుండా కృషి చేసినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. పవిత్ర ఆశయంగా భావించి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు.
పిల్లలను ఎండలో నిల్చోబెట్టకండి..
ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎవరైనా మంత్రులు విచ్చేస్తుంటే పాఠశాల విద్యార్థులను గంటల తరబడి ఎండల్లో నిల్చోబెట్టరాదని డిఇఓ ఉషారాణిని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. హరితహారంపై విద్యార్థుల్లో కూడా అవగాహన కల్పించడానికి మాత్రమే వారిని కూడా భాగస్వాములు చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశంలేదన్నారు.
బోరుబావులకు అనుమతి తప్పనిసరి
ఎడాపెడా బోరుబావులు తవ్వుకుంటామంటే చెల్లదని కచ్చితంగా అధికారిక అనుమతి పొందాల్సిందేనని లేకుంటే క్రిమినల్ కేసులు తప్పవని కలెక్టర్ ఎంవి రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇళ్ల కోసం బోరుబావులు వేసే వారు ఇంటింటికీ 200 మీటర్ల దూరాన్ని పాటించాలచి నాలుగున్నర అంగుళాల డయామీటర్ ద్వారానే తవ్వించాలని అదే వ్యవసాయానికైతే 500 మీటర్ల దూరాన్ని పాటించాలని ఆరున్నర ఆంగుళాల ద్వారా బోరుబావిని తవ్వించుకోవచ్చని సూచించారు.