డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో పెరిగిన పిల్లల్లో కచ్చితంగా తేడా వుంది. వీళ్ళెవరూ మనసులో ఒకటీ, బయటకు ఒకటి మాట్లాడరు. చెప్పేది చెప్తున్నారు. చెబుతున్నది చేస్తున్నారు. కాని పెద్ద చిక్కు వాళ్ళందరితో ఎదుటివారిలో కూడా అదే ఆశిస్తున్నారు పాపం వాళ్ళ మనస్తత్వం అంతా క్రిస్టల్ క్లియర్. బతుకుతెరువుకు కావాల్సినవి తక్కువ.
కాని వివాహ వ్యవస్థ మారిపోతోంది. జాతి, మతం కులం అన్నిటికి అతీతమయిపోయింది. కేవలం, అబ్బాయి, అమ్మాయి అంతే! అందులో కుటుంబానికి చోటులేదు. వారి ఆలోచనకు విలువ లేదు. థాంక్ గాడ్. వౌళి అలా పెళ్లి చేసుకోలేదు. నేను జీవితంలో మరో ముఖ్యమైన ఆనందం పోగొట్టుకునేదానే్నమో!
ఈసారి నా మనసు మరీ స్థిరత్వం కోల్పోయింది. గతించిన గతంలోంచి గతి తెలియని భవిష్యత్తులోకి గంతులు వేస్తోంది. రుూ రోజు గురించి మాత్రం ఆలోచించడం లేదు. ఇవాళ రుూ క్షణం రుూ విమానంలో ఆలోచిద్దామనుకుంటే క్రితంసారి జరిగిన అనుభవం భయంగా మారుతోంది. వాస్తవానికి భయపడుతున్నప్పుడు మరోదారి, గతమో, భవిష్యత్తో మనసులోనికి రావాలి.
ఏముంది గతం గురించి ఆలోచిస్తే చేయి జారిపోయిన క్షణాల్లో, చేసిన వాటికి పశ్చాత్తామో, చెయ్యలేకపోయినవాటికి అసంతృప్తో బాధపెడతాయి.
భవిష్యత్తు! ఊహల్లో భవిష్యత్తు అంత అందమైన ప్రదేశం మరొకటి వుండదు. అది తియ్యని చిత్రం, ఊహల వలయం, మన మనసుకు యిష్టారాజ్యం. అందుకే అదే నాకు యిష్టం. కాని నా మనసుకు నా యిష్టాయిష్టాలతో సంబంధం లేదు. అది గతంలోకే జారుతానంటుంది.
నా మనసు వుయ్యాల వూగుతూనే వుంది. విమానం మద్రాసు చేరింది.
సుదీర్ఘమైన ప్రయాణం తరువాత అందరూ ఆతృతగా లేచారు. బ్యాగులు భుజాన వేసుకొని నిలబడ్డారు. నేను మాత్రం వెయిట్ చేశాను, వెళ్ళేవారిని వెళ్ళనివ్వాలని. మెల్లిగా చివరకు వచ్చేస్తోంది. నేను లేచి బయటకు వచ్చాను. ఒక్కసారి పరిచయమైన వాసన పరిసరాల్లో తొంగి చూచింది.
వుక్కగా వుండే మద్రాసు వాతావరణం, గాలిలో వాసన నా భారతీయతను గుర్తుచేసింది. ఎందుకో ఒక్కసారి ఒళ్ళు గగుర్పొడిచింది. మనసంతా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే కలిగే తన్మయత్వం కలిగింది. అక్కడ వున్న గాలిలో స్వచ్ఛత లేదు. కాని నా అభిమానంలో వుంది.
మృదువుగా వీస్తున్న గాలి ముఖానికి తగిలింది. వడలిపోయిన మెత్తని చేతులతో మామ్మ నా బుగ్గలు తడిమినట్లే అనిపించింది.
విమానం పైమెట్టు ఆగిపోయి క్షణకాలం చుట్టూ పరికించాను. నా ప్రజలు! నా దేశం! ఎందుకో ఒక్కసారి నా స్వంత ఇంటికివచ్చానన్న అనుభూతి కలిగింది. కాలు కదలనీయకుండా చేసింది.
పుణ్యభూమి నా దేశం నమో నమామి!
నిజంగా పుణ్యభూమే. పురాతన భూమి. ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందో? ఎన్నివేల ప్రదేశాలలో నిత్యం వేదపారాయణ జరుగుతోంది. ఎన్నివేల దేవతలు కొలువై ఉన్నారు. నిజంగానే పుణ్యభూమి!
వెనుకనుంచి ఎక్స్‌క్యూజ్‌మీ అన్న పదం వినిపించగానే ఎక్కడ ఆగిపోయానో గ్రహించాను. అందరూ వెళ్ళేదాకా ఆగి బయటకు వచ్చినా ఇంకా వెనుక ఇద్దరు ముగ్గురు వుండిపోయారు. విమానం గబగబా మెట్లు దిగాను. గంటల తరబడి కూర్చుని వుండటంతో కిందకు జారిన కుచ్చిళ్ళు, పాదాలకు అడ్డుపడ్డాయి. చివరి మెట్టు దగ్గరికి వచ్చేసరికి ముందుకు తూలాను.
అదృష్టవశాత్తు మరో ఇద్దరు నా రెండు జబ్బలు పట్టుకొని ఆపారు, లేకపోతే బోర్లపడిపోయి వుండేదాన్ని.
ముందుగా ఎడమప్రక్కకు చూచాను. మెట్ల ప్రక్కనే నుంచుని గైడ్ చేస్తున్న ఎయిర్‌పోర్టు వారి ఆఫీసర్.
‘‘్థంక్యూ థాంక్యూ’’’ అన్నాను. కొంచెం సిగ్గుపడుతూ ‘సారీ’ అని కూడా అన్నాను.
‘‘నో ప్రాబ్లమ్ మేడమ్, యిటు నుంచోండి రెండు నిమిషాలు’’ అంటూ పట్టుకున్న చేతిని వదలకుండానే పక్కకు నడిపించాడు.
అప్పుడు వెనకనుంచి పట్టుకున్న మరో వ్యక్తికి కూడా థాంక్స్ చెప్పాలని ప్రక్కకు చూడబోయాను.
అప్పటికే ఆ వ్యక్తి నన్ను దాటి వెళ్ళబోతున్నాడు. అతని దృష్టి అంతా ముందు ప్రయాణీకుల కోసం ఆగివున్న బస్సుమీద వుంది. హడావిడిగా దానివైపు నడిచాడు.
అతను నన్ను గమనించకపోయినా, నా దృష్టి ఒక్క క్షణం మాత్రమే అతనిమీద పడినా అతనెవరో గ్రహించాను.
‘మైగాడ్’ అనుకున్నాను. ‘రఘు’ గబగబా అడుగులు వేసి బస్సు ఎక్కుతున్నాడు.
భుజాన కంప్యూటర్ కేస్, చేతిమీద లండన్ ఫాగ్ గ్రే కలరు కోటు.
నా మొహంలో మారిన రంగులు చూచి బస్సు వెళ్లిందని కంగారు పడుతున్నానేమో అనుకుని మరో 10 నిమిషాల్లో మళ్లీ వస్తుంది మేడమ్ అన్నాడు ఆఫీసర్.
‘్థంక్యూ’ అని బస్ కోసం వెయిట్ చేయసాగాను.
కాని బస్ ఎక్కుతున్న రఘు మొహం కనిపిస్తూనే వుంది. వాట్ ఎ స్మాల్ వరల్డ్. దాదాపు 24 గంటలు కలిసి ప్రయాణం చేశాం, ఒక విమానంలో. కాని ఆ సంగతి ఇద్దరకు తెలియదు. చిరునవ్వు పెదవులమీదకు వచ్చింది.
సామాను తీసుకొని బయటకు వచ్చేటప్పటికి ఎదురుగా అన్నయ్య! అది తెలిసిన విషయమే, అన్నయ్య వస్తాడని. కాని ఆశ్చర్యం అన్నయ్య ప్రక్కన వదిన నుంచుని వుంది.
నన్ను చూడంగానే సంతోషంగా నవ్వింది.
‘‘ఏమిటి వదినా ఈ సర్‌ప్రైజ్’’ అన్నాను నేను సంతోషంగా!
‘‘అమెరికన్ రిటర్న్‌డ్ ఆడపడుచుకు ఆ మాత్రం స్వాగతం పలకడానికి రావద్దు. ఇప్పుడు నువ్వు పూర్వపు కల్యాణివి కాదు. అమెరికన్ రిటర్న్ అంది ఆవిడ మామూలు ధోరణిలో. ‘‘చాల్లే! నిజం చెప్పు’’.
‘‘కారణం ఏమీ లేదు. రెండు రోజులు నాకు బయటకు వెళ్లాలనిపించింది’’ అంది. నేను నమ్మలేదు. వదిన ఏ కారణం లేకుండా తన పద్ధతులు మార్చుకోదు.
అన్నయ్య కొంచెం చిక్కినట్లు కనిపించాడు. ముందు యిది చెప్పు ‘‘ఎలా అయింది నీ ప్రయాణం. వౌళి, కొత్తపెళ్లికూతురు ఎలా వున్నారు? నువ్వు బాగా ఎంజాయ్ చేశావా. అమెరికా అంతా చూశావా’’ వదిన ప్రశ్నల పరంపర కురిపించింది.
‘‘కాస్త ఆగు! దాన్ని వూపిరి పీల్చుకోని’’ అన్నాడు అన్నయ్య బయటకు దారితీస్తూ!
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి